»   » నా కొడుకు మోకాలికి గాయమైతేనే...పవన్ కళ్యాణ్

నా కొడుకు మోకాలికి గాయమైతేనే...పవన్ కళ్యాణ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

'ఆరు నెలల క్రితం నా కొడుకు కింద పడినప్పుడు మోకాలికి గాయమైన వాణ్నిచూసి తల్లడిల్లి పోయాను. ఆ క్షణంలో నాకు మేరీమాత గుర్తొచ్చారు. ఓ తండ్రిగా నేను కొడుకుకి చిన్న దెబ్బతగిలితేనే తట్టుకోలేక పోయాను. అటువంటిది కన్నకొడుకుకి శిలువవేస్తుంటే ఆ తల్లి హృదయం ఎంత తల్లడిల్లిపోయిందో అనిపించింది అంటున్నారు పవన్ కళ్యాణ్. జీసస్ జీవితగాధను ఆధారంగా చేసుకొని సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో ఇంగ్లీష్, హిందీ, తెలుగు, మళయాళ భాషల్లో ఆదిత్యా ప్రొడక్షన్స్ అధినేత కొండా కృష్ణంరాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. ఇక ఈ చిత్రం ప్రారంభోత్సవం మంగళవారం జెరూసలెంలో జరిగింది.

ప్రారంభోత్సవం అనంతరం అక్కడి నుంచి భారతదేశంలోని కొన్ని ముఖ్యపట్టణాలైన ముంబై, హైదరాబాద్, కొచ్చిలలో జరిగిన వీడియో టేలి కాన్ఫరెన్స్ లో పవన్, సింగీతం, కృష్ణంరాజు మీడియాతో మాట్లాడారు.ఈ సందర్భంగా పవన్ ఇలా స్పందించారు. అలాగే..నా కొడుకు విషయంలో జరిగిన కొన్ని రోజులకి కొండా కృష్ణంరాజు గారు వచ్చి నాకు ఈ జీసస్ కధ గురుంచి చెప్పారు. నా మనసుకు దగ్గరగా వున్న పాత్ర కావడంతో వెంటనే ఒకే అన్నాను. ప్రతి ఒక్కరికీ ప్రేమతత్వం బోధించే సినిమా ఇది. ఈ చిత్రంలో కధను నేరేట్ చేసే ఓ కీలక పాత్రను పోషిస్తున్నందుకు ఆనందంగా వుంది. 25 రోజుల పాటునేను ఈ చిత్రం షూటింగ్ లో పాల్గొంటాను' అన్నారు. ఈ చిత్రానికి రచన: జె.కె.భారవి, కెమెరా: శేఖర్‌.వి.జోసెఫ్‌, కళ: రవీందర్‌, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: శేషు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu