పవన్ నెక్ట్స్ సినిమా ఇదే.. రోమాలు నిక్కపొడిచే టైటిల్
Recommended Video

అజ్ఞాతవాసి చిత్రం తర్వాత పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ సినిమాల్లో నటిస్తారా.. ఒకవేళ నటిస్తే ఏ చిత్రం చేస్తారు అనే ప్రశ్నలను సినీవర్గాలు లేవనెత్తుతున్నాయి. అయితే పవన్ తన తదుపరి చిత్రాన్ని సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ తమిళ చిత్రాన్ని రీమేక్ చేయనున్నారని, అదికాకుండా మైత్రీ మూవీస్ బ్యానర్‌లో ఓ సినిమా చేస్తారనే వార్తలు మీడియాలో షికారు చేశాయి. కానీ ఏఎం రత్నం నిర్మాణంలో ఓ చిత్రం ప్రారంభం కానున్నదనే వార్త ఫిలింనగర్ సంచలనం రేపింది.

పవన్ సినిమా టైటిల్ చరిత్ర
అజ్ఞాతవాసి సినిమా తర్వాత పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ నటించే చిత్రం చరిత్ర. ఈ చిత్రానికి చరిత్ర అని ఖారారు చేసినట్టు తెలిసింది. నిశ్శబ్దం వీడి ఆయుధం అనే శీర్షికతో సినిమా ప్రారంభం కానున్నది. ఈ చిత్రానికి చెందిన పోస్టర్లు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.

ఏఎం రత్నం నిర్మాతగా
చరిత్ర చిత్రం ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం నిర్మాణ సారథ్యంలో రూపొందనున్నది. గతంలో ఏఎం రత్నం నిర్మాణ సారథ్యంలో సత్యగ్రహి చిత్రం చేయాల్సి ఉంది. కొన్ని కారణాల వల్ల ఆ చిత్రం పట్టాలేకపోయింది.

దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్
ఏఎం రత్నం చిత్రానికి మాయమహాల్ చిత్ర దర్శకుడు గోవింద్ లాలమ్ డైరెక్షన్ చేయనున్నారు. ఈ చిత్రానికి ఆకుల శివ డైలాగ్స్ రాస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించనున్నారు.

త్వరలోనే సెట్స్‌పైకి
చరిత్ర చిత్రానికి సంబంధించిన ముహుర్త కార్యక్రమాలు ఇప్పటికే ఏఎం రత్నం కార్యాలయంలో నిరాడబరంగా జరిగాయి. త్వరలోనే ఈ చిత్రం సెట్‌పైకి వెళ్లనున్నది. ఈ చిత్రానికి సంబంధించిన నటీనటుల వివరాలు, సాంకేతిక నిపుణుల పేర్లను త్వరలోనే అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











