twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిన్న చిన్న విషయాల్లోనూ పవన్ ...అందుకే లేటు

    By Srikanya
    |

    హైదరాబాద్ : సర్ధార్ గబ్బర్ సింగ్ సినిమా వర్క్ ప్రారంభమై చాలా కాలం అయ్యింది. దాదాపు మూడేళ్ల నుంచీ ఈ ప్రాజెక్టు నలుగుతూనే ఉంది. అసలు ఎందుకింత లేటు అవుతోంది అంటే...పవన్ ఈ సినిమాని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ సినిమాకు సంభందించిన ప్రతీ చిన్న విషయంలోనూ ఆయన అత్యంత శ్రద్ద వహిస్తున్నారు. దాంతో లేటు అవుతోంది.

    అంతెందుకు 5 కోట్లు ఖర్చుపెట్టి వేసిన రత్నపూర్ విలేజ్ సెట్ లో ప్రతి చిన్న పనిని కీన్ గా అబ్సర్వ్ చేస్తున్నారు. ఈ సెట్ కు సంబందించి ఏవిదంగా షాప్స్ వుండాలి, ఎంట్రన్స్ ఎలా ఉండాలి.., షాట్ పెడితే దాని వెనక బ్యాక్ గ్రౌండ్ లో ఏం కనపడాలి..వంటివన్నీ తానుగా చూసుకుంటున్నారు.

    Pawan Kalyan personal attention on Sardaar Gabbar Singh

    ఈ సినిమా ఆర్ట్ డైరక్టర్ బ్రహ్మ కడలి చేత మొదట మినియేచర్ సెట్ వేయించారు. తాను సాటిస్ ఫై అయ్యేదాకా మార్పులు చెప్తూనే ఉన్నారు. అప్పడుకానీ.., కాని ఆర్ట్ డైరక్టర్ ఓకే చెప్పి, ఈ సెటే చాలా నేచురల్ గా వుండేలా వేయించారు.

    ఇంకా ఇందులో రత్నపూర్ టౌన్, రైల్వే ట్రాక్, మేళా సెట్ మరియు ఇళ్లు అన్ని కలిపి సుమారు 4.5 కోట్లలో అయిపోయాయి. కాని షూటింగ్ జరుగుతుండాగానే మరికోన్ని ఎలిమెంట్స్ యాడ్ చేస్తూన్నారు, దానితో ఇది 5కోట్ల వరకు వెళ్లిందని సమాచారం. సినిమాలో ఈ సెట్ లో షూటింగ్ హైలెట్ అవుతుందని సమాచారం. అందుకే ఈ సినిమాను పవన్ కళ్యాణ్ సోంత బ్యానర్ సమర్పణలో శరత్ మరార్ మరియు సునిల్ లల్లా నిర్మిస్తున్నారు.

    English summary
    Pawan Kalyan has been giving personal attention to every little detail related to the Sardaar Gabbar Singh's lavish village set that has been erected in a city studio.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X