»   » తిరుపతి వెంకన్న ని దర్శించుకున్న పవన్, తన కోసం కాదు

తిరుపతి వెంకన్న ని దర్శించుకున్న పవన్, తన కోసం కాదు

Posted By:
Subscribe to Filmibeat Telugu

తిరుపతి: కర్ణాటకలో ఇటీవల హత్యకు గురైన తన అభిమాని వినోద్‌ రాయల్‌ కుటుంబాన్ని సినీనటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ గురువారం పరామర్శించిన సంగతి తెలిసిందే. అందునిమిత్తం ఆయన తిరుపతి వెళ్లారు. అక్కడ అభిమాని తల్లి,తండ్రులని కలిసిన అనంతరం ఆయన తిరుపతి వెంకటేశ్వరస్వామిని దర్శించుకునన్నారు.

పవన్ ..గుళ్లకు వెళ్లటం చాలా అరుదు. అభిమానులు చుట్టుముట్టి మిగతా భక్తులకు ఇబ్బంది కలుగుతుందని ఆయన గుళ్లకు దూరంగా ఉంటూంటారు. అయితే ఈ సారి అభిమాని కుటుంబం కోసం ప్రత్యేకంగా ప్రార్దించటానికి వెంకటేశ్వరస్వామిని దర్శించారు. అలాగే ఆయన కొత్త చిత్రం షూటింగ్ లో త్వరలో పాల్గొనబోతున్నట్లు తెలియచేసారు.

Pawan Kalyan prays at Tirupathi temple

సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే వినోద్‌ మృతి తనను తీవ్రంగా బాధించిందని పవన్‌కల్యాణ్‌ అన్నారు. వినోద్‌ కుటుంబసభ్యులను పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. హీరోలపై అభిమానం ఉండటంలో తప్పులేదని.. కానీ క్షణికావేశంలో ఇలాంటి ఘటనలకు పాల్పడటం సరికాదన్నారు.

అభిమానులు మితిమీరిన స్థాయికి వెళ్లి గొడవ పడి ప్రాణాలు తీసుకోవద్దని సూచించారు. మరో రెండు నెలల్లో అమెరికా వెళ్లాల్సిన యువకుడు విగతజీవిగా మారడం తల్లిదండ్రులకు తీరని శోకంగా మారిందని పవన్‌కల్యాణ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. వినోద్‌ను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.

English summary
Pawan Kalyan headed to Tirupathi temple and offered his prayers to Lord Venkateshwara. Powerstar this time prayed for the family of his fan.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu