»   » నిర్మాతగా పవన్ కళ్యాణ్: రామ్ చరణ్ తేజతో సినిమా

నిర్మాతగా పవన్ కళ్యాణ్: రామ్ చరణ్ తేజతో సినిమా

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిర్మాతగా మారారు. త్వరలో ఆయన తన అన్నయ్య చిరంజీవి కుమారుడు, తెలుగు చలనచిత్ర హీరో రామ్ చరణ్ తేజతో ఓ సినిమా నిర్మించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ తర్వాత మిగతా యువ హీరోలతోనూ ఆయన సినిమాలు నిర్మిస్తారని అంటున్నారు.

పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ కింద వరుసగా యువ హీరోలు, దర్శకులతో ఆయన సినిమాలు నిర్మించే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. యువ హీరోలు, దర్శకుల ప్రతిభను వెలికి తీసేందుకు ఆయన సినిమా నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుగు టీవీ చానెళ్లలో వార్తలు వచ్చాయి.

Pawan Kalyan

హైదరాబాదీ, దక్కనీ వంటి ఉప ప్రాంతీయ మార్కెట్లకు సంబందించిన సినిమాలను కూడా పవన్ కళ్యాణ్ నిర్మించనున్నారు. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ మీడియాకు ఆ విషయాలు వెల్లడించింది. వివరాలను త్వరలో తెలియజేస్తామని కూడా తెలిపింది.

జనసేన పార్టీ ద్వారా రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ బిజీ అవుతారని భావిస్తున్న సమయంలో నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయాలకు ఆయన ప్రాధాన్యం ఇస్తారనే ఊహాగానాలకు తావు కల్పించాయి.

English summary
Pawan Kalyan to produce a movie with Ram Charan as hero on Pawan Kalyan Creative works banner. he will do with other heroes too!
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu