»   » 1800 మంది పోలీసులు 600 మంది వలంటీర్లు : పవన్ ఏం చెప్ప బోతున్నాడు

1800 మంది పోలీసులు 600 మంది వలంటీర్లు : పవన్ ఏం చెప్ప బోతున్నాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

జనసేనపార్టీ అధినేత, సినీహీరో పవన్ కల్యాణ్ గురువారం అనంతపురంలో బహిరంగసభ నిర్వహించనున్నారు. అనంతపురంలోని స్థానిక జూనియర్ కాలేజీ మైదానంలో సాయంత్రం 4 గంటలకు పవన్ సభ జరగనుంది. ఏపీకి ప్రత్యేక హోదా, అనంతపురం కరువుపై పవన్ కల్యాణ్ స్పందించనున్నారు. పవన్ కల్యాణ్ అభిమానులంతా జనసేన కార్యకర్తలుగానే భావిస్తున్నట్టు జన సేన పార్టీ నేతలు అమర్నాథ్, వరుణ్ తదితరులు తెలిపారు. రేపు జరగబోయే సభా వేదికకు తుళ్లూరు సుబ్బారావు, సభా ప్రాంగణానికి తరిమెల నాగిరెడ్డి పేరును పెట్టినట్టు నేతలు పేర్కొన్నారు. ఏర్పాట్లకు సహకరిస్తున్న ప్రభుత్వానికి ఈ సందర్భంగా వారు కృతజ్ఞతలు తెలిపారు. కాగా ఏపీ ప్రత్యేక హోదాపై తిరుపతి, కాకినాడలలో పవన్ కల్యాణ్ సభలు నిర్వహించిన సంగతి తెలిసిందే.

ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కోసం జనసేనాని మరోసారి గర్జించనున్నారు. ఈ సారి రాయలసీమ వేదికగా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించనున్నారు. ఇవాళ అనంతపురంలో నిర్వహించనున్న బహిరంగ సభ పేరు సీమాంధ్ర హక్కుల చైత‌న్య స‌భ‌ .ఏపీకి ప్రత్యేక హోదాపై రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేస్తానని తిరుపతి సభలో పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఇందులో భాగంగా ఇప్పటికే కాకినాడలో బహిరంగ సభ నిర్వహించారు. తాజాగా అనంత‌పురంలో బ‌హిరంగ స‌భ‌ నిర్వహించ‌నున్నారు. స‌భ జ‌రిగే మైదానానికి విప్లవ‌నేత‌ త‌రిమెల నాగిరెడ్డి పేరును, వేదిక‌కి స్వాత్రంత్ర స‌మ‌ర యోధుడు క‌ల్లూరు సుబ్బారావు వేదికగా ప‌వ‌న్ పేర్లు పెట్టారు. అయితే ఈ సారి పవన్ ఏం ప్రసంగించనున్నారు..? 1800 మంది పోలీసులు మోహరించటం అంటే పవన్ సభలో ఏవైనా గొడవలు జరిగే అవకాశం ఉందని అనుకోవాలా?? అనే విశయాలపై...

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను టార్గెట్:

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను టార్గెట్:

పవన్ కల్యాణ్ మరోసారి ప్రశ్నించబోతున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా పోరులో భాగంగా ముచ్చటగా మూడో బహిరంగ సభకు డేట్ ఫిక్స్ చేశారు. అనంతపురం వేదికగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను టార్గెట్ చేసి 2019కి బాటలు వేసుకునే పనిలో పడ్డారు. గత ఎన్నికలకు ముందు పుట్టిన జనసేనని.. వచ్చే ఎలక్షన్స్ కల్లా పటిష్ట పర్చడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్. ఇందుకు ప్రజల భావోద్వేగాలతో ముడిపడిన ప్రత్యేక హోదా అంశాన్నే ఆయుధంగా ఎంచుకున్నాడు.

హోదా కోసం:

హోదా కోసం:

హోదా కోసం తిరుపతి వేదికగా పోరుబాట ప్రకటించిన పవన్.. జిల్లాకో సభ పెడతానని ప్రకటించారు. చెప్పినట్లే ఆచితూచి అడుగులేస్తూ అధికార పార్టీకి ముచ్చెమటలు పోయిస్తున్నారు. ఇప్పటికే తిరుపతి, కాకినాడ సభల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఏకిపారేసిన పవన్.. అనంతపురం వేదికగా మరోసారి సూటి ప్రశ్నలు సంధించబోతున్నారు.
నవంబర్ 10న పవన్ అనంతపురంలో బహిరంగ సభ పెడుతున్నట్లు జనసేన కోశాధికారి రాఘవయ్య పేరుతో లేఖ విడుదలైంది.

 సర్జికల్ :

సర్జికల్ :

అనంతలో సభని అక్టోబర్లోనే పెడదామనుకున్నా సర్జికల్ దాడులు, అనంతర పరిణామాల వల్ల వాయిదా వెయ్యాల్సి వచ్చిందన్నారు. ప్రత్యేక హోదా వస్తే అనంతపురంను కరవు కోరల్లోంచి గట్టెక్కించి అభివృద్ధి బాటలో నడిపించవచ్చన్నది పవన్ కల్యాణ్ అభిప్రాయం.తిరుపతి, కాకినాడ సభల మాదిరిగానే అనంతలోనూ బీజేపీ, టీడీపీల్ని టార్గెట్ చేస్తూ ప్రశ్నలు, విమర్శల వర్షం కురిపించే అవకాశముంది.

పవన్ కల్యాణ్ వ్యూహం:

పవన్ కల్యాణ్ వ్యూహం:

అధికార పార్టీతోపాటు ప్రతిపక్షాల్నీ ఎండగట్టడం పవన్ ప్రత్యేకత. ఒకే అంశంతో అటు అధికార పార్టీని, ఇటు విపక్షాల్ని ఇరుకున పెట్టడం ద్వారా రాజకీయంగా ఎదగాలన్నది జనసేన ప్లాన్. దీన్ని వర్కవుట్ చెయ్యడం ద్వారా 2019 ఎన్నికల్లో పార్టీని నిర్ణయాత్మకశక్తిగా మార్చాలన్నది పవన్ కల్యాణ్ వ్యూహం.పవన్ మరోసారి సభ నిర్వహించబోతున్నారని తెలుసుకున్న అభిమానులు.. ఊగిపోయే అతని స్పీచ్ ల కోసం ఆరాట పడుతున్నారు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు.

పవన్ ప్రసంగాలను యూట్యూబ్ లో:

పవన్ ప్రసంగాలను యూట్యూబ్ లో:

మరోవైపు పార్టీకి సంబంధించిన ప్రతి విషయాన్ని వెల్లడించేందుకు జనసేన ఇటీవలే సోషల్ మీడియాలో ఎంటరైంది. పవన్ ప్రసంగాలను యూట్యూబ్ లో పెట్టడం ద్వారా జనసేనకు ఆర్థికంగానూ కాస్తోకూస్తో భరోసా లభించే అవకాశముంది. మామూలు ప్రసంగాలైతే కష్టం కానీ.. పవన్ ఊగిపోతే మాత్రం సోషల్ మీడియాని క్లిక్ లు ఊపేయడం ఖాయం. మరి అనంత సభలో పవన్ మరోసారి ఊగిపోతారో లేదో చూడాలి.

సీమాంధ్ర హక్కుల జన చైతన్య సభ:

సీమాంధ్ర హక్కుల జన చైతన్య సభ:

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ గురువారం అనంతపురంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. సీమాంధ్ర హక్కుల జన చైతన్య సభ పేరుతో నిర్వహిస్తున్న ఈ బహిరంగ సభ స్థానిక న్యూటౌన్‌ జూనియర్‌ కళాశాల గ్రౌండులో సాయంత్రం 4 గంటలకు ప్రారంభం కానుంది. సభకు వేలాది మంది హాజరవుతున్న నేపథ్యంలో జిల్లా పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది.

జనసేన నాయకులు, కార్యకర్తలు:

జనసేన నాయకులు, కార్యకర్తలు:

దాదాపు 1800 మంది పోలీసులు బందోబస్తు విధుల్లో నిమగ్నమయ్యారు. మరోవైపు ప్రజలు, అభిమానులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా 600 మంది జనసేన వాలంటీర్లు ఏర్పాట్లు చేస్తున్నారు. రాయలసీమ జిల్లాల నుంచి అభిమానులు పెద్ద ఎత్తున వాహనాల్లో తరలిరావచ్చన్న ఉద్దేశంతో ట్రాఫిక్‌ను మళ్లించారు. వాహనాల పార్కింగ్‌ కోసం ప్రత్యేకంగా స్థలాలను ఏర్పాటు చేశారు. బహిరంగ సభను విజయవంతం చేసేందుకు జనసేన నాయకులు, కార్యకర్తలు, పవన్‌ అభిమానులు కృషిచేస్తున్నారు.

తొలిస‌భ తిరుప‌తిలో:

తొలిస‌భ తిరుప‌తిలో:

పార్టీ ప‌టిష్ట‌త కోసం ముందునుంచి వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అందుకే తొలిస‌భ తిరుప‌తిలో పెట్టి రాయ‌ల‌సీమ ఆద‌రాభిమానాలు కూడ‌గ‌ట్టే ప్ర‌య‌త్నం చేశాడ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులంటున్నారు. ఇక రెండో స‌భ కాకినాడ‌లో పెట్ట‌డం ద్వారా త‌న కుల సీమీక‌ర‌ణ‌ల‌కు తెర‌లేపాడ‌నే చెప్పాలి. కులాల‌క‌తీత‌మ‌ని చెబుతూనే త‌న వారిని ద‌రిచేర్చుకునే ప్ర‌య‌త్నం చేశాడ‌నే టాక్ ఉంది.

ఎంతో వ్యూహాత్మ‌కంగా:

ఎంతో వ్యూహాత్మ‌కంగా:

ఇక ఓటు హ‌క్కు విష‌యంలో కూడా ఎంతో వ్యూహాత్మ‌కంగా ప‌వ‌న్ వ్య‌హరించాడ‌నే విశ్లేష‌ణ‌లున్నాయి. త‌న స్వంత జిల్లా ఏలూరులో ఓటుహ‌క్కు చేర్చుకోవ‌డం ద్వారా నేను మీవాడిన‌ని చెప్పుకునే ప్ర‌య‌త్నం ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేశాడ‌నే చెప్పాలి. ఇక ఇప్పుడు అనంత‌పురంలో స‌భ ఏర్పాటు వెనుక మ‌త‌ల‌బు లేక‌పోలేదు. చంద్ర‌బాబు బావ‌మ‌రిది హిందూపురం ఎమ్మెల్యే బాల‌కృష్ణ జిల్లాలో ప్ర‌జాద‌ర‌ణ సొంతం చేసుకునే దిశ‌గా ఈ అడుగులు ప‌డుతున్నాయ‌ని పొలిటిక‌ల్ స‌ర్కిల్ లో గుస గుస‌లు వినిపిస్తున్నాయి.

మెప్పుకోళ్ళకూ, విమర్శలకూ అతీతంగా:

మెప్పుకోళ్ళకూ, విమర్శలకూ అతీతంగా:

గత రెండు సభల్లోనూ పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలకి అభిమానులు చప్పట్లుకొట్టినా పెద్దలలోనూ కొందరు విమర్శించారు. ఆవేశం తో ఊగిపోవటం తప్ప పవన్ ప్రసంగాలలో ఏమాత్రం శాస్త్రీయ దృక్పదం లేదనీ, కనీస ఆలోచన లేకుండా మాట్లాడారనీ విమర్శించిన వారు విమర్శించగా మరికొంత వరకూ పవన్ కళ్యాన్ సరైన లీడర్ అంటూ మెప్పుకోళ్ళూ వినిపించాయి. అవన్నీ పట్టించుకోకుండా తన చేస్తున్న దాని మీదే దృష్టి నిలిపిన పవన్ మాత్రం అటు మెప్పుకోళ్ళకూ, విమర్శలకూ అతీతంగా ఉంటూ తన పని తాను చేసుకు పోతూ ఉన్నాడు.

English summary
Power Star Pawan Kalyan Jana Sena Party Chief After the grand success of Tirupati and Kakinada public meetings, Pawan Kalyan is poised for yet another massive public meeting. This time, it’s in Anantapur on November 10 (today) as part of his plans to hold public meetings in every district on the special category status to Andhra Pradesh.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu