»   » ‘చిరుత’ పోయే ‘సింహా’ వచ్చే ఢాం ఢాం ఢాం!

‘చిరుత’ పోయే ‘సింహా’ వచ్చే ఢాం ఢాం ఢాం!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రస్తుతం అందరి దష్టినీ అత్యంతగా ఆకర్షించినవి రెండే సినిమాలు. మొదటిది 'సింహా" కాగా రెండోది 'పులి". ఆల్ రెడీ 'సింహా" ఫలితం తేలిపోవడంతో ఇప్పుడిక అందరి చూపూ 'పులి" వైపు తిరిగింది. ఇక ముందు 'పులి" విశేషాలు, వివరాలు హైలైట్ అవ్వబోతున్నాయి. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో సాంగ్ షూటింగ్ జరుపుకుంటోన్న 'పులి" జూన్ ప్రథమార్థంలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

'ఖుషీ" లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఎస్ జె సూర్య డైరెక్షన్ లో పవన్ మళ్ళీ నటిస్తుండడం, ఆస్కార్ విన్నర్ ది గ్రేట్ ఎఆర్ రెహమాన్ మ్యూజిక్ చేస్తుండడం 'పులి" పై హై ఎక్స్పెక్టేషన్స్ ని క్రియేట్ చెయ్యగా రీసెంట్ గా రిలీజ్ అయిన పవర్ స్టార్ 'పులి" గెటప్స్ స్టిల్స్ ఆ అంచనాలని అమాంతం రెటింపు చేసేశాయి. మీసం తిప్పి 'పులి" లా కనిపిస్తోన్న పవర్ స్టార్ మరోసారి బాక్సాఫీస్ వద్ద చక్రం తిప్పి తన ఛరిష్మా చూపిస్తారని మెగా అభిమానులు ఆశిస్తున్నారు.

ఆల్ రెడీ ఆడియో రైట్స్, శాటిలైట్ రైట్స్, ఓవర్సీస్ రైట్స్ లో సరికొత్త ఫిగర్స్ కి రీచ్ అయి సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న 'పులి" ఫ్యూచర్ లో బాక్సాఫీస్ రికార్డ్స్ అన్నిటికీ చెక్ చెప్పడం గ్యారంటీ అని కాన్ఫిడెంట్ గా అంటున్నారు ఈ చిత్ర యూనిట్ సభ్యులు. మరో పది రోజుల్లో జరిగే 'పులి" ఆడియో రిలీజ్ తో ఇండస్ట్రీలో మళ్ళీ పవర్ స్టార్ ప్రభంజనం ప్రారంభం కానుంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X