»   » పవన్ కళ్యాణ్ 'పులి' రిలీజ్ డేట్ కన్ఫర్మ్

పవన్ కళ్యాణ్ 'పులి' రిలీజ్ డేట్ కన్ఫర్మ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

పవన్ కళ్యాణ్, నిఖిషా పటేల్ కాంబినేషన్లో దర్శకుడు ఎస్.జె.సూర్య రూపొందిస్తున్న 'పులి' చిత్రం ఏప్రియల్ 28న రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం చివరి షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి రీ షూటింగ్ లు కొంతవరకూ లేటవటానికి కారణమని తెలుస్తోంది. అలాగే ఆస్కార్ విజేత ఎఆర్ రహమాన్ సంగీతం లేటుగా ఇవ్వటం కూడా ఈ చిత్రం రిలీజ్ వాయిదాలకి కారణమని చెప్తున్నారు. అసలే కాస్త లేటుగా వర్క్ ఫినిష్ చేసే రహమాన్ ఆస్కార్ అనంతరం విపరీతమైన బిజీగా మారారు. దాంతో పులి చిత్రానికి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పెండింగ్ ఉందని తెలుస్తోంది. కనకరత్న మూవీస్ బ్యానర్ పై శింగనమల రమేష్ నిర్మించే ఈ చిత్రంలో శ్రియ ఓ ఐటం సాంగ్ చేస్తోంది. జల్సా రిలీజై చాలా కాలం అవటంతో ఈ చిత్రం కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇక ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. అంతేగాక ద్విపాత్రాభినయం తొలిసారిగా చేస్తున్నారని వినికిడి.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu