»   » మళ్ళీ పవన్ ప్రస్తావన తెస్తున్న బన్ని? ఈ ప్యాచప్ పనికొచ్చేనా?

మళ్ళీ పవన్ ప్రస్తావన తెస్తున్న బన్ని? ఈ ప్యాచప్ పనికొచ్చేనా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

'దువ్వాడ జగన్నాథం' సినిమా షూటింగ్ చకచకా జరిగిపోతోంది.టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ చిత్రాలను తెరకెక్కిస్తూ వరుస బ్లాక్ బస్టర్ చిత్రాలను అందుకుంటున్నాడు అల్లుఅర్జున్. ఈ సినిమాని కూడా పక్క హిట్ చేసెయ్యాలనే పట్టుదల తో ఉన్నాడట. అయితే సంబంధించి తాజాగా ఒక టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది.

ఈ సినిమాలో పవన్ ప్రస్తావన ఉంటుందని చెప్పుకుంటున్నారు. ఇటీవల జరిగిన ఒక చిన్న సంఘటన వలన పవన్ ఫ్యాన్స్ కి బన్నీ దూరమయ్యాడనే సంగతి తెలిసిందే. చెప్పను బ్రదర్ దగ్గర మొదలైన వ్యతిరేకత అలా సాగుతూనే వస్తోంది మొన్నటికి మొన్న డీజే ట్రైలర్ వచ్చినప్పుడు వచ్చిన అన్లైక్ లతో కాస్త జాగ్రత్త పదాలి అనే సూచనలు వచ్చాయ్. అందుకే కొత్త ప్లాన్ అమలు చేయాలనే ఆలొచనలో ఉన్నారట.

Pawan Kalyan references in DJ Duvvada Jagannadham

పవన్ ని సినీ హీరోగా చూసే అభిమానులు మాత్రమే కాదు మామూలుగా కూడా పవన్ కి మంచి ఫాలోయింగ్ ఉంది. "చెప్పను బ్రదర్" అంటూ అప్పట్లో బన్నీ పవన్ గురించి మాట్లాడటానికి నిరాకరించటం చాలా మందికే బన్నీ పట్ల కొంత వ్యతిరేక భావనని తీసుకువచ్చింది. అలాంటివాళ్లకి తిరిగి దగ్గర కావడానికి బన్నీ ప్రయత్నిస్తున్నాడట.

Pawan Kalyan references in DJ Duvvada Jagannadham

అందులో భాగంగానే ఈ సినిమాలో పవన్ ప్రస్తావన వచ్చేలా .. పవన్ ఫ్యాన్స్ ఖుషీ అయ్యేలా ఒకటి రెండు సీన్స్ క్రియేట్ చేయమని హరీష్ శంకర్ తో బన్నీ చెప్పాడట. ఆ తరహా సన్నివేశాలను క్రియేట్ చేసిన హరీష్ శంకర్, ప్రస్తుతం వాటినే తెరకెక్కిస్తున్నాడని సమాచారం. మరి ఈ కవరప్ ప్రయత్నాలు ఎంతవరకూ పని చేస్తాయో చూడాలి మరి.

English summary
. It is also known that Harish Shankar himself is one of the die hard fans of Pawan. Hence the director reportedly made a decision to solve the issue by using few references of Pawan in DJ. Bunny is also said to have agreed to his decision as it could avoid affecting his market value in telugu states.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu