»   » ఆ సెక్సీ మోడల్ నే పవన్ కళ్యాణ్ సరసన బుక్ చేసారు

ఆ సెక్సీ మోడల్ నే పవన్ కళ్యాణ్ సరసన బుక్ చేసారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

పవన్ కల్యాణ్ కథానాయకుడిగా విష్ణువర్థన్ దర్శకత్వంలో 'షాడో' టైటిల్ తో ఓ చిత్రం రూపొందబోతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో హీరోయిన్స్ గా సారా జేన్ డయాస్, అంజలీ లావణ్య ని ఎంపిక చేసారు. అంజలీ లావణ్య మోడిలింగ్ రంగం నుంచి వచ్చింది. ఆమె కింగ్ ఫిషర్ క్యాలెండర్ మోడల్ గా చేసింది. సంఘమిత్ర ఆర్ట్స్, ఆర్కా మీడియా వర్క్స్ ప్రై. లిమిటెడ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ నెల 6న కోల్‌కతాలో షూటింగ్ ప్రారంభం కానున్నది.సోమవారం సాయంత్రం సినీ మాక్స్‌లో జరిగిన పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు విష్ణువర్థన్ మాట్లాడుతూ "తెలుగులో నా తొలి సినిమాని పవన్ కల్యాణ్‌తో చేస్తుండటం చాలా సంతోషంగా ఉంది. ఆద్యంతం ఆసక్తికరంగా నడిచే యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది అని తెలిపారు. ఈ చిత్రంలో జాకీష్రాఫ్‌, అతుల్‌ కులకర్ణి, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, అలీ, సుబ్బరాజు, శేష్‌ అడవి తదితరులు నటిస్తున్నారు. మాటలు: అబ్బూరి రవి, సంగీతం: యువన్‌ శంకర్‌ రాజా, ఛాయాగ్రహణం: పి.ఎస్‌. వినోద్‌, కళ: సునీల్‌ బాబు, కూర్పు: ఎ.శ్రీకర్‌ ప్రసాద్‌.

English summary
Pawan Kalyan all set for his next film ‘The Shadow’ that will take shape in the hands of noted Tamil director Vishnuvardhan (of ‘Billa’ fame).The buzz is that Kingfisher model Anjali Lavania has been roped in as second heroine beside Pawan Kalyan in the film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu