రికార్డుస్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్
ట్రేడ్ వర్గాలు అందించిన సమాచారం ప్రకారం.. అజ్ఞాతవాసి చిత్రం రూ.150 కోట్ల రూపాయల ప్రీరిలీజ్ బిజినెస్ చేసింది. ఈ మొత్తం తెలుగు సినిమా చరిత్రలోనే తొలిసారి. ఈ బిజినెస్ పవన్ కల్యాణ్ స్టామినాను మరోసారి గుర్తు చేశాయి.
పవన్ మ్యాజిక్ ఫిగర్ ఇదే
ఇక అజ్ఞాతవాసి ప్రీరిలీజ్ బిజినెస్ రికార్డు స్థాయిలో ఉన్న నేపథ్యంలో పోస్ట్ రిలీజ్ బిజినెస్ రూ.200 కోట్లకుపైగానే ఉండే అవకాశముందని అంచనాలు వేస్తున్నారు. ప్రస్తుతం అజ్ఞాతవాసి చిత్రం ఆ మ్యాజిక్ ఫిగర్ చేరుకోవచ్చని బలంగా నమ్ముతున్నారు.
రెండు ఫ్లాపులు ఉన్నా
అజ్ఞాతవాసి చిత్రానికి ముందు పవన్ కల్యాణ్ నటించిన రెండు సినిమాలు దారుణంగా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. సర్దార్ గబ్బర్‌సింగ్, కాటమరాయుడు చిత్రాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. అయితే ఈ రెండు చిత్రాలకు ఫ్లాప్ టాక్ వచ్చిన ఒపెనింగ్ కలెక్షన్లు అదిరిపోయాయి. తాజాగా ఈ రేంజ్‌లో సినిమా బిజినెస్ జరగడం ఆశ్చర్యానికి గురిచేస్తున్నది.
టికెట్ల కోసం ఫ్యాన్ ఆరాటం
డిసెంబర్ 19న (మంగళవారం) అజ్ఞాతవాసి ఆడియో విడుదల కార్యక్రమాన్ని హెటెక్స్‌లో నిర్వహిస్తున్న తెలిసిందే. ఈ వేడుకను పురస్కరించుకొని పవర్‌స్టార్ అభిమానుల కోలాహలం అప్పుడే నగరానికి తాకింది. వేల సంఖ్యలో అభిమానులు హైదరాబాద్ చేరుకొంటున్నారు.
బారులు తీరిన పవన్ ఫ్యాన్స్
ఆడియో వేడుక టికెట్ల కోసం హారిక అండ్ హాసిని ప్రొడక్షన్ హౌస్ వద్ద బారులు తీరారు. తమకు టికెట్లు ఇవ్వాలని అక్కడి సిబ్బందిని అడుగుతున్నారు. దీంతో ఆ ప్రాంతమంతా పవన్ అభిమానులతో సందడి వాతావారణం నెలకొంది.
టీజర్ రెస్పాన్స్ రచ్చ రచ్చ
కాగా, పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు ఓ షాకింగ్ న్యూస్. ఇటీవల టీజర్‌కు మంచి స్పందన వస్తున్నది. ఇప్పటి వరకు ఈ టీజర్‌కు 8,391,054 వ్యూస్ వచ్చాయి. అయితే ఆడియో ఆవిష్కరణలో థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేస్తారని అభిమానులు ఆశించారు. కానీ ట్రైలర్ కటింగ్ పని పూర్తికాకపోవడం వల్ల దానిని వచ్చేవారం విడుదల చేస్తారనేది తాజా సమాచారం.
జనవరి 10న రిలీజ్
పవన్ కళ్యాణ్ 25వ చిత్రంగా రూపొందిన అజ్ఞాతవాసి చిత్రానికి దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించారు. అనిరుధ్ రవిచంద్రన్ స్వరపరిచిన రెండు పాటలు ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. పవన్ సరసన కీర్తి సురేష్, అను ఎమ్మాన్యుయేల్ నటిస్తున్నారు. ఈ మూవీలో తమిళ నటి ఖుష్బూ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం జనవరి 10న రిలీజ్ అవుతున్నది.