యూట్యూబ్‌లో కొడుకా.. పాట దుమారం.. పవన్ టార్గెట్ కోటేశ్వరరావు అతడేనంటా.. !

By Rajababu

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ కొత్త సంవత్సరాన్ని ఘనంగా ప్రారంభించాడు. న్యూ ఇయర్‌ను పురస్కరించుకొని విడుదల చేసిన కొడుకా కోటేశ్వరరావు పాట యూట్యూబ్‌లో టాప్ ట్రెండింగ్‌లో ఒకటిగా నిలిచింది. ఈ పాటకు సినీ అభిమానులతోపాటు, పవన్ ఫ్యాన్స్ నుంచి విశేష స్పందన లభిస్తున్నది.

 పవన్ పాటకు అనూహ్య స్పందన

పవన్ పాటకు అనూహ్య స్పందన

అజ్ఞాతవాసి చిత్రం కోసం పవన్ కల్యాణ్ మరోసారి గళం సవరించుకొన్నారు. కొడకా కోటేశ్వరరావు పాటను ఇటీవల రికార్డు చేశారు. ఈ పాటను డిసెంబర్ 31న సాయంత్రం విడుదల చేశారు. కొద్దిగంటల్లోనే ఈ పాట వైరల్‌గా మారింది.

 యూట్యూబ్‌లో టాప్ ట్రెండింగ్

యూట్యూబ్‌లో టాప్ ట్రెండింగ్

యూట్యూబ్‌లో ట్రెండింగ్ లిస్టులో పవన్ కల్యాణ్ పాడిన పాట నంబర్ వన్ స్థానంలో నిలిచింది. ఇప్పటికే 3428420 మంది వీక్షించారు. 253874 మంది లైక్ చేయగా, 14171 మంది డిస్‌లైక్ చేశారు.

 మిరియాలు, యాలకుల పాలతో

మిరియాలు, యాలకుల పాలతో

కొడక కోటేశ్వరరావు పాటలో అనేక అంశాలు ప్రత్యేకంగా నిలిచాయి. బాబు తుకారాం ఓ గ్లాసు మిరియాలు.. యాలకులు దట్టించిన పాలు కావాలి.. ఇక కుమ్మేద్దాం.. అంటూ పవన్ తన గళాన్ని సవరించుకొన్నారు.

 క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాలేను

క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాలేను

శర్మ గారు నేనేమీ పాడుతున్నాను.. మీరు ఏమి వినిపిస్తున్నారు అని పవన్ అనగానే ‘ఇప్పుడే కదా బాగుందన్నావు బాబూ' అని శర్మ గొంతును త్రివిక్రమ్‌ వినిపించారు. దానికి సమాధానంగా అప్పుడు బాగుందనన్నాను. ఇప్పుడు కాదు. సారీ క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాలేను అని పవన్ తనదైన శైలిలో స్పందించారు.

 నీ దరిద్రం చెప్పడానికి

నీ దరిద్రం చెప్పడానికి

చేయి పడితే మాడిపోయిన అరిసె అయిపోతవు. చిరిగిపోయిన పర్సు, ఇరిగిపోయిన ఇరుసు అయిపోతావు అంటూ పవన్ హుషారుగా పాటను అందుకొన్నారు. నీచ నికృష్ణ కోటేశ్వరరావు.. నీ దరిద్రం చెప్పడానికి నా డైలాగ్స్ లేవంటూ పవన్ చెప్పిన మాటలు ఫ్యాన్స్‌ను ఆకట్టుకొంటున్నాయి.

 షారుక్ గెటప్‌లో రావు రమేశ్

షారుక్ గెటప్‌లో రావు రమేశ్

కొడుకా కోటేశ్వరరావు పాట షూటింగ్‌ అంతా మంచి రంజుగా సాగినట్టు కనిపిస్తున్నది. దిల్ వాలే దుల్హనియా లేజాయేంగేలో షారుక్ మాదిరిగా రావు రమేశ్ గెటప్ ఆలరించింది. పక్కనే ఉన్న అమ్మాయిలు ఈలలు వేస్తూ చిందేయడం మరీ బాగుంది.

 నవ్వుల్లో మునిగిన త్రివిక్రమ్

నవ్వుల్లో మునిగిన త్రివిక్రమ్

పవన్‌ పాట పాడుతూ మధ్యలో ‘కొడకా' అని... ‘చెత్త..' చెత్త బుట్టైపోతావు. సగం కాలిన చుట్ట అయిపోతావు అంటూ సాగతీసి అంటాడు. పవన్ పాడిన స్లయిల్‌ను చూసి నిర్మాత రాధాకృష్ణ, దర్శకుడు త్రివిక్రమ్, సంగీత దర్శకుడు అనిరుధ్, గేయరచయిత భాస్కరభట్ల నవ్వుల్లో మునిగిపోయారు.

 బ్రహ్మీ తర్వాత టార్గెట్ ఆయనేనటా

బ్రహ్మీ తర్వాత టార్గెట్ ఆయనేనటా

తమ్ముడు, అత్తారింటికి దారేది సినిమాల్లో మాదిరిగానే కొడుకా కోటేశ్వరరావు పాట సాగింది. తమ్ముడులో హాస్యనటుడు మల్లికార్జునరావును, అత్తారింటికి చిత్రంలో బ్రహ్మానందం.. ఇప్పుడు అజ్ఞాతవాసి చిత్రంలో రఘుబాబును టార్గెట్ చేసినట్టు తెలుస్తున్నది.

 అనిరుధ్‌కు పవన్ షాక్

అనిరుధ్‌కు పవన్ షాక్

కొడుకా కోటేశ్వరరావు పాట పాడటం అయిపోయాక నీతో కలిసి పనిచేయడం నాకు దక్కిన గొప్ప అవకాశం అంటూ పవన్‌ ఇచ్చిన ప్రశంసకు అనిరుధ్ షాకితిన్నారు. పాట మొదట్లో నా ఊపును అందుకొన్న యంగ్ అండ్ టాలెంటెడ్ మ్యూజిషియన్స్ లేరా అంటూ పవన్ అనడం అనిరుధ్‌ను ప్రశంసించడమే అని మాట వినిపిస్తున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X