»   »  పవన్ కామెంట్లకి "చే గువేరా ఆత్మ" అంటూ రామ్ గోపాల్ వర్మ వెటకారం

పవన్ కామెంట్లకి "చే గువేరా ఆత్మ" అంటూ రామ్ గోపాల్ వర్మ వెటకారం

Posted By:
Subscribe to Filmibeat Telugu

సోషల్ మీడియాలో తనదైన శైలిలో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సంచలనాలకు కేంద్ర బిందువుగా ఉండే రాంగోపాల్ వర్మ మరోసారి వార్తల్లోకి వచ్చాడు. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై స్పందించి, సెటైర్ వేయడం ద్వారా ఆయన అభిమానుల్లో ఆగ్రహాన్ని తెప్పించాడు. మెగా హీరో చిరంజీవి అంటే వర్మకు పెద్దగా అభిమానం లేదు అన్నది ఓపెన్ సీక్రెట్. అయితే 'అత్తారింటికి దారేది' సినిమా రిలీజ్ అయిన తరువాత వర్మ టాలీవుడ్ ఎంపరర్ గా మారిపోయిన పవన్ క్రేజ్ ను చూసి ఏకంగా పవర్ స్టార్ ను 'సునామి స్టార్' అంటూ తెగ పొగిడాడు.అయితే ఆ తరువాత పవన్ 'జనసేన' పెట్టి రాజకీయాల బాట పట్టిన తరువాత వర్మ టార్గెట్ లో పవన్ కూడ తరుచూ చిక్కుకుంటున్నాడు. ఆ మధ్య పవన్ విపరీతంగా టార్గెట్ చేసిన వర్మ ఈమధ్య కాలంలో పవన్ విషయంలో మౌనం వహించడంతో వర్మ టార్గెట్ లిస్టు లో పవన్ ను మర్చిపోయాడా అని అనుకున్నారు అంతా.

Pawan Kalyan's Compliment will make Che Guevara dance

క్యూబా అధ్యక్షుడూ,క్యూబా విముక్తి ఉధ్యమ కారుడూ అయిన ఫిడెల్ క్యాస్ట్రో మృతిపై స్పందిస్తూ... 'గొప్ప నాయకుడు ఫిడెల్ క్యాస్ట్రో ఈరోజుఈ ప్రపంచం నుండి నిష్క్రమించాడు. జనసేన ఆయనకు సెల్యూట్ చేస్తోంది. ఆయన తన సరికొత్త ఆలోచనలతో క్యూబా దేశంలో వైద్య విభాగాన్ని ఛాయా అభివృద్ధి చేశారు. నేను ఆరాధించే చేగువేరాతో ఆయన ప్రయాణం మరువలేనిది. ఆయననెప్పటికీ గుర్తు పెట్టుకుంటాం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను' అంటూ క్యాస్ట్రో పట్ల తన అభిమానాన్ని చూపించాడు

Pawan Kalyan's Compliment will make Che Guevara dance

ఈ మధ్య పవన్ పెట్టిన సభల మీద స్పందించిన వర్మ.. పవన్ పెట్టిన ట్వీట్ మీద కూడా రెస్పాండయ్యాడు. తాను ఎంతగానో అభిమానించే చేగువేరాకు ఆదర్శంగా నిలిచిన క్యాస్ట్రో గురించి పవన్ గొప్పగా మాట్లాడుతూ నివాళి అర్పించిన నేపథ్యంలో వర్మ స్పందిస్తూ.. ''పవన్ కళ్యాణ్ కాంప్లిమెంట్ తర్వాత చేగువేరా ఆత్మ ఇప్పుడు ప్రశాంతంగా ఉండదు. లేచి గెంతులేస్తూ నృత్యం చేస్తూ ఉంటుంది. ఐతే నేను మాత్రం చేగువేరా కంటే కూడా పవన్ కళ్యాణ్ నే ఎక్కువ అభిమానిస్తా'' అని వర్మ ట్వీట్ చేశాడు. ఐతే ఈ ట్వీట్ చూశాక.. ఆర్జీవీ పవన్ కు నిజంగా కాంప్లిమెంట్ ఇచ్చాడా.. లేక సెటైరేమైనా వేశాడా తెలియక పవర్ స్టార్ ఫ్యాన్స్ అయోమయంలో పడిపోయారు.

English summary
In response to Jana Sena Chief's Tweet saying he will remember Fidel Castro for his great journey with 'Che Guevara' whom he adores and respects a lot,Varma commented, 'Che Guevara's spirit instead of resting in peace,will jump and dance after Pawan Kalyan's compliment ..I like PK much more then CHE
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu