twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ 'గబ్బర్ సింగ్ 2' ముహూర్తం (ఫోటోలు)

    By Srikanya
    |

    హైదరాబాద్: ఈ రోజు(21,పిభ్రవరి) ఉదయం పవన్ కొత్త చిత్రం 'గబ్బర్ సింగ్ 2' లాంచ్ సింపుల్ గా జరిగింది. ఫిల్మ్ నగర్ లోని గుడిలో పూజ జరిగింది. 'రచ్చ' సినిమా డైరెక్టర్ సంపత్ నంది ఈ సినిమాని దర్శకత్వం వహించనున్నాడు.

    చిత్రం టీమ్ లోని కీ మెంబర్స్ పవన్ కళ్యాణ్, దర్శకుడు సంపత్ నంది, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్,నిర్మాత శరద్ మరార్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం ఉదయం 5 గంటలకు చోటు చేసుకుంది. మీడియాని ఎవరినీ పిలవకుండా సింపుల్ పూజ కానిచ్చారు.

    ఈ పూజ కార్యక్రమానికి సురేష్ బాబు, జెమినీ కిరణ్, రచయిత సత్యానంద్ హాజరయ్యారు. ఏప్రియల్ నుంచి చిత్రం షూటింగ్ మొదలు కానుంది. హీరోయిన్ ఇంకా ఫైనలైజ్ కాలేదని తెలుస్తోంది.

    లాంచింగ్ ఫోటోలు స్లైడ్ షోలో...

    బ్రహ్మ ముహూర్తంలో...

    బ్రహ్మ ముహూర్తంలో...

    నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై రూపొందే ఈ చిత్రాన్ని శరత్ మరార్ నిర్మిస్తున్నారు. ఈ రోజు ఉదయం బ్రహ్మ ముహూర్తంలో ఫిల్మ్ నగర్ దేవాలయంలో ప్రారంభమైంది.

    వెంకటేశ్వర స్వామిపై...

    వెంకటేశ్వర స్వామిపై...

    వెంకటేశ్వర స్వామిపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత శరత్ మరార్ తండ్రి జి.కె.మరారు క్లాప్ నివ్వగా,కెమెరా స్విచ్చాన్ సీనియర్ ప్రొడక్షన్ చీఫ్ ప్రకాష్ చేసారు.

    ముహూర్త సన్నివేశం

    ముహూర్త సన్నివేశం

    పవన్ కళ్యాణ్ కు నిర్మాత శరత్ మరారు కు అత్యంత సన్నిహితులైన ప్రముఖ న్యాయవాది ప్రమోద్ రెడ్డి ముహూర్తపు సన్నివేశానికి దర్శకత్వపు భాధ్యతలు నిర్వహించారు.

    పవన్ పర్యవేక్షణ

    పవన్ పర్యవేక్షణ

    శరత్ మరార్ మాట్లాడుతూ... గబ్బర్ సింగ్ చిత్రానికి కథ,రచన,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పర్యవేక్షణలో జరుగుతుందని చెప్పారు.

    సీక్వెల్ కాదు

    సీక్వెల్ కాదు

    ఈ చిత్రం గబ్బర్ సింగ్ చిత్రానికి సీక్వెల్ కాదని పూర్తి కథతో ముందుకు వస్తున్నామని తెలిపారు. గతంలో ఈ విషయాన్ని దర్శకుడు ఖరారు చేసారు.

    షూటింగ్ డిటేల్స్

    షూటింగ్ డిటేల్స్

    ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మే నెలలో ప్రారంభమవుతుందని, రెగ్యులర్ షూటింగ్ మొదలువుతుందని అన్నారు.

    రిలీజ్ ఎప్పుడు

    రిలీజ్ ఎప్పుడు

    ఈ చిత్రాన్ని దసరా కానుకగా విడుదల అయ్యే దిసగా నిర్మాణ కార్యక్రమాలు జరుగుతాయని అన్నారు. దసరా పండుగ పవన్ ఫ్యాన్స్ కు పండుగ అవుతుందన్నమాట.

    స్ర్రిప్టు డిపార్టమెంట్

    స్ర్రిప్టు డిపార్టమెంట్

    ఈ చిత్రానికి రచన పర్యవేక్షణ సీనియర్ రచయిత సత్యానంద్, క్రియేటివ్ హెడ్...హరీష్ పాయ్, రచన సహకారం శ్రీధర్ సీపని,కిషోర్ గోపు

    సాంకేతిక వర్గం..

    సాంకేతిక వర్గం..

    ఛాయాగ్రహణం జయనన్ విన్సెంట్, సంగీతం దేవిశ్రీ ప్రసాద్, ఎడిటర్ గౌతమ్ రాజు, ఆర్ట్ డైరక్టర్ ఆనంద్ సాయి, కాస్ట్యూమ్స్ డిజైనర్ రాజేష్, ప్రొడక్షన్ కంట్రోలర్ సి భాస్కర రాజు, నిర్మాత శరత్ మరార్

    పూర్తి దృష్టి

    పూర్తి దృష్టి

    అత్తారింటికి దారేది తర్వాత పవన్ పూర్తిగా ఈ స్క్రిప్టుపైనే దృష్టి పెట్టారు. కంటిన్యూగా స్టోరీ డిస్కషన్స్ జరుగుతున్నాయి. గబ్బర్ సింగ్ లాగే ఈ చిత్రం కూడా పెద్ద హిట్టవుతుందని చెప్పుకుంటున్నారు.

    రెండూ కాదు...

    రెండూ కాదు...

    2012 లో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచిన ‘గబ్బర్ సింగ్' బ్రాండ్ నేమ్ తో ఈ చిత్రం చేస్తున్నారు. సీక్వెల్...ప్రీక్వెల్ కాదు అని చెప్తున్నారు. ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ మరోసారి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ స్పెషల్ కేర్ తీసుకోవడమే కాకుండా దర్శకత్వ పర్యవేక్షణ కూడా చేయనున్నారు.

    పోలీక ఉండదు...

    పోలీక ఉండదు...

    గబ్బర్ సింగ్ చిత్రం హిందీ దబాంగ్ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కించినప్పటికీ....‘గబ్బర్ సింగ్-2' మాత్రం హిందీ దబాంగ్-2‌ను పోలి ఉండదని అంటున్నారు దర్శకుడు సంపత్ నంది. ఇది పూర్తిగా భిన్నంగా ఉంటుందని ఆయన వెల్లడించారు.

    కేవలం ఫ్రాంచైజీ

    కేవలం ఫ్రాంచైజీ

    హరీశ్‌శంకర్ దర్శకత్వంలో పవన్‌కల్యాణ్ నటించగా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన 'గబ్బర్‌సింగ్'కు ఇది ప్రాంచైజీ ఫిల్మ్. ఈచిత్రం సీక్వెల్,ప్రీ క్వెల్ కాదనీ ప్రాచైజీ గా ఫ్రెష్ స్టోరీ తో వచ్చే చిత్రం అని సంపత్ నంది చెప్తున్నారు.

    హీరోయిన్ సస్పెన్స్ ...

    హీరోయిన్ సస్పెన్స్ ...

    అలాగే హీరోయిన్ ఎవరనేది త్వరలోనే చెప్తామన్నారు.మరో ప్రక్క ఈ సినిమాలో హీరోయిన్ ఎంపిక జరుగుతోంది. సోనాక్షి సిన్హా, కాజల్ అగర్వాల్ అనుకున్నప్పటికీ వారిద్దరికీ డేట్స్ ప్రాబ్లమ్ తో తప్పుకున్నట్లు చెప్తున్నారు.

    ట్రేడ్ వర్గాల్లో

    ట్రేడ్ వర్గాల్లో

    ఈ ప్రాజెక్టు ప్రారంభమవుతుందనగానే బిజినెస్ వర్గాల్లో క్రేజ్ మొదలయ్యింది. అప్పుడే ట్రేడ్ ఎంక్వరీలు మొదలయ్యాయని వినికిడి. అత్తారింటికి దారేది జోష్ మీద ఉన్న పవన్ నుంచి ఈ చిత్రం కావటంతో అంచనాలు ఓ రేంజిలో ఉంటాయనటంలో సందేహం లేదు.

    English summary
    
 The formal pooja ceremony of Gabbar Singh 2 was held today (Feb 21st) at Filmnagar Temple in Hyderabad. The pooja ceremony was done with presence key members of the film’s team - Pawan Kalyan, director Sampath Nandi, music director Devi Sri Prasad and producer Sharat Marar. The pooja was done at 5 am in the morning.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X