»   »  జనసేన.... ట్రైలర్ వచ్చేసింది: త్వరలో పూర్తి సినిమా!

జనసేన.... ట్రైలర్ వచ్చేసింది: త్వరలో పూర్తి సినిమా!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవన్ కళ్యాణ్ సినిమాల్లో కొనసాగుతూనే రాజకీయాలు చేస్తానని, సినిమాలు మానేస్తే తనకు తిండి ఎవరు పెడతారు అంటూ ఇటీవల తన జనసేన పార్టీ తరుపున నిర్వహించిన సభల్లో పవన్ కళ్యాణ్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

రెండున్నరేళ్ల క్రితమే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని పెట్టినా.... కేవలం అది అప్పుడు ఎన్నికల ముందు హడావుడి చేయడానికే పరమితం అయింది. అయితే ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ మళ్లీ జనసేన కార్యక్రమాలు, సభలతో హడావుడి మొదలు పెట్టారు. 2019 ఎన్నికలే టార్గెట్ గా పవన్ కళ్యాణ్ ఇప్పటి నుండే పార్టీని జనాల్లోకి తీసుకెళ్లడం ప్రారంభించారని టాక్.

ఇప్పటి వరకు రాజకీయ పార్టీలు తమ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి గ్రామ, మండల, జిల్లా, రాష్ట స్థాయిల్లో కమిటీలు వేసి క్యాడర్ పెంచుకునే ప్రయత్నాలు చేస్తుండటం చూసాం. అయితే పవన్ కళ్యాణ్ జనసేన మాత్రం అలాంటి ప్రయత్నాలు కాకుండా కాస్త భిన్నంగా పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.

సోషల్ మీడియా ద్వారానే

సోషల్ మీడియా ద్వారానే

ఎలాంటి కమిటీలు వేయకుండా కేవలం సోషల్ మీడియా ద్వారా ద్వారానే పార్టీని జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా సినిమా స్టైల్ లో పార్టీకి పబ్లిసిటీ చేయడం మొదలు పెట్టారు.

కొత్తగా ఉంది

కొత్తగా ఉంది

ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్ టీజర్, ట్రైలర్ లాంటివి మనం సినిమాల విషయంలోనే వింటుంటా. రాజకీయాల్లో ఇలాంటి పదాలు కానీ, ఇలాంటి పోకడలు కానీ కనిపించవు, కానీ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ డిఫరెంటు ముందుకెలుతోంది.

ఇది ట్రైలర్, త్వరలో పూర్తి సినిమా

తాజాగా జనసేన ట్రైలర్ రిలీజ్ చేసారు. అంటే త్వరలో పూర్తి సినిమా చూపించబోతున్నారన్నమాట. అంటే పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో రాజకీయాలు చేస్తారన్నమాట. ప్రస్తుతం సోషల్ మీడియా ట్రెండు నడుస్తున్న నేపథ్యంలో యువతను టార్గెట్ చేస్తూ, వారిని పార్టీ వైపు ఆకర్షించేలా ఈ ప్లాన్ చేసినట్లు స్పష్టమవుతోంది.

rn

జనసేన మోషన్ పోస్టర్

జనసేన యూట్యూబ్ ఛానల్ కూడా ఓపెన్ అయింది. సినిమాలకు కదా మోషన్ పోస్టర్ విడుదల చేసినట్లు రెండు రోజుల క్రితం మోషన్ పోస్టర్ రిలీజ్ చేసారు. దానిపై మీరూ ఓ లుక్కేయండి.

rn

జనసేన మనసేన టీజర్

జన సేన మనసేన అంటూ... టీజర్ రిలీజ్ చేసారు. దీన్ని చూసిన చాలా మంది పవన్ కళ్యాణ్ పార్టీ పబ్లిసిటీ విషయంలో సినిమా స్టైల్ లో ముందుకు సాగుతుందా? అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

పొలిటికల్ మైలేజీ కోసమే ఆ సినిమా?

పొలిటికల్ మైలేజీ కోసమే ఆ సినిమా?

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న కాటమరాయుడు చిత్రం పూర్తయిన వెంటనే ఎలాంటి విశ్రాంతి తీసుకోకుండా త్రివిక్రమ్ సినిమాను సెట్స్ పైకి తీసుకువెళ్ళే ప్లానింగ్ లో ఉన్నారు. ఇది పొలిటికల్ డ్రామాగా ఉంటుందని, పవన్ కళ్యాణ్ కు పొలిటికల్ మైలేజీ ఇచ్చే విధంగా ఉంటుందని అంటున్నారు.

వంద కోట్ల బడ్జెట్

వంద కోట్ల బడ్జెట్

పవన్-త్రివిక్రమ్ ల మూవీకి అక్షరాలా వంద కోట్ల బడ్జెట్ కేటాయించారని తెలుస్తోంది. టాలీవుడ్ లో బాహుబలి తర్వాత అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమాగా ఈ మూవీ రికార్డుల్లో నిలపాలని నిర్మాత ప్రయత్నం అని టాక్.

టైటిల్ అదేనా?

టైటిల్ అదేనా?

దీనికి 'దేవుడే దిగివచ్చినా' అనే టైటిల్ ప్రచారంలోకి వచ్చింది. తో ఈ సినిమా సాగుతుందని, కామెడీ.. ఫ్యామిలీ ఎలిమెంట్స్ తోపాటు అటు పవన్ పొలిటికల్ కెరీర్ కి కూడా ప్లస్ అయ్యేలా ఈ సినిమా ఉండనుందనే టాక్ వినిపిస్తోంది.

ఎన్టీఆర్ మాదిరిగా

ఎన్టీఆర్ మాదిరిగా

ఈ మెగా ప్రాజెక్టు పవన్ కు రియల్ లైఫ్ లో పొలిటికల్ జర్నీకు ఉపయోగపడేలా ఉండాలని డిసైడ్ చేసారట. అప్పట్లో ఎన్టీఆర్ కు బొబ్బిలిపులి చిత్రంలా, ఈ చిత్రం పవన్ కు ఉపయోగపడాలని ప్లాన్ చేసినట్లు సమాచారం.

రాజకీయాలు

రాజకీయాలు

ఇక ఈ చిత్రం కథని ప్రస్తుతం జరుగుతున్న తెలుగు రెండు రాష్టాల రాజకీయాలు, నేషనల్ పాలికిట్స్ బేస్ చేసుకుని ఉండబోతోందని తెలుస్తోంది. త్రివిక్రమ్, ఆయన పార్టనర్ రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. డాలీ దర్శకత్వంలో చేస్తున్న కాటమరాయుడు పూర్తి కాగానే.. దేవుడే దిగివచ్చినా చిత్రానికి సంబంధించిన అనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం ఉందంటున్నారు.

త్రివిక్రమ్ పవన్ కోసం వదులుకున్నాడా?

త్రివిక్రమ్ పవన్ కోసం వదులుకున్నాడా?

ఈ మూడు నెలల సమయంలో త్రివిక్రమ్ కు ఓ భారీ ఆఫర్ కూడా వచ్చినట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఓ మీడియం బడ్జెట్ లో సినిమా చేయడానికి ఈ త్రివిక్రమ్ కు దాదాపు 10 కోట్ల రూపాయల పారితోషిక ఆఫర్ వచ్చిందని, అయినప్పటికీ త్రివిక్రమ్ దానిని అందిపుచ్చుకోలేదని, తన స్నేహితుడు పవన్ కళ్యాణ్ కోసం ఆ భారీ ఆఫర్ ను వదులుకున్నాడని చెప్తున్నారు.

పవన్ కి ఇచ్చే కానుక

పవన్ కి ఇచ్చే కానుక

త్వరలో పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయి రాజకీయాల్లోకి రానున్న నేపధ్యంలో.... దానికి ముందు ఒక భారీ హిట్ ను అదీ పొలిటికల్ ఎంట్రీకి ఉపయోగపడేలా తన స్నేహితుడికి కానుకగా ఇవ్వాలని త్రివిక్రమ్ నిర్ణయించుకుని ఆ పనిలో ఉన్నారని అంటున్నారు.

అభిమానుల దేవుడు

అభిమానుల దేవుడు

పవన్ ని ఆయన అభిమానులు దేవుడుగా భావిస్తూంటారు. ఆ క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని ఆయన స్క్రిప్ట్ ను సిద్ధం చేస్తున్నాడని తెలుస్తోంది. రాథా కృష్ణ ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్ బ్యానర్ పై నిర్మించనున్నట్టు సమాచారం. ప్రస్తుతం త్రివిక్రమ్ ఈ సినిమా స్క్రిప్ట్ పనిలో బిజీగా వున్నారు.

English summary
Jana Sena Mana Sena is an exclusive video of the real spirit of Jana Sena Party. Jana Sena Mana Sena is an exclusive video of the real spirit of Jana Sena Party.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu