»   » నన్ను రెచ్చగొట్టకండ్రా...! పవన్ రెచ్చిపోతే ఇలా ఉంటది కేరళ లో కూడా

నన్ను రెచ్చగొట్టకండ్రా...! పవన్ రెచ్చిపోతే ఇలా ఉంటది కేరళ లో కూడా

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఆరంభం నుండే భారీ అంచనాల్ని మూటగట్టుకుని ప్రతి దశలోనూ పాటలు, టీజర్, ట్రైలర్లతో అభిమానుల్ని అలరిస్తూ వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రం 'కాటమరాయుడు' నీననే భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకొచ్చింది. ముందుగా అబ్రాడ్‌లో 250 స్క్రీన్ల‌లో సంద‌డి చేసి హిట్ టాక్ సంపాదించుకున్న కాట‌మరాయుడు.

తెలుగు రాష్ట్రాల్లో భారీ హిట్ టాక్‌ను సంపాదించుకుంది. రికార్డుల‌ను తిర‌గ‌రాసే టాక్ తెచ్చుకుంది. బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుంది. పవన్ హవా కేవలం ఇక్కడే కాదు పొరుగు రాష్ట్రం కేరళ లో కూడా భారీగానే క్రేజ్ తెచ్చుకున్నాడు కాటమరాయుడు. ఇదంతా ఒకేత్తైతే ఇప్పుడు కేరళలో కూడా పవన్ ప్రభంజనం మొదలయ్యింది., ఇప్పటి వరకు ఏ తెలుగు చిత్రం కూడా కేరళలోని పలు ప్రాంతాలలో పదర్శింపబడకపోగా, వాటిని కాటమరాయుడు చెరిపేసింది.

Pawan Kalyan's 'Katamarayudu' creates history in Kerala

తొలిసారి త్రిషూర్ మరియు కసర్గాడ్ ప్రాంతాలలో విడుదలైన తెలుగు చిత్రంగా కాటమరాయుడు రికార్డులు క్రియేట్ చేసింది. కొచ్చి మరియు త్రివేండ్రం ప్రాంతాలలోను ఈ సినిమా ప్రదర్శించబడడం విశేషం. కాటమరాయుడు చిత్రానికి భారీ ప్రీ రిలీజ్ బుకింగ్స్ జరుగుతుండడంతో కొచ్చి లోని మల్టీప్లెక్స్ లో మరి కొన్ని షోస్ ప్రదర్శించాలని థియేటర్ యాజమాన్యాలు భావిస్తున్నాయట.

Pawan Kalyan's 'Katamarayudu' creates history in Kerala

2014లో విడుదలైన తమిళ చిత్రం వీరమ్ కి రీమేక్ గా కాటమరాయుడు చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. కేరళలో అజిత్, పవన్ కలిసి ఉన్న ఫోటోలతో కటౌట్స్ కూడా వెలుస్తున్నాయి. ఇక ఓవర్సీస్ లోను కాటమరాయుడు ఎక్కువ స్క్రీన్స్ లో విడుదలైన చిత్రంగా రికార్డులు సృష్టించిందని చెబుతున్నారు.

English summary
It's rarest of the rare for a Tollywood movie to release in Kerala in Telugu itself. But Power Star Pawan Kalyan's Katamarayudu not just had a release but also created a history in Kerala for a Telugu movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu