»   » మెగా ఫ్యాన్స్‌కు మరో జోష్.. కాటమరాయుడు లేటెస్ట్ న్యూస్..

మెగా ఫ్యాన్స్‌కు మరో జోష్.. కాటమరాయుడు లేటెస్ట్ న్యూస్..

Posted By:
Subscribe to Filmibeat Telugu

మెగా అభిమానులకు జోష్ కలిగించే మరో వార్త. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తాజా చిత్రం కాటమరాయుడు టీజర్ విడుదలకు సిద్ధమైంది. ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఈ టీజర్ విడుదల కోసం శనివారం (ఫిబ్రవరి 4) సాయంత్రం 4 గంటలకు ముహుర్తం నిర్ణయించారు. ఈ విషయాన్ని నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ తెలిపింది.

Pawan Kalyan's Katamarayudu teaser release date announced

కాటమరాయుడు చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నది. హైదరాబాద్ నానక్‌రాంగూడలోని రామానాయుడు స్టూడియోలో పోరాట దృశ్యాలను ప్రస్తుతం తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. అనంతరం చిత్ర యూనిట్ అనకాపల్లికి చేరుకోనున్నది.

ఈ చిత్రం కోసం అనకాపల్లికి సమీపంలోని సముద్ర తీరంలో ప్రత్యేకంగా ఓ కొండపై ఇంటి సెట్ ను రూపొందించారు. ఈ సెట్ అభిమానులను విశేషంగా ఆకట్టుకొంటున్నది. కాటమరాయుడిని వేసవిలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

English summary
Pawan Kalyan's Katamarayudu teaser getting ready for release on February 4th.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu