»   » పవన్ సినిమా: భద్రాచలంలో లొకేషన్ల వేట

పవన్ సినిమా: భద్రాచలంలో లొకేషన్ల వేట

Subscribe to Filmibeat Telugu

కొత్తబంగారు లోకం చిత్ర దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాల మరో సినిమాకు శ్రీకారం చుట్టారు. పవన్ కళ్యాణ్, వెంకటేష్ లతో మల్టీస్టార్‌ గా ఈ చిత్రం తీయనున్నారు. భద్రాచలంలోనే చిత్రీకరించేందుకు, లోకేషన్లు పరిశీలించేందుకు ఆయన భద్రాచలం వచ్చారు. సీతారాముల కల్యాణ వేదిక, ఆలయం తదితర పరిసర ప్రాంతాల్లో తీసే సన్నివేశాలను తెరకెక్కించనున్నారు.

తెలుగు చిత్ర పరిశ్రమలో ఇద్దరు అగ్రహీరోలు కల్సి నటించిన చిత్రం చాలా ఏళ్ల తర్వాత ఇదే కాబోతుంది. మరో 20 రోజుల్లో భద్రాచలంలో ఈ చిత్ర షూటింగ్‌ ప్రారంభం కానుందని శ్రీకాంత్‌ అడ్డాల వివరించారు. తనకు కమల్ హసన్, పవన్ కల్యాణ్ అభిమాన హీరోలని ఆయన చెప్పారు.

Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu