»   » పవన్ హీరోయిన్ పక్కా అయింది

పవన్ హీరోయిన్ పక్కా అయింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

సర్దార్ గబ్బర్ సింగ్ భారీ పరాజయం తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఎస్ జే సూర్య దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం రెగ్యూలర్ షూటింగ్ జూన్ నుండి మొదలు కానుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి..

అయితే ఇంతకాలం ఈ చిత్ర యూనిట్ ని ఇబ్బంది పెట్టిన ఒకే ఒక సమస్య "హీరోయిన్" . పవన్ సరసన రాబోయే అదృష్టవంతురాలు ఎవరా అని అంతా ఎదురు చూసారు. ఒక దశ లో గబ్బర్ సింగ్ హీరోయిన్ శృతీ హసన్ అనీ మరోసారి కాదనీ వార్తలొచ్చాయి..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ఫ్యాక్షన్ లవ్ స్టోరీ నేపధ్యంలో ఉండగా, పవన్‌తో రొమాన్స్ చేసే ఛాన్స్ మళయాళీ పిల్ల పార్వతీ మీనన్ ని సెలక్ట్ చేసి నట్టుకూడా చెప్పుకున్నా.. పవన్ నుంచి గానీ, సూర్య నుంచి గానీ ఎటువంటి ప్రకటనా లేక పొవటంతో ఎవరూ పట్టించుకోలేదు..

Pawan Kalyan's next film heroine hunt ends

అయితే తాజా సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ ఈ చిత్రం లో హీరోయిన్ గా బెంగళూర్ డేస్ సక్సెస్ తో ఆకట్టుకున్న మలయాళీ భామ పార్వతీ మీనన్ నే హీరోయిన్ గా తీసుకున్నాడు. పార్వతి ని హీరోయిన్ గా పెట్టాలని దర్శకుడు ఫోటో షూట్ ని కూడా పూర్తి చేసారట...

మాల్లువుడ్ లో పలు చిత్రాల్లో మెప్పించిన పార్వతి స్టార్ హీరోయిన్ గా మాత్రం గుర్తింపు తెచ్చుకోలేదు. అలాంటి హీరోయిన్, పవన్ ఇమేజ్ కు ఎలా సూట్ అవుతుందన్న డైలామాలో ఉన్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్. కానీ దర్శకుడు సూర్య మాత్రం ఇప్పడున్న స్థితిలో పార్వతీ మీనన్ సరైన చాయిస్ అనా ఫీలవుతున్నాడట. మరి పార్వతినే కొనసాగిస్తారో.... లేక నిర్ణయం మార్చుకుంటారో చూడాలి...

English summary
Parvathy Menon To Romance With Pawan Kalyan in Pawan's new Movie wit SJ.Surya
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu