»   »  దుబాయి కు ఏప్రియల్ లో పవన్ ప్రయాణం, ఎందుకంటే ..పూర్తి డిటేల్స్

దుబాయి కు ఏప్రియల్ లో పవన్ ప్రయాణం, ఎందుకంటే ..పూర్తి డిటేల్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : పవన్ కల్యాణ్‌ హీరోగా త్రివిక్రమ్‌ రూపొందించే సినిమా షూటింగ్‌ ఏప్రిల్‌ మొదటి వారంలో ప్రారంభం కానున్నది. తొలి షెడ్యూల్‌ను దుబాయ్‌లో నిర్వహించేందుకు నిర్మాత, హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్ అధినేత ఎస్‌. రాధాకృష్ణ సన్నాహాలు చేస్తున్నారు.

పవన్, త్రివిక్రమ్‌ మునుపటి సినిమాలు 'జల్సా', 'అత్తారింటికి దారేది' తరహాలోనే ఈ సినిమాలోనూ ఇద్దరు హీరోయిన్స్.. కీర్తి సురేశ్, అను ఇమ్మాన్యుయేల్‌.. నటిస్తున్నారు. ఓ కీలక పాత్రను ఖుష్బూ పోషిస్తున్నారు. తమిళ సంగీత సంచలనం అనిరుధ్‌ స్వరాలు సమకూరుస్తున్నాడు.

అందుతున్న సమచారం ప్రకారం.. పవన్-త్రివిక్రమ్ ల మూవీకి అక్షరాలా వంద కోట్ల బడ్జెట్ కేటాయించారని తెలుస్తోంది. టాలీవుడ్ లో బాహుబలి తర్వాత అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమాగా ఈ మూవీ రికార్డుల్లో నిలపాలని నిర్మాత ప్రయత్నం అని చెప్తున్నారు.

Pawan Kalyan's next with Trivikram Srinivas@dubai

ఇక .. ఇప్పటికే 'దేవుడే దిగివచ్చినా' అనే టైటిల్ ని త్రివిక్రమ్ , పవన్ చేత అయినట్లు తెలుస్తోంది. కామెడీ.. ఫ్యామిలీ ఎలిమెంట్స్ తోపాటు అటు పవన్ పొలిటికల్ కెరీర్ కి కూడా ప్లస్ అయ్యేలా ఈ సినిమా ఉండనుందనే టాక్ వినిపిస్తోంది.

ఈ మెగా ప్రాజెక్టు పవన్ కు రియల్ లైఫ్ లో పొలిటికల్ జర్నీకు ఉపయోగపడేలా ఉండాలని డిసైడ్ చేసారట. అప్పట్లో ఎన్టీఆర్ కు బొబ్బిలిపులి చిత్రంలా, ఈ చిత్రం పవన్ కు ఉపయోగపడాలని ప్లాన్ చేసినట్లు సమాచారం.

ఇక ఈ చిత్రం కథని ప్రస్తుతం జరుగుతున్న తెలుగు రెండు రాష్టాల రాజకీయాలు, నేషనల్ పాలికిట్స్ బేస్ చేసుకుని ఉండబోతోంది. త్రివిక్రమ్, ఆయన పార్టనర్ రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. డాలీ దర్శకత్వంలో చేస్తున్న కాటమరాయుడు పూర్తి కాగానే.. దేవుడే దిగివచ్చినా చిత్రానికి సంబంధించిన అనౌన్స్ మెంట్ వచ్చే అవకాసం ఉందంటున్నారు.

మరో ప్రక్క ఈ మూడు నెలల సమయంలో త్రివిక్రమ్ కు ఓ భారీ ఆఫర్ కూడా వచ్చినట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఓ మీడియం బడ్జెట్ లో సినిమా చేయడానికి ఈ త్రివిక్రమ్ కు దాదాపు 10 కోట్ల రూపాయల పారితోషిక ఆఫర్ వచ్చిందని, అయినప్పటికీ త్రివిక్రమ్ దానిని అందిపుచ్చుకోలేదని, తన స్నేహితుడు పవన్ కళ్యాణ్ కోసం ఆ భారీ ఆఫర్ ను వదులుకున్నాడని చెప్తున్నారు.

త్వరలో పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయి రాజకీయాల్లోకి రానున్న నేపధ్యంలో. దానికి ముందు ఒక భారీ హిట్ ను అదీ పొలిటికల్ ఎంట్రీకి ఉపయోగపడేలా తన స్నేహితుడికి కానుకగా ఇవ్వాలని త్రివిక్రమ్ నిర్ణయించుకుని ఆ పనిలో ఉన్నారట.

ఈ టైటిల్ ని నాగార్జున నటించిన సంతోషం చిత్రంలోని 'దేవుడే దిగి వచ్చినా' .. పాటలోని మొదటి పదాలను టైటిల్ గా తీసుకోబోతున్నారు. పవన్ ని ఆయన అభిమానులు దేముడుగా భావిస్తూంటారు. ఆ క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని ఆయన స్క్రిప్ట్ ను సిద్ధం చేస్తున్నాడని తెలుస్తోంది. రాథా కృష్ణ ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్ బ్యానర్ పై నిర్మించనున్నట్టు సమాచారం.

ప్రస్తుతం త్రివిక్రమ్ ఈ సినిమా స్క్రిప్ట్ పనిలో బిజీగా వున్నారు. ఈ స్క్రిప్ట్ కి ఆయన ఇదే టైటిల్ పెట్టుకున్నారని సమాచారం. ఇది ఫైనల్ అవుతుందో లేదో గానీ వర్కింగ్ టైటిల్ మాత్రమే ఇదేనని విశ్వసనీయవర్గాల సమాచారం.

English summary
Pawan Kalyan's upcoming outing with director Trivikram Srinivas will go on the floors in March, say reports.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu