»   » ఫ్యామిలీతో పవన్ అవుటింగ్.. ఫొటోలో ఎవరున్నారో చూడండి

ఫ్యామిలీతో పవన్ అవుటింగ్.. ఫొటోలో ఎవరున్నారో చూడండి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : పవన్ కళ్యాణ్ కి చెందిన అరుదైన ఫొటో ఇది. ఆయన తన కుటుంబంతో కలిసి హైదరాబాద్ వెస్టిన్ హోటల్ లో కలిసి డిన్నర్ కు వ్చచినప్పుడి ఫొటో ఇది. పవన్ కల్యాణ్ , ఆయన మాజీ భార్య రేణూ దేశాయ్,పిల్లలనూ ఈ ఫొటోలో మీరు చూడవచ్చు. రేణు దేశాయ్..షార్ట్ హెయిర్ తో కూర్చుని తన పిల్లల అవసరాలు చూస్తోంది. పవన్ కళ్యాణ్ ఆ ఫొటో తీస్తున్న వ్యక్తి వంక చూస్తున్నారు.

ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. సాధారణంగా పవన్ కల్యాణ్ బయట ఫంక్షన్లలోనూ, రెస్టారెంట్లలోనూ కనిపించడం చాలా అరుదు . అలాంటిది కొడుకు అకిరా, కూతురు ఆద్య సహా రేణూ దేశాయ్ తో కలిసి ఉన్న ఈ ఫోటోను ఫ్యాన్స్ ఓ రేంజిలో షేర్ చేస్తున్నారు.

రెస్టారెంట్ కి వచ్చినప్పుడు అక్కడే ఉన్న మరో కస్టమర్ ఈ ఫోటోను తీసినట్టుగా తెలుస్తోంది. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నప్పటికీ పిల్లలతో సమయం గడిపేందుకు పవన్ ఇలా తీరిక చేసుకున్నట్టు చెప్తున్నారు.

ఆగిపోయిన పవన్ ..10 సినిమాలు లిస్ట్ (పొస్టర్స్ తో )

Pawan Kalyan's Outing with Family

'సర్దార్‌..' విషయానికి వస్తే... పవన్‌ కళ్యాణ్‌, కాజల్‌ జంటగా బాబీ దర్శకత్వంలో పవన్‌ కళ్యాణ్‌ క్రియేటివ్‌ వర్క్స్‌, నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఈరోస్‌ ఇంటర్నేషనల్‌ పతాకాలపై శరత్‌ మారర్‌, సునీల్‌ లుల్లా సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌'. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌లో భాగంగా గుర్రాల మేళా జరుగుతోంది.

ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ, 'అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. 'హార్స్‌ మేళా' పేరుతో గుర్రాలపై షూటింగ్‌ చేస్తున్నాం. ఈ మేళాలో వంద గుర్రాలు, వంద మంది అశ్వికులు, 40 మంది చిత్రానికి సంబంధించిన ప్రధాన తారగణం, అలాగే వెయ్యిమంది జూనియర్‌ ఆర్టిస్టులు పాల్గొనగా మూడు యూనిట్స్‌తో 'హార్స్‌మేళా' సన్నివేశాలను అత్యంత భారీగా చిత్రీకరిస్తున్నాం.

నో మూడ్, ఏకాదశి ఇంకా... : 'గబ్బర్ సింగ్'...కొన్ని సీక్రెట్స్

ఈ మేళా సినిమాకే హైలైట్‌గా నిలుస్తుంది. గుర్రాలే కాకుండా కొన్ని పురాతన కార్లతోపాటు అధునాతన కార్లను కూడా చిత్రీకరణలో వాడుతున్నాం. సాంకేతిక విలువలకు పెద్ద పీట వేస్తూ తెరకెక్కిస్తున్న ఈ చిత్ర షూటింగ్‌ ఇప్పటికే బరోడా, రాజ్‌కోట, కేరళ, మల్‌షేట్స్‌ ఘాట్స్‌, మహారాష్ట్ర తదితర ప్రదేశాల్లో జరిగింది. దాదాపు షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. మార్చిలో ఆడియోను విడుదల చేసి, ఏప్రిల్‌ 8న సినిమాను రిలీజ్‌ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం' అని అన్నారు.

English summary
Picture of Pawan Kalyan dining with his entire family at the Westin Hotel in Hyderabad is here.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu