Just In
- 6 min ago
ప్రభాస్ ‘ఆదిపురుష్’ నుంచి ఊహించని అప్డేట్: వాళ్లందరినీ చూపించిన దర్శకుడు ఓం రౌత్
- 10 hrs ago
పుష్ప కోసం మరో కొత్త విలన్.. ఇదైనా నిజమవుతుందా?
- 10 hrs ago
మరోసారి పవర్ స్టార్ పేరును వాడుతున్న వరుణ్ తేజ్
- 11 hrs ago
బైక్ పై స్టార్ హీరో వేల కిలోమీటర్ల ప్రయాణం.. ఎంత దూరం వెళ్ళాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
Don't Miss!
- Sports
రోహిత్ ఔట్.. గిల్ హాఫ్ సెంచరీ.. భారత్ స్కోర్ ఎంతంటే?
- News
గర్జించబోతున్న కేసీఆర్... 'కమ్ బ్యాక్' కోసం భారీ బహిరంగ సభ... ఈసారి తిరుగులేని వ్యూహంతో?
- Lifestyle
మంగళవారం దినఫలాలు : ఈరోజు తొందరపాటు నిర్ణయం వల్ల మీరు ఆర్థికంగా నష్టపోవచ్చు...!
- Finance
బంగారం ధర పెరిగింది, కానీ ఆ మార్క్‌కు దిగువనే: రూ.66,300 వద్ద వెండి ధరలు
- Automobiles
కార్ డ్రైవర్ల గురించి సంచలన నిజాలు బయటపెట్టిన సర్వే.. ఏంటి ఆ నిజాలు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
‘జనసేన’...ఇదేంది వింతగా ఉంది, సినిమా స్టైలా?
హైదరాబాద్: ఫస్ట్ లుక్ పోస్టర్, మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్ టీజర్... ఇలాంటి పదాలు మనం సినిమాల విషయంలోనే విన్నాం. కానీ రాజకీయాల్లో ఇలాంటి పదాలు గానీ, పోకడలు కానీ కనిపించవు. అయితే పవన్ కళ్యాణ్ 'జనసేన' విషయంలో మాత్రం ఇలాంటి వింతలు కనిపిస్తున్నాయి.
రెండున్నరేళ్ల క్రితమే పవన్ కళ్యాణ్ పార్టీ స్థాపించారు. ఎన్నికల ముందు హడావుడి చేసారు. తర్వాత తన సినిమాల్లో బిజీ అయిపోయారు. ఆ మధ్య ఏపీ కొత్త రాజధాని భూసేకరణ విషయంలో అక్కడి వారు ఎదుర్కొంటున్న సమస్యలు, ఆందోళన వంటి వాటిలో జోక్యం చేసుకున్నారు.
ఈ మధ్య కాలంలో మళ్లీ పవన్ కళ్యాణ్ పార్టీ విషయంలో కాస్త యాక్టివ్ అయ్యారు. వివిధ ప్రాంతాల్లో జనసేన సభలు పెట్టి హోరెత్తించారు. సోషల్ మీడియాలో కూడా అపీషియల్ పేజీలు ఓపెన్ చేసారు.
జనసేన మోషన్ పోస్టర్
జనసేన యూట్యూబ్ ఛానల్ కూడా ఓపెన్ అయింది. సినిమాలకు కదా మోషన్ పోస్టర్ విడుదల చేసినట్లు రెండు రోజుల క్రితం మోషన్ పోస్టర్ రిలీజ్ చేసారు. దానిపై మీరూ ఓ లుక్కేయండి.
జనసేన మనసేన టీజర్
తాజాగా జన సేన మనసేన అంటూ... టీజర్ రిలీజ్ చేసారు. దీన్ని చూసిన చాలా మంది పవన్ కళ్యాణ్ పార్టీ పబ్లిసిటీ విషయంలో సినిమా స్టైల్ లో ముందుకు సాగుతుందా? అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

పొలిటికల్ మైలేజీ కోసమే ఆ సినినిమా?
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న కాటమరాయుడు చిత్రం పూర్తయిన వెంటనే ఎలాంటి విశ్రాంతి తీసుకోకుండా త్రివిక్రమ్ సినిమాను సెట్స్ పైకి తీసుకువెళ్ళే ప్లానింగ్ లో ఉన్నారు. ఇది పొలిటికల్ డ్రామాగా ఉంటుందని, పవన్ కళ్యాణ్ కు పొలిటికల్ మైలేజీ ఇచ్చే విధంగా ఉంటుందని అంటున్నారు.

వంద కోట్ల బడ్జెట్
పవన్-త్రివిక్రమ్ ల మూవీకి అక్షరాలా వంద కోట్ల బడ్జెట్ కేటాయించారని తెలుస్తోంది. టాలీవుడ్ లో బాహుబలి తర్వాత అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమాగా ఈ మూవీ రికార్డుల్లో నిలపాలని నిర్మాత ప్రయత్నం అని టాక్.

టైటిల్ అదేనా?
దీనికి 'దేవుడే దిగివచ్చినా' అనే టైటిల్ ప్రచారంలోకి వచ్చింది. తో ఈ సినిమా సాగుతుందని, కామెడీ.. ఫ్యామిలీ ఎలిమెంట్స్ తోపాటు అటు పవన్ పొలిటికల్ కెరీర్ కి కూడా ప్లస్ అయ్యేలా ఈ సినిమా ఉండనుందనే టాక్ వినిపిస్తోంది.

ఎన్టీఆర్ మాదిరిగా
ఈ మెగా ప్రాజెక్టు పవన్ కు రియల్ లైఫ్ లో పొలిటికల్ జర్నీకు ఉపయోగపడేలా ఉండాలని డిసైడ్ చేసారట. అప్పట్లో ఎన్టీఆర్ కు బొబ్బిలిపులి చిత్రంలా, ఈ చిత్రం పవన్ కు ఉపయోగపడాలని ప్లాన్ చేసినట్లు సమాచారం.

రాజకీయాలు
ఇక ఈ చిత్రం కథని ప్రస్తుతం జరుగుతున్న తెలుగు రెండు రాష్టాల రాజకీయాలు, నేషనల్ పాలికిట్స్ బేస్ చేసుకుని ఉండబోతోందని తెలుస్తోంది. త్రివిక్రమ్, ఆయన పార్టనర్ రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. డాలీ దర్శకత్వంలో చేస్తున్న కాటమరాయుడు పూర్తి కాగానే.. దేవుడే దిగివచ్చినా చిత్రానికి సంబంధించిన అనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం ఉందంటున్నారు.

త్రివిక్రమ్ పవన్ కోసం వదులుకున్నాడా?
ఈ మూడు నెలల సమయంలో త్రివిక్రమ్ కు ఓ భారీ ఆఫర్ కూడా వచ్చినట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఓ మీడియం బడ్జెట్ లో సినిమా చేయడానికి ఈ త్రివిక్రమ్ కు దాదాపు 10 కోట్ల రూపాయల పారితోషిక ఆఫర్ వచ్చిందని, అయినప్పటికీ త్రివిక్రమ్ దానిని అందిపుచ్చుకోలేదని, తన స్నేహితుడు పవన్ కళ్యాణ్ కోసం ఆ భారీ ఆఫర్ ను వదులుకున్నాడని చెప్తున్నారు.

పవన్ కి ఇచ్చే కానుక
త్వరలో పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయి రాజకీయాల్లోకి రానున్న నేపధ్యంలో.... దానికి ముందు ఒక భారీ హిట్ ను అదీ పొలిటికల్ ఎంట్రీకి ఉపయోగపడేలా తన స్నేహితుడికి కానుకగా ఇవ్వాలని త్రివిక్రమ్ నిర్ణయించుకుని ఆ పనిలో ఉన్నారని అంటున్నారు.

అభిమానుల దేవుడు
పవన్ ని ఆయన అభిమానులు దేవుడుగా భావిస్తూంటారు. ఆ క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని ఆయన స్క్రిప్ట్ ను సిద్ధం చేస్తున్నాడని తెలుస్తోంది. రాథా కృష్ణ ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్ బ్యానర్ పై నిర్మించనున్నట్టు సమాచారం. ప్రస్తుతం త్రివిక్రమ్ ఈ సినిమా స్క్రిప్ట్ పనిలో బిజీగా వున్నారు.