»   »  బెనిఫిట్ షోలలో ‘సర్దార్’ రికార్డ్, ఎన్ని షోలంటే...

బెనిఫిట్ షోలలో ‘సర్దార్’ రికార్డ్, ఎన్ని షోలంటే...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన 'సర్దార్ గబ్బర్ సింగ్' ప్రపంచవ్యాప్తంగా రేపు (ఏప్రిల్ 8న) భారీ ఎత్తున విడుదలకు సిద్ధమైన విషయం తెలిసిందే. సినిమాను అందరికంటే ముందుగా బెనిఫిట్ షోలో చూసేందుకు అభిమానులు ఆసక్తి చూపుతున్నారు. ముందుగా కొన్ని థియేటర్లలో బెనిఫిట్ షోలు ప్లాన్ చేసారు. అయితే ఆ టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడు పోయాయి.

బెనిపిట్ షోలకు డిమాండ్ బాగా పెరగడంతో షోల సంఖ్య పెంచుకుంటూ పోయారు. చివకు ఈ షోల సంఖ్య 250కి చేరుకుంది. ఇంత భారీ మొత్తంలో బెనిఫిట్ షోలు నిర్వహించడం టాలీవుడ్లో ఇదే తొలిసారి. ఈ అర్థరాత్రి నుంచే తెలుగు రాష్ట్రాలు, అమెరికాలో బెనిఫిట్ షోలు ప్రదర్శితం కాబోతున్నాయి.


Pawan Kalyan

బెనిఫిట్ షోల టికెట్ రేట్లు మినిమమ్ 500 నుండి 3000 వేల వరకు అమ్ముతున్నారు. ఈ లెక్కన ఒక్క బెనిఫిట్ షోల ద్వారానే కోట్ల రూపాయలు వసూలు కానున్నాయని అంచనా. ఒక సినిమా ఓపెనింగ్ డే వసూళ్లు రికార్డు స్థాయిలో ఉండటం ఖాయం అంటున్నారు.


ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 42 దేశాల్లో 'సర్దార్' చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. సినిమా విడుదలవుతున్న స్క్రీన్ల సంఖ్య 2వేల పైనే ఉంటుందని అంచనా. సినిమా ఓవరాల్ గా రూ. 100 నుండి 120 కోట్లు వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కెరీర్లోనే ఈ సినిమా భారీ బ్లాక్ బస్టర్ కాబోతుందని ఫ్యాన్స్ అంటున్నారు.

English summary
As per the reports pouring in, Powerstar Pawan Kalyan's Sardaar Gabbar Singh has credited a record to its account, even before the release. The film is gearing up to have a record number of premieres/benefit shows all over the World.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu