For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  'జులాయి' బాధ్యతలు తీసుకున్న పవన్ కళ్యాణ్

  By Srikanya
  |

  హైదరాబాద్ : అల్లు అర్జున్, ఇలియానా కాంబినేషన్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందిస్తున్న రొమాంటిక్ ఎంటర్టనర్ 'జులాయి'. ఇప్పటికే ట్రేడ్ వర్గాల్లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకన్న ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం ఆగస్టు 9 న విడుదల అవుతోంది. ఈ నేఫద్యంలో ఈ చిత్రంపై ప్రత్యేకమైన దృష్టిని పవన్ కళ్యాణ్ పెట్టినట్లు సమాచారం. ఆయనకి త్రివిక్రమ్ ప్రెండ్ కావటం,అల్లు అర్జున్ రిలేషన్ కావటంతో ఈ భాద్యత తీసుకున్నట్లు ెప్తున్నారు. ఎప్పటికప్పుడు ప్రి రిలీజ్ వర్క్, పోస్ట్ ప్రొడక్షన్ స్టేటస్ ని ఎంక్వైరీ చేస్తూ సూచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

  ఇక ఖలేజా తో ప్లాపు లో ఉన్న త్రివిక్రమ్,బద్రీనాధ్ తో ప్లాప్ లో ఉన్న అల్లు అర్జున్ కి ఇప్పుడు హిట్ కావాలి. ఇద్దరూ క్లోజ్ కావటంతో పవన్ ఈ చిత్రం రిలీజ్ ని స్మూత్ గా జరిగేటట్లు చూడటం,ట్రైలర్స్ కటింగ్ దగ్గర నుంచి తన సూచనలు ఇవ్వటం వంటివి చేసారని ఫిల్మ్ నగర్ టాక్. కెమెరామెమ్ గంగతో రాంబాబు షూటింగ్ లో ఎంత బిజీగా ఉన్నా ఈ చిత్రం పై పూర్తి దృష్టి పెట్టినట్లు సమాచారం. దాంతో త్రివిక్రమ్,అల్లు అర్జున్ చాలా హ్యాపీగా ఉన్నట్లు,పవన్ కి ప్రత్యేక ధాంక్స్ చెప్తున్నట్లు తెలుస్తోంది.

  ''జీవితాన్ని తేలిగ్గా తీసుకొనే యువకుడి చుట్టూ మా 'జులాయి' కథ తిరుగుతుంది. వినోదం, యాక్షన్‌ అంశాలు సమపాళ్లలో ఉంటాయి. త్రివిక్రమ్‌ శైలి సంభాషణలు, అర్జున్‌ నృత్యాలు అలరిస్తాయని''అన్నారు నిర్మాత ఎస్‌.రాధాకృష్ణ. అలాగే...జీవితాన్ని ఆస్వాదించడం ఎలాగో చాలామందికి తెలీదు. పరుగులు తీసే వయసులో చదువు, ఉద్యోగం.. అంటూ ముందర కాళ్లకు బంధమేసుకొంటారు. అన్నీ అందాక... ఇక పరిగెట్టే ఓపిక ఉండదు. అందుకే జోష్‌ ఉన్నప్పుడే జల్సా చేయాలి... అన్నది ఆ కుర్రాడి సిద్ధాంతం. జులాయి, దేశముదురు అని పిలుస్తారేమో అన్న బెంగలేదు. ఈ బిరుదులుంటేనే అమ్మాయిలు సులభంగా ప్రేమలో పడిపోతారనేది అతని నమ్మకం. అదే నిజమైంది. ఓ అందాల భామ ఈ జులాయికి మనసిచ్చేసింది. ఆ తరవాత ఏం జరిగిందో తెరపైనే చూడాలి అన్నారు.

  అలాగే కథానుగుణంగానే కాక, పాత్రోచితంగా కూడా ఈ చిత్రానికి 'జులాయి' పేరే సరైనది అని దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ నిర్ణయించారు. ఇందులో త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ ప్రేక్షకుల్లోకి బుల్లెట్స్‌లా దూసుకుపోతాయని, అవి అల్లు అర్జున్ నోట ఆటంబాంబుల్లా పేలతాయని సమర్పకుడు డీవీవీ దానయ్య చెబుతున్నారు. ''అర్జున్‌ శైలి నటన, నృత్యాలు ప్రధాన ఆకర్షణ. ఈ సినిమా కోసం రామోజీ ఫిల్మ్‌సిటీలో ప్రత్యేకంగా ఓ సెట్‌ని నిర్మిస్తున్నాము. త్రివిక్రమ్ టేకింగ్, బన్నీ ఎనర్జీ, ఇలియానా అందం, రాజేంద్రప్రసాద్ అభినయం, దేవిశ్రీ సంగీతం మా 'జులాయి' చిత్రానికి హైలైట్‌గా నిలువనున్నాయి''అన్నారు . ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్‌, సోనుసూద్‌, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, తులసి, ప్రగతి, హేమ తదితరులు నటిస్తున్నారు. సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌.

  English summary
  Pawan Kalyan was spotted overseeing the postproduction work of Allu Arjun's Julayi. We have learnt that Pawan Kalyan has been in touch with director Trivikram and producers Radhakrishna and Danayya and enquiring about the movie's pre-release work and postproduction status. Julayi starring Allu Arjun and Ileana as the lead pair hits the screens worldwide on Aug 9th.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X