»   » సమంత దంపతులకు పవన్, త్రివిక్రమ్ స్పెషల్ గిఫ్ట్.. పెళ్లికి ఏమి ఇచ్చారో తెలుసా!

సమంత దంపతులకు పవన్, త్రివిక్రమ్ స్పెషల్ గిఫ్ట్.. పెళ్లికి ఏమి ఇచ్చారో తెలుసా!

Posted By:
Subscribe to Filmibeat Telugu
Pawan And Trivikram Given Surprize Gift To Samantha ఏం గిఫ్ట్ ఇచ్చారో తెలిస్తే షాక్ అవుతారు..

టాలీవుడ్‌లో గొప్ప చెప్పుకొనే విధంగా ఇటీవల గోవాలో అక్కినేని నాగచైతన్య, సమంత వివాహం ప్రైవేటు కార్యక్రమంగా జరిగిన విషయం తెలిసిందే. అక్కినేని, దగ్గుబాటి ఫ్యామిలీ, సమంత కుటుంబ సభ్యులు, అతి తక్కువ మంది సన్నిహితులు ఈ వేడుకలో పాల్లొన్నారు. ఈ వేడుకలో పాల్గొన్న బందువులు స్నేహితులు చాలా ఉత్సాహంగా డాన్స్‌లు చేస్తూ హంగామా చేశారు. సినీ ప్రముఖుల సందడి కూడా ఎక్కువగా కనిపించలేదు. కానీ చైతూ, సమంత దంపతులకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ ఓ అరుదైన బహుమతిని అందించినట్టు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది.

 త్రివిక్రమ్‌తో ట్రిపుల్ ధమాకా

త్రివిక్రమ్‌తో ట్రిపుల్ ధమాకా

త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ సరసన అత్తారింటికి దారేది, సన్నాఫ్ సత్యమూర్తిలో అల్లు అర్జున్‌తో, నితిన్‌తో అ ఆ అనే చిత్రంలో సమంత నటించింది. ఆయా చిత్రాల షూటింగ్‌ సందర్భంగా త్రివిక్రమ్, పవన్‌కు మధ్య సమంతకు ఫ్రెండ్లీ రిలేషన్ ఏర్పాడ్డాయి. సాధారణంగా ఎవరితో ఎక్కువగా కలువని పవర్ స్టార్‌కు సమంత మధ్య మంచి రిలేషన్ ఏర్పడిందట.

పవన్‌, సమంత మధ్య క్లోజ్ రిలేషన్

పవన్‌, సమంత మధ్య క్లోజ్ రిలేషన్

సమంత కూడా మంచి సోషల్ పర్సన్ కావడంతో వారి మధ్య రిలేషన్‌కు మంచి అవకాశ ఏర్పడింది. సమంతకు కూడా సామాజిక సేవ కూడా ఎక్కువ. సాధారణంగా వారి మధ్య ఉన్న అభిరుచులు వారు దగ్గరయ్యేలా చేసిందని చెప్పుకొంటారు.

 సమంతకు స్పెషల్ గిఫ్ట్‌

సమంతకు స్పెషల్ గిఫ్ట్‌

అలా పవన్‌ కల్యాణ్‌, త్రివిక్రమ్‌కు సమంత చాలా క్లోజ్ అయింది. అయితే సమంత వివాహానికి హాజరుకావాలని అనుకొన్నా కొన్ని కారణాల వల్ల వర్కవుట్ కాలేదట. పెళ్లికి వెళ్లడానికి వీలుకాని నేపథ్యంలో మ్యారేజ్‌ను పురస్కరించుకొని సమంతకు స్పెషల్ గిఫ్ట్‌ ఇవ్వాలని త్రివిక్రమ్‌, పవన్ భావించారట. దాంతో చైతూ, సమంత ఇద్దరికి డైమండ్ రింగ్స్ బహుమతి ఇచ్చినట్టు మీడియాలో కథనాలు ప్రచారం అవుతున్నాయి.

సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ను అలా ప్లాన్‌

సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ను అలా ప్లాన్‌

ప్రస్తుతం పవన్‌ కళ్యాణ్‌ హీరోగా త్రివిక్రమ్‌ సినిమా తెరకెక్కుతున్నది. చిత్రం షూటింగ్‌ సందర్బంగా ఇద్దరు కూడా మాట్లాడుకుని సమంతకు ఈ సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ను ప్లాన్‌ చేశారంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.

 సమంతకు పెళ్లి గిఫ్ట్

సమంతకు పెళ్లి గిఫ్ట్

గోవాలో పెళ్లి సందర్భంగా పవన్‌ కళ్యాణ్‌, త్రివిక్రమ్‌ పంపి, గిఫ్ట్‌ ప్యాక్‌ సమంతకు అందిందని తాజా సమాచారం. వారిద్దరూ పంపిన గిఫ్ట్‌ ప్యాక్‌ను చూసి సమంత థ్రిల్ అయిందని వార్త ప్రచారంలో ఉంది. తనకు నచ్చిన వారికి పవన్ బహుమతులు పంపడం తెలిసిందే. గతంలో తన ఫామ్ హౌస్‌లో పండిన మామిడి పండ్లను సినీ పరిశ్రమలోని వారికి రెగ్యులర్‌గా పంపడం తెలిసిందే.

నిజమా? అబద్ధమా?

నిజమా? అబద్ధమా?

సమంత దంపతులకు డైమండ్ రింగ్స్ పంపిన వార్తలో ఎంత నిజం ఉందో లేదో తెలియదు గానీ ఒకవేళ అదే నిజమైతే, సమంత మీద ఉన్న ప్రేమకు అది ఓ సాక్ష్యం అని చెప్పవచ్చు.
త్రివిక్రమ్‌తో కలిసి సమంతకు ప్రత్యేకంగా డైమండ్‌ రింగ్స్‌ చేయించడం వల్ల ఆయనకు సమంతపై ఉన్న అభిమానం తెలుస్తుంది.

 పెళ్లి రిసెప్షన్‌కు పవన్, త్రివిక్రమ్

పెళ్లి రిసెప్షన్‌కు పవన్, త్రివిక్రమ్

త్వరలో హైదరాబాద్‌లో జరగబోతున్న సమంత, నాగచైతన్యల పెళ్లి రిసెప్షన్‌కు కూడా పవన్‌, త్రివిక్రమ్‌లు హాజరు కానున్నారు. ఆ రిసెప్షన్‌కు టాలీవుడ్‌ ప్రముఖులు, తెలుగు రాష్ట్రాల రాజకీయ నాయకులు దాదాపు అంతా కూడా హాజరు అయ్యే అవకాశాలున్నాయి.

English summary
Pawan Kalyan, Trivikram Srinivas are the best friends to Samantha. Samantha did Three films with Trivikram, and one film with Pawan Kalyan. Apart from that, Samanth got married with Naga Chaitanya in Goa. Pawan and Trivikram given surprize gift to Samantha couple at the event.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu