»   » చెల్లి పెళ్లి కోసం... పవన్ కళ్యాణ్ సాయం, గురువు సత్యానంద్!

చెల్లి పెళ్లి కోసం... పవన్ కళ్యాణ్ సాయం, గురువు సత్యానంద్!

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సహాయ గుణం గురించి అందరికీ తెలిసిందే. ఇప్పటి వరకు ఆయన ఎంతో మందికి వివిధ రకాలు సహాయం చేసారు. పవన్ ఇంత పెద్ద స్టార్ కావడానికి ఆయన స్టైల్, టాలెంట్ తో పాటు ఆయన మంచి తనం, నిజాయితీ, సహాయ గుణం కూడా ఓ కారణం.

  పవన్ కళ్యాణ్ తాను చేసిన సహాయం గురించి ఎప్పుడూ ఎక్కడ ప్రకటించుకున్న సందర్భాలే లేవు. అయితే సహాయం పొందిన వారు ఏదో ఒక సందర్భంలో ఈ విషయాలను బయట పెడుతుండటంతో ఈ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

  తాజాగా పవన్ కళ్యాణ్ కు నటనలో శిక్షణ ఇచ్చిన గురువు సత్యానంద్ ఓ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ చేసిన సహాయం గురించి గుర్తు చేసుకున్నారు. తన చెల్లి పెళ్లి సమయంలో పవన్ కళ్యాణ్ తన పరిస్థితి చూసి అడగకుండానే సహాయం చేసారని తెలిపారు.

  Pawan Kalyan's Unmatchable Help To His Acting Guru Satyanand

  'నా ఫైనాన్షియల్ పరిస్థితి తెలుసుకుని ఓ సారి పవన్ కళ్యాణ్ వెంటనే తనను ఇంటికి రమ్మని కబురు పెట్టారు. వెళ్లగానే రూ. 50 వేలు చేతిలో పెట్టారు(అప్పట్లో ఈ మొత్తం చాలా ఎక్కువే). తర్వాత పెళ్లికి రావడంతో పాటు బ్యాగులో క్యాష్ తెచ్చి అవసరం ఉంటే వాడమని చెప్పారు. ఆయన సహాయం వల్లనే నా చెల్లి పెళ్లి ఎలాంటి ఇబ్బంది లేకుండా జరిగింది' అని సత్యానంద్ గుర్తు చేసుకున్నారు.

  సినిమాల్లోకి రాక ముందు పవన్ కళ్యాణ్ సత్యానంద్ వద్ద వైజాగ్ లో నటనలో శిక్షణ తీసుకున్నారు. అప్పటి నుండి తన గురువుతో పవన్ కళ్యాణ్ మంచి రిలేషన్ షిప్ మెయింటేన్ చేస్తున్నారు. తర్వాత తన అల్లుడు సాయి ధరమ్ తేజ్, అన్నయ్య కొడుకు వరుణ్ తేజ్ లను కూడా ఆయన వద్దకే శిక్షణకు పంపిన సంగతి తెలిసిందే.

  English summary
  Apparently, Pawan Kalyan helped his acting guru, Satyanand for his sister's marriage, upon knowing his poor financial position. When Satyanand called the actor to invite him for the wedding, Pawan Kalyan is said to have figured out that, he is falling short of the funds."Pawan called me to his house immediately and handed over fifty thousand rupees and he again gifted some cash to the couple." "Besides that, when he graced the occasion, he gave a bag of cash to me and said to use them, if I need", revealed Satyanand, talking to a leading daily.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more