»   » పవన్ కళ్యాణ్ సొంత ఛానల్ ఓపెన్ చేస్తున్నారు!

పవన్ కళ్యాణ్ సొంత ఛానల్ ఓపెన్ చేస్తున్నారు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పటికే ట్విట్టర్లో చేరి తన అభిప్రాయాలను వెల్లడిస్తున్న సంగతి తెలిసిందే. త్వరలో ఆయన సపరేట్‌గా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ కూడా ఓపెన్ చేయబోతున్నట్లు సమాచారం. పవన్‌.. సినిమాలు. రాజకీయ విషయాలు అన్నీ ఇందులో వుంటాయట.

రాజకీయాలకు సంబంధించి ఏదైనా విషయాన్ని ప్రజలకు చెప్పాలనుకున్నప్పుడు.... పవన్ కళ్యాణ్ నేరుగా యూట్యూబ్ వీడియో రూపంలో తన సందేశాన్ని తీసుకెళతారని, అందుకే సొంతగా తనకంటూ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఉండాలని ఆయన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Pawan Kalyan's Youtube Channel soon

పవన్ కళ్యాణ్ నటిస్తున్న సర్దార్ గబ్బర్ సింగ్ మూవీ వివరాల్లోకి వెళితే...
ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో ఆల్రెడీ ఇద్దరు బ్యూటీలు నటిస్తున్నారు. కాజల్ మెయిన్ హీరోయిన్ గా నటిస్తుండగా, సెక్సీ బ్యూటీ లక్ష్మీ రాయ్ స్పెషల్ సాంగ్ చేయడంతో పాటు ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. తాజాగా ఈ సినిమాలో మరో హాట్ బ్యూటీకి అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. బెంగుళూరు బ్యూటీ సంజన కూడా ఈ సినిమాలో ఓ పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. ఆమె సినిమాలో సంజన్ పాత్ర ఎలా ఉండబోతోంది? అనే విషయమై క్లారిటీ రావాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ తో నటించే అవకాశం రావడంతో ఫుల్ హ్యాపీగా ఉందట సంజన. త్వరలోనే ఆమె షూటింగులో జాయిన్ కాబోతోంది.

‘సర్దార్ గబ్బర్‌సింగ్' అన్ని అనుకున్నట్లు జరిగితే సంక్రాంతికి విడుదల కావాల్సి ఉంది. అయితే షూటింగ్ ఆలస్యం కావడంతో సమ్మర్‌లో విడుదల చేయబోతున్నట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు సమ్మర్ కంటే ఓ నెల ముందే విడుదల చేయాలనుకుంటున్నారని సమాచారం.

తన రాజకీయ కార్యాచరణ దృష్టిలో పెట్టుకుని సర్దార్ గబ్బర్ సింగ్‌ను నెలరోజుల ముందుగా విడుదల చేయాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. గ్రేటర్ ఎన్నికల్లో రంగంలోకి దిగే ఆలోచనలో పవన్ ఉన్నాడని.. అందుకే అభిమానులను నిరాశ పరచకూడదనే ఉద్దేశ్యంతో పవన్ కళ్యాణ్ ఈ సినిమా షూటింగ్‌ను వీలయినంత త్వరగా కంప్లీట్ చేయాలనుకుంటున్నాడట. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పవన్ కళ్యాణ్ ఫ్రెండ్ శరత్ మరార్ నిర్మిస్తున్నారు.

English summary
Film Nagar source said that, awan kalyan To launch Youtube Channel Soon.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu