»   » పవన్ కళ్యాణ్ ఇలా ప్రవర్తిస్తారని ఊహించలేదు :అనూ ఇమ్మాన్యుయేల్

పవన్ కళ్యాణ్ ఇలా ప్రవర్తిస్తారని ఊహించలేదు :అనూ ఇమ్మాన్యుయేల్

Posted By:
Subscribe to Filmibeat Telugu

పవన్ కళ్యాణ్ కొత్త సినిమా షూటింగ్ మొదలుపెట్టేసిత్రివిక్రమ్ మూవీ స్టార్ట్ చేసేశాడు.. ఇప్పుడు హైద్రాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో వేసిన 5 కోట్ల రూపాయల భారీ ఇంటి సెట్ లో.. రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది.చిన్న హీరోలకే పరిమితమైన మలయాళ ముద్దుగుమ్మ అను ఇమ్మానియేల్ ఏకంగా పవన్ కల్యాణ్ సరసన నటించే అవకాశం కొట్టేసింది.

అను ఇమ్మానియేల్

అను ఇమ్మానియేల్

ఎందరో హీరోయిన్లు ఉండగా కేవలం ఆమెనే పవన్ కల్యాణ్ ఎంపిక చేయడంపై గుసగుసలు మొదలయ్యాయి. ప్రస్తుతం పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం షూటింగ్ మొదటి రోజునే ఒక హీరోయిన్ అను ఇమాన్యుయేల్ హాజరు కాగా.. ఇప్పుడు లీడ్ హీరోయిన్ కీర్తి సురేష్ కూడా పవర్ స్టార్ మూవీ షూటింగ్ కి వచ్చేసింది.

అను ఇమ్మానియేల్

అను ఇమ్మానియేల్

అను ఇమ్మానియేల్ అమెరికా నటి. యూఎస్‌లోని ఇల్లినాయిస్‌లో జన్మించింది. ప్రస్తుతం డల్లాస్‌లో నివాసం ఉంటున్న అను దక్షిణాది చిత్ర పరిశ్రమలో నటిస్తున్నది. అను తండ్రి థంకాచన్ ఇమ్మాన్యుల్ సినీ నిర్మాత. స్వప్న సంచారీ అనే మలయాళ చిత్రంలో అను బాలనటిగా నటించింది.

యాక్షన్ హీరో బిజు

యాక్షన్ హీరో బిజు

యాక్షన్ హీరో బిజు అనే చిత్రంలో హీరోయిన్‌గా తెరంగేట్రం చేసింది. నవిన్ పాలీకి జంటగా నటించిన ఆమెకు ఈ సినిమా మంచి పేరు తెచ్చింది. నాని మూవీ మజ్నుతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అను ఇమాన్యుయేల్.. పవన్ మూవీలో సెకండ్ హీరోయిన్ గా కనిపిస్తోంది.

పవన్ బిహేవియర్

పవన్ బిహేవియర్

మూవీ షూటింగ్ టైంలో పవన్ బిహేవియర్ చూసి ఆశ్చర్యపోయిందట. అలాగే.. పవర్ స్టార్ మంచితనం చూసి మెస్మరైజ్ అయిపోయానంటోంది. ఇంతకీ అసలేం జరిగిందని అడిగితే.. అప్పుడు తెగ ఉత్సాహంగా అప్పాలకు సంబంధించిన ఓ ఫ్లాష్ బ్యాక్ చెప్పుకొచ్చింది. షూటింగ్ జరుగుతున్నపుడు షాట్ గ్యాప్ లో పవన్ ఓ సారి పలకరించి.. బాగా నచ్చిన కేరళ ఫుడ్ గురించి అడిగాడట. తనకు అప్పం అంటే చాలా ఇష్టమని చెప్పిందట అను.

అప్పాలు.. కొన్ని కేరళ కూరలు

అప్పాలు.. కొన్ని కేరళ కూరలు

'షూటింగ్ లో నేను ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఇంటరాక్షన్ కోసం ఇలా పవన్ పలకరించారని అనుకున్నాను. కానీ ఆ మరుసటి రోజే ఇంటి నుంచి తయారు చేసిన అప్పాలు.. కొన్ని కేరళ కూరలు నాకు పార్సెల్ వచ్చేశాయి. ఎంతో కాలం తర్వాత హోమ్ ఫుడ్ తినడంతో భలే సంతోషం వేసింది. పవన్ కళ్యాణ్ ఇలా ప్రవర్తిస్తారని అసలే మాత్రం ఊహ కూడా లేని నేను థ్రిల్ అయిపోయాను' అంటూ తెగ సంబరపడిపోతోంది.

English summary
During one of Pawan Kalyan initial conversations, Pawan asked Anu about her favorite Kerala food While shooting of new project with Trivikram. The very next day, Anu was surprised with lots of appams and curries to go with them.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu