twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జీసస్‌ జీవిత చరిత్ర 'క్రైస్ట్‌' లో పవన్ కళ్యాణ్

    By Srikanya
    |

    సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపొందనున్న 'క్రైస్ట్' చిత్రంలో ఓ కీలక పాత్రను పవన్ ‌కళ్యాణ్‌ పోషించనున్నారు. రామదాసు చిత్ర నిర్మాత కొండా కృష్ణంరాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ విషయాలను మీడియాకు తెలియపరుస్తూ...జీసస్‌ క్రైస్ట్‌ జీవితం ఆధారంగా ఇంగ్లిష్‌, హిందీ, తెలుగు, మలయాళ భాషల్లో నిర్మాత కొండా కృష్ణంరాజు ఓ చిత్రాన్ని నిర్మించటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ విశేషాలను నిర్మాత కొండా కృష్ణంరాజు మీడియాకు తెలియజేస్తూ -"చారిత్రక పురుషుడైన జీసస్ క్రైస్ట్ జీవిత గాథను చలన చిత్రంగా మలచడం నా అదృష్టం. చారిత్రక పురుషుల గాథలతో ఆంగ్లంలో బాలల చిత్రాలు రాలేదు. తొలిసారి మేం ఆ ప్రయోగం చేయబోతున్నాం.

    ఇక ఇప్పటి వరకు ప్రపంచంలో బైబిల్‌ ఆధారంగా అనేక ఇంగ్లిష్‌ చిత్రాలు వచ్చాయి. కింగ్‌ ఆఫ్‌ కింగ్స్‌, బెనహర్‌, టెన్‌ కమాండ్ ‌మెంట్స్‌, ప్యాషన్‌ ఆఫ్‌ క్రైస్ట్‌ వాటిల్లో అతి ముఖ్యమైనవి. ఆ తరహాలోనే భారీ స్థాయిలో, విభిన్నంగా సాగేలా మా చిత్రాన్ని ప్లాన్‌ చేస్తున్నాం.ఈ సినిమా నిర్మించడం నా అదృష్టంగా భావిస్తున్నా.

    చారిత్రక పురుషుల గాధల్ని ఎవరూ ఇంగ్లిష్‌లో బాలల చిత్రాలుగా తీయలేదు. తొలిసారి మేము ఆ ప్రయోగం చేస్తున్నాం. 12 నుంచి 14 సంవత్సరాల మధ్య వయసున్న బాలలతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. ఈ కథలో అత్యంత కీలకమైన పాత్రల్ని ఇంగ్లిష్‌, హిందీ, తెలుగు, మలయాళ భాషల్లోని అగ్రస్థాయి హీరో, హీరోయిన్స్ పోషిస్తారు. తెలుగులో ప్రముఖ హీరో పవన్‌కళ్యాణ్‌ ఈ చిత్రంలో అతి ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నారు. పవన్‌ పాత్ర ఏమిటన్నది సినిమా విడుదల వరకు సస్పెన్స్‌గానే వుంటుంది.

    అలాగే 'పేషన్‌ ఆఫ్‌ ది క్రైస్ట్‌' ఫేం, 'పా'లో అమితాబ్‌ కు మేకప్‌ చేసిన ప్రముఖ హాలీవుడ్‌ రూపశిల్పి క్రిస్టియానా టింగ్‌స్లే ఈ చిత్రానికి పనిచేస్తున్నారు. కొండా కృష్ణంరాజు గతంలో విజయేంద్రవర్మ, శ్రీరామదాసు వంటి ప్రతిష్టాత్మక చిత్రాలను నిర్మించారు. ఇక సింగీతం గురించి చెప్పవలసింది లేదు...ప్రయోగాత్మక చిత్రాలకు ఆయన పెట్టింది పేరు. ఈ ఇద్దరి కలయికలో వస్తున్న ఈ చిత్రానికి కెమెరా: శేఖర్‌.వి.జోసెఫ్‌, కళ: రవీందర్‌, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: శేషు, రచన: జె.కె.భారవి. ఇక ఈ చిత్రాన్ని ఈ నెల 30న ముంబైలో లాంఛనంగా ప్రారంభిస్తారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X