»   » ఎంత ఎదిగాడో? పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా న్యూ లుక్ (ఫోటోస్)

ఎంత ఎదిగాడో? పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా న్యూ లుక్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్‌ కుమారుడు అకీరా నందన్ లేటెస్ట్ ఫోటో చూసిన మెగా అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. నిన్న మొన్నటి వరకు పాలుగారే పసివాడిలా ఉన్న అకీరా ఇపుడు అమ్మ రేణు దేశాయ్‌ని మంచి హైట్, మంచి పర్సనాలిటీలో కనిపించడమే ఇందుకు కారణం.

ఈ ఫోటో చూసిన వారంతా... అకీరా నందన్ అచ్చం నాన్న పోలికలతోనే ఉన్నాడని.... లిటిల్ పవర్ స్టార్ అంటూ పొగడ్తలు గుప్పిస్తున్నారు. నాన్న బాటలోనే అకీరా కూడా త్వరలో సినిమా రంగం వైపు అడుగులు వేసే అవకాశం ఉంది.

టాలీవుడ్‌కి దూరంగా

టాలీవుడ్‌కి దూరంగా

అకీరా నందన్ తల్లి రేణు దేశాయ్ వద్ద తెలుగు సినిమా ఇండస్ట్రీకి దూరంగా, పూణెలో పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఇండస్ట్రీ ప్రభావం అకీరాపై పడకుండా రేణు దేశాయ్ జాగ్రత్త పడుతోందట.

చదువుపైనే ఫోకస్

చదువుపైనే ఫోకస్

చిన్న వయసు నుండే సినిమా రంగంపై వ్యామోహం ఎక్కువైతే.... అకీరా చదువులో వెనకబడే అవకాశం ఉండటంతో అకీరా విషయంలో చాలా కేర్ తీసుకుంటోంది రేణు దేశాయ్.

మెగా ఇమేజ్ లేకుండా

మెగా ఇమేజ్ లేకుండా

మెగా ఫ్యామిలీ ఇమేజ్ లేకుండానే అకీరాను ఇండస్ట్రీకి తీసుకురావాలనే ఉద్దేశ్యంలో రేణు దేశాయ్ ఉన్నట్లు తెలుస్తోంది.

మరాఠీ ఇండస్ట్రీ ద్వారానే...

మరాఠీ ఇండస్ట్రీ ద్వారానే...

అకీరాను తెలుగు ఇండస్ట్రీ ద్వారా కాకుండా మరాఠీ సినీ పరిశ్రమ ద్వారానే నటుడిగా పరిచయం చేయాలని, ఆ తర్వాతే తెలుగు ఇండస్ట్రీ వైపు వచ్చేలా రేణు దేశాయ్ ప్లాన్ చేస్తోందట. ఇప్పటికే రేణు దేశాయ్ రూపొందించిన మరాఠీ చిత్రంలో అకీరా నటించిన సంగతి తెలిసిందే.

English summary
Here is the latest photograph of Pawan Kalyan's Family comprising of Renu Desai, Akira Nandan and Aadhya. Look how tall Akira has been now. People should think twice before addressing him as a kid from now onwards. And the smile of Aadhya is priceless. The trio make a happy family!
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu