»   » పవన్ కల్యాణ్ పాట వైరల్.. త్రివిక్రమ్ జాదూ ఖాయమట..

పవన్ కల్యాణ్ పాట వైరల్.. త్రివిక్రమ్ జాదూ ఖాయమట..

Posted By:
Subscribe to Filmibeat Telugu

బైటికొచ్చి చూస్తె.. టైమేమో త్రీవో క్లాక్.. అంటూ.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులను.. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ మాయ చేసేస్తున్నాడు. సినిమాపై ఒక్క పాటతోనే.. అంచనాలను విపరీతంగా పెంచేశాడు. యూత్ కు ఐకన్ గా ఉన్న ఒకప్పటి పవన్ ను గుర్తు చేస్తూ.. ఇప్పటికీ పవర్ స్టార్ లో స్టామినా తగ్గలేదని తన పాటతోనే చెప్పేస్తున్నాడు. మొన్న పవర్ స్టార్ బర్త్ డే సందర్భంగా.. అనిరుధ్ సోషల్ మీడియాలో రిలీజ్ చేసిన ఈ సాంగ్.. ఇప్పుడు వైరల్ గా మారింది. పాట డిఫరెంట్ గా ఉందే.. అన్న మాట చాలా మంది నుంచి.. ముఖ్యంగా పవన్ ఫ్యాన్స్ నుంచి వినిపిస్తోంది.

2 రోజుల్లోనే 2 మిలియన్ల మార్క్

2 రోజుల్లోనే 2 మిలియన్ల మార్క్

అనిరుధ్ సాంగ్ ప్రభావం ఎంత ఉందన్నదీ.. సోషల్ మీడియాలో వస్తున్న క్లిక్స్ ను చూస్తే అర్థమైపోతోంది. అలా చూస్తుండగానే.. ఇలా బైటికొచ్చి చూస్తె పాటకు క్లిక్స్ పెరుగుతూ పోతున్నాయి. రెండో రోజు తిరగకముందే.. 20 లక్షల హిట్స్ ను అందుకుని.. ఈ సాంగ్ ఫ్యాన్స్ లో షేకింగ్ వేవ్స్ ను కలిగిస్తోంది..

సాంగ్ లో ఫ్రెష్ నెస్

సాంగ్ లో ఫ్రెష్ నెస్

పాటలో ఉన్న ఫ్రెష్ నెస్.. అభిమానులను విపరీతంగా అలరిస్తోంది. ఇలాంటి పాటలకు.. పవన్ క్యూట్, ఇన్నోసెంట్ ఎక్స్ ప్రెషన్స్ బాగా సూటవుతాయని ఫ్యాన్స్ అంటున్నారు. ఇప్పుడే.. ఇంతలా ఆకట్టుకుంటే.. రేపు విజువల్ పరంగా ఇంకా వండర్ అయ్యే చాన్సెస్ ఉన్నాయని.. అభిమానులు అంచనాలు పెంచేస్తున్నారు.

పాట కీర్తి తోనా.. అనూ తోనా?

పాట కీర్తి తోనా.. అనూ తోనా?

బైటికొచ్చి చూస్తే.. త్రీవో క్లాక్ అంటూ లవర్ బాయ్ పాడుతున్నట్టుగా ఉన్న ఈ పాటను.. పవన్ ఎవరితో పాడబోతున్నాడు? ఎవరితో ఆడబోతున్నాడు? కీర్తి సురేష్ తోనా.. లేదంటే అనూ ఇమాన్యుయేల్ తోనా? ఏమో.. ఎవరితో చేసినా.. పాట మాత్రం అదుర్స్ అనిపించడం ఖాయమని ఫ్యాన్స్ కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు. మ్యూజిక్ పరంగా ఫ్రెష్ గా ఉండడమే కాదు.. హీరోయిన్స్ కూడా పవన్ తో ఫస్ట్ టైమ్ చేస్తుండడం.. స్క్రీన్ కు ఇంకా ప్లస్ అవుతుందని అంటున్నారు. ఓవరాల్ గా.. త్రివిక్రమ్ టిపికల్ స్టయిల్ ఆఫ్ విజువల్ ఫీస్ట్ ఖాయమని చెప్పేస్తున్నారు.

సంక్రాంతి బరిలో..

ఓ వైపు రాజకీయాలతో బిజీగా ఉన్న పవన్.. మరోవైపు సినిమాలను త్వరగా పూర్తి చేసే పనిలో ఉన్నాడు. దీంతో.. త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా.. ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్న పట్టుదల చూపిస్తున్నాడు. సంక్రాంతి బరిలో సినిమాను నిలపడం ఖాయమని కూడా తేల్చేయడంతో.. అభిమాన హీరోను స్క్రీన్ పై చూసేందుకు.. పవన్ భక్తులు ఎదురు చూస్తున్నారు.

English summary
Baitikochi Chuste, from Pawan Kalyan's upcoming film directed by Trivikram Srinivas was unveiled on the occasion of the actor's birthday. The video features the recording session of the song. The "musical surprise" garnered lakhs of views on YouTube in just a few hours, and commenters could not stop raving about the Anirudh Ravichander composition. This is the first time Anirudh has composed for a Telugu film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X