»   » అన్నయ్యపై గుండెల్లో ప్రేమ, పీఆర్పీ విలీనంపై పవన్ కళ్యాణ్

అన్నయ్యపై గుండెల్లో ప్రేమ, పీఆర్పీ విలీనంపై పవన్ కళ్యాణ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసినపుడు మాట్లాడని పవన్ కళ్యాణ్.....ఇపుడు కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ జనసేన పార్టీని స్థాపించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నసంగతి తెలిసిందే. ఈ విమర్శలపై విశాఖలో జరిగిన సభలో క్లారిటీ ఇచ్చారు పవన్ కళ్యాణ్.

Pawan Kalyan speech Vizag

''ఏ విషయంలో అయినా.... నాకంటే ఎదుటి వారికే ఎక్కువ తెలుసు అని నమ్మే వ్యక్తిని నేను. అన్నయ్య మీద ప్రేమ నా గుండెల్లో ఉంది. పీఆర్పీ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసే సమయంలో అంతా మంచి జరుగుతుందంటే నమ్మాను. అందుకే ఐదేళ్లు వెయిట్ చేసాను'' అని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.

ఇలా వ్యాఖ్యానించడం ద్వారా విలీనం ద్వారా మంచి జరుగుతుందనే మాటలు విని దగా పడ్డానని చెప్పకనే చెప్పాడు పవన్ కళ్యాణ్. కాంగ్రెస్ హైకాండ్ రాష్ట్రాన్ని పిచ్చిపిచ్చిగా విభజించడాన్ని తప్పు బట్టారు. నేను తెలంగాణ సెంటిమెంటును గౌరవిస్తాను కానీ విభజించిన విధానాన్ని తప్పుబడుతున్నట్లు పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.

అవినీతి, అవకాశ వాద రాజకీయాలను మూలాల నుండి తొలగించడానికే తాను జన సేన పార్టీ పెట్టానని.... డబ్బున్న వాడితో సమానంగా సామాన్యుడికి న్యాయం జరుగాలనే లక్ష్యంతోనే పార్టీ పెట్టానని, తప్పు చేస్తే పవన్ కళ్యాణ్ తల అయినా తెగాల్సిందే అని ఆయన వ్యాఖ్యనించారు. బాధ్యత లేని రాజకీయ నాయకులను తన్ని తరిమికొడదామని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.

సమాజం కోసం స్వార్థం లేకుండా పని చేసే యువ నాయకుల కోసం వెతుకుతున్నాం. అలాంటి వారు దొరికే వరకు వెయిట్ చేస్తాం...ఆ తర్వాతే ఎన్నికల్లో పోటీ చేస్తాం, సీమాంధ్రతో పాటు, తెలంగాణ ప్రాంతంలో కూడా పోటీ చేస్తాం. అప్పటి వరకు ఎన్నికలకు దూరంగా ఉన్నా ప్రజల కోసం పోరాడుతామని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చాకరు. నేను బ్రతికున్నంత వరకు నా సిద్దాంతాలు వీడను అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేసారు.

English summary
Pawan Kalyan speech about PRP Merger into Congress.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu