For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

‘‘నా శవాన్ని నలుగురు మోసే వరకు’’ అంటూ రోమాలు నిక్కబొడిచేలా పవన్ కళ్యాణ్ స్పీచ్!

|

ఓటములు నాకు కొత్తకాదు.. దెబ్బ తినేకొద్దీ ఎదిగే వ్యక్తినే తప్ప తగ్గే వ్యక్తిని కాదు. పాతిక సంవత్సరాల ముందు చూపుతో ఆలోచించి పార్టీ పెట్టాను. ఓటములు, దెబ్బలు ఎదురవుతాయని తెలుసు. పోటీ చేసి ఓడిపోతే తట్టుకోగలనా? అని ముందే ఆలోచించాను. దెబ్బలు తినడానికి, ఒడుదుడుకులు తట్టుకుని మీకు అండగా ఉండటానికి పార్టీ పెట్టాను... అంటూ పవన్ కళ్యాణ్ విజయవాడ రివ్యూ మీటింగులో రోమాలు నిబ్బబొడిచేలా ప్రసంగించారు. నేను దెబ్బ తింటాను నేను కానీ పైకి లెస్తాను. బలంగా గెలుస్తాను... అని స్పష్టం చేశారు.

పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని అసలు పాలిటిక్స్ లోకి రానీయకూడదు, అసెంబ్లీకి అడుగుపెట్టనీయకూడదు అనుకున్నారని, వారికి ఇదే నా సమాధానం అంటూ తనదైన శైలిలో ప్రసంగం దంచి కొట్టారు.

‘‘రాహువు పట్టిన పట్టు ఒక సెకండు అఖండమైనా లోక బాంధవుడు అసలే లేకుండా పోతాడా?

‘‘రాహువు పట్టిన పట్టు ఒక సెకండు అఖండమైనా లోక బాంధవుడు అసలే లేకుండా పోతాడా?

‘‘రాహువు పట్టిన పట్టు ఒక సెకండు అఖండమైనా లోక బాంధవుడు అసలే లేకుండా పోతాడా? మూర్ఖుడు గడియారంలో ముల్లు కదలనీయకుంటే ధరాగమనం అంతటితో తలక్రిందులు అయిపోతుందా? కుటిలాత్ముల కూటమి ఒక తృటి కాలం జయమొస్తే విశ్వ సృష్టి పరిణామం విచ్చిన్నం అవుతుందా?... అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.

నా శవాన్ని నలుగురు మోసే వరకు

నా శవాన్ని నలుగురు మోసే వరకు

ఒక ఓటమి జనసేనను ఆపలేదు. బలం తీసుకోండి రోడ్లమీదకు వెళ్లి అంటూ పవన్ కళ్యాణ్ పార్టీ కార్యకర్తలను ఉత్సాహపరిచారు. నా శవాన్ని నలుగురు మోసే వరకు జనసేనను ముందుకు తీసుకెళతాను. కసి కావాలి మనకు.. దెబ్బ తిందాం. ఈ రోజు ప్రజలు వైసీపీకి అండగా నిలబడ్డారు. దాన్ని నేను గౌరవిస్తున్నాను. వారి పరిపాలన ఎలా ఉంటుందో చూద్దాం. ఎక్కడ సమస్య ఉందో, ఎక్కడ ఆకలి ఉందో, ఎక్కడ అవినీతి ఉందో అక్కడ ప్రతి ఒక్కరికి జనసేన గుర్తుకు రావాలని.... పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.

నా జీవితం రాజకీయాలే... అది మరిచిపోకండి

నా జీవితం రాజకీయాలే... అది మరిచిపోకండి

‘‘ఎవడు మనవాడు, ఎవడు బయటి వాడు అనేది గెలుపులో మనకు తెలియదు. ఓటమి చెబుతుంది నువ్వు నావాడివా బయటి వాడివా అని... నా జీవితం రాజకీయాలే... అది మరిచిపోకండి'' అంటూ తాను సినిమాల్లో రావడం లేదంటూ పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

నేను ఓటమిని అంగీకరించే వ్యక్తిని కాదు

నేను ఓటమిని అంగీకరించే వ్యక్తిని కాదు

నేను ఓటమిని అంగీకరించే వ్యక్తిని కాదు... ఓటమిని జయించే వరకు పోరాడే వ్యక్తిని. నేను నిజంగా కుయుక్తి రాజకీయాలు చేయాలంటే అది నాకు రాక కాదు, చేయక కాదు... అది సరైంది కాదు కాబట్టి చేయడం లేదు. రాజకీయాలు చాలా కష్టమైన ప్రయాణం అని తెలిసే వచ్చాను. మనల్ని అవమానిస్తారు, వెటకారం చేస్తారు, అన్నింటికీ సిద్ధపడే వచ్చాను. ఒక అందమైన శిల్పం తయారు కావాలంటే ఉలిదెబ్బలు తినాల్సిందే. అలా దెబ్బలు తిన్నపుడే మనలోని అందమైన శిల్పం బయటకు వస్తుంది. దెబ్బ తిందాం.. దెబ్బ తింటే తప్ప మనలోని శక్తి బయటకు రాదు. నేను మీకు ఉన్నాను. మీకు చేయాల్సింది ఏమీ లేదు. నన్న నమ్మండి అంతే.... అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.

English summary
Pawan kalyan Speech After Failure In 2019 Elections. During the 2019 elections, Jana Sena contested together with left parties and Bahujan Samaj Party in both Telugu states. Jana Sena party chief Pawan Kalyan contested from two seats - Gajuwaka and Bhimavaram in the 2019 Andhra Pradesh Legislative Assembly election. The party chief lost both the seats.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more