»   »  మొదలైపోయింది : పవన్ 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' టీషర్ట్స్

మొదలైపోయింది : పవన్ 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' టీషర్ట్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : గబ్బర్‌ సింగ్‌ మళ్లీ వస్తూ...తన తిక్కేంటో.. లెక్కేంటో చూపించడానికి రెడీ అవుతున్నాడు. పవన్‌ కల్యాణ్‌ హీరోగా నటిస్తున్న చిత్రం 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌'. బాబీ దర్శకుడు. శరత్‌ మరార్‌ నిర్మాత. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శనివారం 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' ఫస్ట్ లుక్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అబిమానుల నుంచి ఈ ఫస్ట్ లుక్ కి ప్రశంసలు అందుతున్నాయి. అయితే మరో ప్రక్క ఈ క్రేజ్ ని క్యాష్ చేసుకోవటానికి కొందరు సిద్దమవుతున్నారు. ఈ చిత్రం పోస్టర్ కు చెందిన టీ షర్ట్స్ ని వదిలారు. ఫ్యాన్స్ వీటిని ఆదరిస్తారని భావిస్తున్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

 Pawan Kalyan T-Shirts in market

చిత్రం విషయానికి వస్తే..

నిర్మాత మాట్లాడుతూ ''ఈ సినిమా 'గబ్బర్‌సింగ్‌'కు సీక్వెలో ప్రీక్వెలో కాదు. ఇదో కొత్త కథ. పవన్‌ చిత్ర కథనం విషయంలో జాగ్రత్తలు తీసుకొన్నారు. సినిమాలోని భావోద్వేగాన్ని ప్రతిఫలించేలా ఫస్ట్ లుక్ ను రూపొందించాం. దేవిశ్రీప్రసాద్‌ అందించిన బాణీలు ఆకర్షణగా నిలుస్తాయి''అన్నారు.

'గబ్బర్‌ సింగ్‌ 2' విషయంలో అన్ని జాగ్రత్తలూ పవన్ తీసుకుంటున్నారు. ఆయన తన 'గబ్బర్‌ సింగ్‌ 2' కోసం ఓ నూతన నటుడ్ని ప్రతినాయకుడిగా తెలుగు చిత్రసీమకు పరిచయం చేయబోతున్నారు. అతనే.. శరత్‌ కేల్కర్‌. ఈ మరాఠీ నటుడు 'గబ్బర్‌సింగ్‌ 2'తో ప్రతినాయకుడిగా అరంగేట్రం చేయబోతున్నాడు.

ప్రతినాయకుడి పాత్రకు ఎంతోమందిని పరిశీలించి, ఫొటో షూట్‌లు చేసి.. చివరికి పవన్‌ కేల్కర్‌ని ఎంచుకొన్నారట. ఇటీవల ఇతనిపై కొన్ని సన్నివేశాల్నీ తెరకెక్కించారు. కేల్కర్‌ నటన పట్ల పవన్‌ చాలా సంతృప్తితో ఉన్నారని తెలిసింది. కేల్కర్‌కి తెలుగురాదు. అయినా సరే... తెలుగు నేర్చుకొని, తన డైలాగులను తనేపలికాడట.

 Pawan Kalyan T-Shirts in market

కేల్కర్‌ గొంతులో గాంభీర్యం, వృత్తిపై అతనికున్న శ్రద్ధ పవన్‌కి బాగా నచ్చాయని చిత్రబృందం చెబుతోంది. ఇటీవల హైదరాబాద్ లో రెండో షెడ్యూలు నైట్ షూటింగ్ లతో మొదలైంది. బాబి దర్శకతం వహిస్తున్న ఈ చిత్రానికి శరత్‌మరార్‌ నిర్మాత.

నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, పవన్‌ కల్యాణ్‌ క్రియేటివ్‌ వర్క్స్‌, ఎరోస్‌ ఇంటర్నేషనల్‌ చిత్రాన్ని రూపొందిస్తున్నాయి. కళ: బ్రహ్మ కడలి, కూర్పు: గౌతంరాజు, పోరాటాలు: రామ్‌ లక్ష్మణ్‌, కెమెరా: జయనన్‌ విన్సెంట్‌.

English summary
Apparently, to the joy of Power Star Pawan Kalyan's fans, Sardaar Gabbar Singh's shooting is happening at a brisk pace without any long breaks and the film is gearing up to hit screens on 14 January during the Pongal race.
Please Wait while comments are loading...