పవన్ కళ్యాణ్ ఇంటిని ముట్టడిస్తామనీ హెచ్చరికలు...!
పవన్ కల్యాణ్ ని టైటిల్ వివాదాలు వెంటాడుతున్నట్టు కనిపిస్తోంది. ఆమధ్య 'కొమరం పులి' సినిమా విడుదల ముందు వివాదం చెలరేగి, టైటిల్ నుంచి 'కొమరం' అన్న పదాన్ని తొలగించేలా చేశారు. ఇప్పుడు మళ్లీ ఆయన తాజా చిత్రం 'తీన్ మార్' టైటిల్ కూడా అలాగే వివాదమైంది. 'తీన్ మార్' అన్నది తమ సంప్రదాయానికి, సంస్కృతికి సంబంధించిన పేరనీ, దీనిని టైటిల్ గా ఉపయోగించుకుంటే కుదరదనీ, 'తీన్ మార్' సంస్థ వ్యవస్థాపకుడు వరంగల్ రవి హెచ్చరించారు.
వారంలోగా టైటిల్ ని మార్చుకోవాలనీ, లేకుంటే వంద డప్పులతో వచ్చి పవన్ కల్యాణ్ ఇంటిని ముట్టడిస్తామనీ వరంగల్ రవి స్పష్టం చేశారు. వెంటనే టైటిల్ ని మార్చుకోవాలని, లేకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయనీ ఆయన నిర్మాతను హెచ్చరించారు. సోమవారం నాడే ఈ సినిమా ఆడియో ఫంక్షన్ జరిగిన సంగతి తెలిసిందే!.
pawan kalyan teen maar ravi jayant c paranji ganesh babu పవన్ కళ్యాణ్ తీన్ మార్ రవి జయంత్ సి ఫరాన్జీ గణేష్ బాబు


Click it and Unblock the Notifications