»   »  దేవుడుగా పవన్ కళ్యాణ్ ...పుకారా లేక నిజమా..?

దేవుడుగా పవన్ కళ్యాణ్ ...పుకారా లేక నిజమా..?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి దేవుడి పాత్రలో కనిపించనున్నాడంటూ మీడియా హోరెత్తిపోతోంది. డాలీ దర్శకత్వంలో ఓ మైగాడ్ రీమేక్ గా రూపొందిన గోపాల గోపాల సినిమాలో మోడ్రన్ కృష్ణుడిగా ఆకట్టుకున్న పవన్. ఈ సారి త్రివిక్రమ్ సినిమాలో దేవుడి పాత్రలో నటించనున్నాడని ఇప్పుడు అంతటా వినిపిస్తోంది.

అంతేకాదు ఈ సినిమాకు 'దేవుడే దిగివచ్చినా' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారని చెప్పుకుంటున్నారు. గతంలో ఖలేజా సినిమాలో మహేష్ బాబును దేవుడిగా చూపించిన త్రివిక్రమ్, ఈ సారి పవర్ స్టార్ ను అదే తరహాలో చూపించే అవకాశం ఉందంటున్నారు. అయితే ఈ వార్తలో ఎంతవరకూ నిజం ఉంది అంటే అలాంటిదేమీ లేదని, ఇది కేవలం మీడియా పుట్టించిన రూరమే అని సమాచారం.

Pawan Kalyan-Trivikram New Movie Title 'Devude Digi Vachina'

పవన్,త్రివిక్రమ్ కాంబినేషన్ కాంబినేషన్ ఉండవచ్చు కానీ ఇలా ఓ టైటిల్ అనుకోవటం, పవన్ అందులో దేముడుగా కనిపించటం వంటివన్నీ రూమర్సే అంటున్నారు పవన్ కు సన్నిహితంగా ఉండే సినీజనం.

అయితే .. ప్రస్తుతం డాలీ దర్శకత్వంలో సినిమా చేస్తున్న పవన్ డిసెంబర్ నుంచి త్రివిక్రమ్ సినిమా షూటింగ్ లో పాల్గొననున్నాడు. 'జల్సా, అత్తారింటికి దారేది' చిత్రాల తర్వాత పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కలయికలో ఈ చిత్రం రూపొందనుందనుంది. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్.రాధాకృష్ణ నిర్మించబోతున్నారు.

ప్రస్తుతం 'కడప కింగ్'గా పవన్ తెర మీదుకొచ్చేందుకు బిజీగా ఉన్నాడు. డాలీ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు చిత్రయూనిట్ ప్లాన్ చేస్తోంది. ఇదిలా ఉంటే పవన్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేలోపు వీలైనన్నీ సినిమాలు చేస్తానన్న సంగతి తెలిసిందే.

English summary
Pawan Kalyan is getting ready to team up with top director Trivikram Srinivas once again. The movie is all set to start rolling from November this year. Sources revealed that Pawan has been extremely satisfied with the story line narrated by Trivikram Srinivas and gave his nod.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu