»   » పవన్, త్రివిక్రమ్, నితిన్ కాంబినేషన్ సినిమా అబద్దం... కానీ "లవ్ ఈజ్ ఎండ్ లెస్"

పవన్, త్రివిక్రమ్, నితిన్ కాంబినేషన్ సినిమా అబద్దం... కానీ "లవ్ ఈజ్ ఎండ్ లెస్"

Posted By:
Subscribe to Filmibeat Telugu

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మూడు సినిమాలు చేస్తున్నాడు.. ప్రస్తుతం కాటమరాయుడు సినిమాతో బిజీగా ఉన్న పవన్ ఆ తర్వాత త్రివిక్రమ్ సినిమాను చేయనున్నాడు.. ఇప్పటికే సినిమా నటీనటులను ఎంపిక చేయడం పూర్తయ్యింది.. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత తమిళ్ దర్శకుడు నీసన్ తో ఓ సినిమా చేయనున్నాడు.. అందులో రకుల్ ప్రీత్ హీరోయిన్ కాగా, తమన్ సంగీతం అందిస్తున్నాడు.. అయితే ఇటీవలే పవన్ నిర్మాతగా కూడా మారాడు..

నితిన్ నటించబోయే ఓ చిత్రానికి పవన్ త్రివిక్రమ్ తో కలిసి ప్రోడ్యూసింగ్ చేస్తున్నాడు..ఈ సినిమాకి కథ .. మాటలను త్రివిక్రమ్ అందిస్తుండటం విశేషం. ఇటీవలే ఆ చిత్రం కూడా పూజ కార్యక్రమాలను జరుపుకుంది.. పాటల రచయిత కృష్ణచైతన్య .. ఈ సినిమాకు దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు..ఈ సినిమా ఎనౌన్స్ చేసిన దగ్గర నుంచి, టైటిల్ ఎలా ఉంటుందోననే ఆసక్తి అభిమానులందరిలోను వుంది. ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ - మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ మ‌ధ్య ఎంత సాన్నిహిత్యం ఉందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో ఇప్ప‌టికే జ‌ల్సా - అత్తారింటికి దారేది సినిమాలు వ‌చ్చి సూప‌ర్ హిట్ అయ్యాయి. ఇక వీరి కాంబోలో ఇప్పుడు ముచ్చ‌ట‌గా మూడో సినిమా కూడా తెర‌కెక్క‌నున్న సంగ‌తి తెలిసిందే.

Pawan Kalyan trivikram Producing LIE With Nithin

ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ ఇద్ద‌రు బెస్ట్ ఫ్రెండ్స్ క‌లిపి నితిన్ హీరోగా ఓ సినిమా నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే. పవన్- త్రివిక్రమ్ నిర్మాణంలో నితిన్ హీరోగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో రూపొందే సినిమాపై ఇండ‌స్ట్రీలో మంచి అంచ‌నాలు ఉన్నాయి. పాటల రచయిత కృష్ణచైతన్య .. ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ సినిమా ఎనౌన్స్ చేసిన దగ్గర నుంచి, టైటిల్ ఎలా ఉంటుందోననే ఆసక్తి అభిమానులందరిలోను వుంది. ఈ నేపథ్యంలో 'లై' (lie - లవ్ ఈజ్ ఎండ్ లెస్) అనే టైటిల్ ను నిర్మాతలు రిజిస్టర్ చేయించారు. దాంతో ఈ సినిమా టైటిల్ ఖరారైనట్టుగా చెప్పుకుంటున్నారు. త్వరలోనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు.

English summary
To be directed by lyricist turned filmmaker Krishna Chaitanya, this film is titled reportedly titled as 'LIE' with a caption 'Love is Endless'. Nithin's home production Shrest Movies are acting as co-producers to this feature.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X