»   »  పవన్‌ కల్యాణ్‌ 'బసంతి' ఆడియో(ఫోటోలు)

పవన్‌ కల్యాణ్‌ 'బసంతి' ఆడియో(ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : గౌతమ్, అలీషాబేగ్ హీరో హీరోయిన్లుగా స్టార్ట్ కెమెరా పిక్చర్స్ పతాకంపై చైతన్య దంతులూరి స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం 'బసంతి'. ప్రస్తుతం నిర్మాణానంతర పనులను జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించిన ఆడియోను ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో విడుదల చేసారు. సుప్రసిద్ధ సంగీత దర్శకుడు మణిశర్మ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూరుస్తున్నారు.

'బసంతి' సినిమా పాటల విడుదల కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. బ్రహ్మానందంపై అభిమానంతో ఆయన కుమారుడుని ఆశ్వీరదరించటానికి వచ్చారు. గౌతమ్ మంచి అభిరుచి ఉన్న హీరో అని ఆయన అన్నారు.

చైతన్య దంతులూరి మాట్లాడుతూ- ''మణిశర్మ స్వరపరిచిన సంగీతం ఓ ప్రధాన ఆకర్షణ. గీత రచయితలు కృష్ణ చైతన్య, శ్రీమణిల సాహిత్యం సంగీత ప్రియులను అలరిస్తుంది. చిత్ర విజయంపై మాకు ఎంతో నమ్మకముంది''అని తెలిపారు.

పవన్ మాట్లాడుతూ....

పవన్ మాట్లాడుతూ....

''బాణం' సినిమా చూశాను. చైతన్య దంతులూరి చాలా బాగా తీశాడు. ఇప్పుడు ఆయన నుంచి వస్తున్న ఈ సినిమా కూడా చక్కటి విజయం సాధించాలని ఆశిస్తున్నాను. గౌతమ్‌ అభిరుచి ఉన్న నటుడు. అతడికి అందరి దీవెనలు లభించాలి'' అన్నారు ‌.

ఆవిష్కరణ

ఆవిష్కరణ

పవన్ కళ్యాణ్ ఈ చిత్రం తొలి సీడీని ఆవిష్కరించి త్రివిక్రమ్‌కి అందించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్,పవన్ కళ్యాణ్ ప్రక్క ప్రక్కనే కూర్చుని మాట్లాడుకుంటూ పంక్షన్ లో సెంటరాఫ్ ఎట్రాక్షన్ గా మారారు.

దర్శకుడు త్రివిక్రమ్‌ మాట్లాడుతూ ....

దర్శకుడు త్రివిక్రమ్‌ మాట్లాడుతూ ....

''బ్రహ్మానందం మా కుటుంబ సభ్యుడులాంటివారు. ఈ పాటలు ముందే విన్నా. చాలా బాగున్నాయి. గౌతమ్‌కి ఈ సినిమా విజయాన్ని ఇవ్వాలి. చైతన్యకి ఇది చక్కటి సినిమాగా నిలవాలని ఆశిస్తున్నాను'' అన్నారు.

టి.సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ...

టి.సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ...

''బ్రహ్మానందం లేకపోతే సినిమా లేదు అనే పరిస్థితులు ప్రస్తుతమున్నాయి. ఎక్కడికీ పెద్దగా రాని పవన్‌ కల్యాణ్‌ని ఈ కార్యక్రమానికి తీసుకురావడంతోనే బ్రహ్మానందం సత్తా అర్థమవుతోంది. పవన్‌ పర్‌ఫెక్ట్‌ జెంటిల్‌మేన్‌. 25ఏళ్ల విద్యార్థిలా కనబడుతున్నారు'' అన్నారు

ప్రముఖ హాస్యనటుడు జానీ లీవర్‌ మాట్లాడుతూ....

ప్రముఖ హాస్యనటుడు జానీ లీవర్‌ మాట్లాడుతూ....

''బ్రహ్మానందంగారు అంటే నాకు చాలా గౌరవం. నేను హైదరాబాద్‌ ఎప్పుడొచ్చినా అతణ్ని కలుస్తాను. వినోదం పంచడంలో ఆయన ముందంజలో ఉంటారు. అన్ని రకాల హావభావాలు ఎలా వస్తాయా అని ఆలోచిస్తుంటాను. గౌతమ్‌కి ఈ సినిమా మంచి బ్రేక్‌ ఇవ్వాలని ఆశిస్తున్నాను'' అన్నారు.

హీరో విష్ణు మాట్లాడుతూ....

హీరో విష్ణు మాట్లాడుతూ....


''గౌతమ్‌ నాకు తమ్ముడు లాంటివాడు. నేను చాలా కథలు వింటుంటాను. అందులో కొన్నింటిని చేయమని గౌతమ్‌కి చెప్పాను. నాకేదైతే నచ్చుతుందో అదే చేస్తాను అనేవాడు. దానికోసం ఎంతకాలమైనా ఆగుతాను అనేవాడు. ఇంత కాలానికి గౌతమ్‌కి మంచి కథ దొరికింది. బాణం స్థాయిలో ఈ సినిమా ఆడాలి'' అన్నారు.

దర్శకుడు శేఖర్‌ కమ్ముల మాట్లాడుతూ...

దర్శకుడు శేఖర్‌ కమ్ముల మాట్లాడుతూ...

''బాణం'లో ఓ నిజం ఉంది. ఈ సినిమా కూడా అదే స్థాయిలో ఉంటుందనుకుంటున్నా. మణిశర్మ పాటలు అంటే నాకు చాలా ఇష్టం. 'నాలో నేనే..' అనే పాట నాకు చాలా ఇష్టం. చైతన్య లాంటి దర్శకుడు దొరకడం గౌతమ్‌ అదృష్టం'' అన్నారు.

హీరో సునీల్‌ మాట్లాడుతూ....

హీరో సునీల్‌ మాట్లాడుతూ....

''గౌతమ్‌ ప్రవర్తన నాకు బాగా నచ్చుతుంది. పరిశ్రమలో కష్టపడినవాళ్లే మిగిలారు. గౌతమ్‌ కూడా తనకంటూ ఓ స్థానాన్ని సంపాదిస్తాడు. బ్రహ్మానందం నన్ను బాగా ప్రోత్సహించేవారు. నన్ను ఒక కొడుకులా చూసుకునేవారు. ఆయన కొడుకు బాగోగులు దేవుడు చూసుకుంటాడు'' అన్నారు.

బ్రహ్మానందం మాట్లాడుతూ....

బ్రహ్మానందం మాట్లాడుతూ....

''నేను అడిగిన వెంటనే చిరంజీవి, మహేష్‌బాబు, రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌, రాజమౌళి, ప్రభాస్‌... ఇలా చాలా మంది సినిమా గురించి మాట్లాడారు. పాటల విడుదల కార్యక్రమాలకు ఎక్కువగా హాజరు కాని పవన్‌ కల్యాణ్‌ ఈ కార్యక్రమానికి వచ్చారు. వారందరికీ శిరస్సు వంచి నా నమస్కారాలు తెలియజేస్తున్నా.

బ్రహ్మానందం కంటిన్యూ చేస్తూ...

బ్రహ్మానందం కంటిన్యూ చేస్తూ...


చైతన్య దంతులూరి నాకో లైన్‌గా కథ చెప్పాడు. తన మీద నమ్మకంతో ఒప్పుకొన్నా. అందరూ వారి సినిమాల్లో నన్ను పెట్టుకుందాం అనుకుంటున్నారు మరి నన్ను ఎందుకు పెట్టుకోవు అని చైతన్యని అడిగాను. ''మీరుంటే బ్రహ్మానందం కొడుకుగానే గౌతమ్‌ కనిపిస్తాడు. గౌతమ్‌ని గౌతమ్‌గానే చూపించాలని మిమ్మల్ని తీసుకోలేదు'' అని చెప్పాడు. ఆ మాట నాకు నచ్చింది. ఈ సినిమా చూడండి.. ఆదరించండి. కానీ ఒక్కమాట. ఈ సినిమా బాగుంటేనే చూడండి. లేకపోతే వద్దు. నా కొడుకు సినిమా అని చూడొద్దు. ఎందుకంటే కచ్చితంగా సినిమా బాగుంటుంది అనే నమ్మకం ఉంది'' అన్నారు.

గౌతమ్‌ మాట్లాడుతూ....

గౌతమ్‌ మాట్లాడుతూ....

''పవన్‌ నాకు స్పూర్తి ఆయన ఈ కార్యక్రమానికి రావడం ఆనందంగా ఉంది'' అన్నారు.

ఎవరెవరు...

ఎవరెవరు...

ఈ కార్యక్రమంలో కె.ఎల్‌.దామోదర ప్రసాద్‌, భీమనేని శ్రీనివాసరావు, మణిశర్మ, వీరూ పోట్ల, దేవా కట్టా, కృష్ణ భగవాన్‌ తదితరులు పాల్గొన్నారు.

English summary
Pawan Kalyan was the chief guest for the audio launch of Basanthi. Power Star unveiled the audio albums at an event held at Park Hyatt Hotel on Sunday evening (February 9, 2014). Bollywood comedian Johnny Lever was also special guest.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu