Just In
- 1 hr ago
హాలీవుడ్ చిత్రం గాడ్జిల్లా vs కాంగ్ ట్రైలర్ విడుదల: తెలుగుతో పాటు ఆ భాషల్లో కూడా వదిలారు
- 2 hrs ago
మహేశ్ బాబు పేరిట ప్రపంచ రికార్డు: సినిమాకు ముందే సంచలనం.. చలనచిత్ర చరిత్రలోనే తొలిసారి ఇలా!
- 3 hrs ago
ఘనంగా హీరో వరుణ్ వివాహం: సీసీ కెమెరాలు తీసేసి మరీ రహస్యంగా.. ఆయన మాత్రమే వచ్చాడు!
- 3 hrs ago
శ్రీరాముడిపై మోనాల్ గజ్జర్ అనుచిత వ్యాఖ్యలు: అందుకే అలాంటోడిని చేసుకోనంటూ షాకింగ్‌గా!
Don't Miss!
- Sports
IPL 2021: రాజస్థాన్ రాయల్స్ జట్టులోకి కుమార సంగక్కర!
- News
దేశంలో నిరాటంకంగా ఎన్నికలు- త్వరలో రాజస్ధాన్, గుజరాత్లో- ఏపీలోనే విచిత్ర పరిస్ధితి
- Lifestyle
జుట్టు పెరగడానికి నూనె మాత్రమే సరిపోదు, ఇక్కడ మోకాలి పొడవు జుట్టు యొక్క రహస్యం ఉంది
- Finance
Budget 2021: హెల్త్ బడ్జెట్ డబుల్! నిర్మలమ్మ 'ప్రధానమంత్రి హెల్త్‌ఫండ్?'
- Automobiles
ఘన విజయం సాధించిన ఇండియన్ క్రికెట్ టీమ్‌కి ఆనంద్ మహీంద్రా స్పెషల్ గిఫ్ట్.. ఏంటో తెలుసా..!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఇక పవన్ ఫ్యాన్స్‌కు పండుగే.. వకీల్ సాబ్ టీజర్‌పై ప్రకటన.. రికార్డు మోత మోగాల్సిందే!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే అప్డేట్ వచ్చింది. సంక్రాంతికి అసలు సిసలైన పండుగ వచ్చేస్తోంది. తాజాగా వకీల్ సాబ్‌కు సంబంధించిన టీజర్ అప్డేట్ వచ్చింది. ఇక ఈ అప్డేట్తో పవన్ ఫ్యాన్స్‌లో ఉత్సాహాం రెట్టింపై అయింది. మామూలుగానే గత కొన్ని రోజులుగా వకీల్ సాబ్ టీజర్‌పై చర్చలు జరుగుతూనే వస్తున్నాయి. ఎట్టకేలకు దానికి ఓ సరైన సుముహూర్తం కుదిరింది.

వకీల్ సాబ్ షూటింగ్ పూర్తి..
వకీల్ సాబ్ షూటింగ్ ఇటీవలె పూర్తయిన సంగతి తెలిసిందే. చివరి రోజున పవన్ కళ్యాణ్ తన యూనిట్ సభ్యులతో కలిసి ముచ్చటించాడు. వకీల్ సాబ్ చిత్రయూనిట్‌తో కలిసి సందడి చేస్తూ ఫోటోలకు పోజులిచ్చాడు. ఇక షూటింగ్ పూర్తవ్వడంతో సినిమా విడుదలపై అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

లీకుల బెడద..
వకీల్ సాబ్‌కు మొదటి నుంచి కూడా లీకుల బెడద ఎక్కువైంది. పవన్ కళ్యాణ్ అడుగుపెట్టిన మొదటి రోజే లీకులు కూడా మొదలయ్యాయి. ఇక అప్పటి నుంచి వకీల్ సాబ్ షూటింగ్ జరుగుతున్న లొకేషన్ల నుంచి ఏదో ఒక ఫోటో బయటకు వస్తూనే ఉంది. ఏకంగా యాక్షన్ సీక్వెన్స్, భారీ డైలాగ్‌ల సీన్ కూడా లీకైంది.

స్పెషల్ పోస్టర్లతో రచ్చ..
ఇప్పటికే వకీల్ సాబ్ పాటలు, పోస్టర్లతో నానా రచ్చ చేసింది. క్రిస్మస్ న్యూ ఇయర్ అంటూ స్పెషల్ పోస్టర్లతో హంగామా చేసింది. ఇక సంక్రాంతి పండుగ వంతు వచ్చింది. సంక్రాంతి పండుగ అంటే తెలుగు వారికి ఎంత స్పెషల్ అన్నది అందరికీ తెలిసిందే. ఆ స్పెషల్ పండుగను మరింత స్పెషల్ చేసేందుకు వకీల్ సాబ్ వస్తున్నాడు.

సంక్రాంతికి టీజర్..
సంక్రాంతి నాడు వకీల్ సాబ్ టీజర్ రాబోతోందని నిర్మాతలు ప్రకటించారు. జనవరి 14న సాయంత్రం ఆరు గంటల మూడు నిమిషాలకు టీజర్ విడుదల కాబోతోందని తెలిపాడు. ఈ మేరకు విడుదల చేసిన పోస్టర్ ఓ రేంజ్లో వైరల్ అవుతోంది.

రికార్డులపై కన్ను..
ఇక అసలే సోషల్ మీడియా రికార్డుల హంగామా ఉండటం లేదు. ఆ మధ్య టీజర్లు, హీరోల బర్త్ డేలు అంటూ పవన్ కళ్యాణ్, ప్రభాస్, మహేష్ బాబు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చచేశారు. ఇక ఇప్పుడు మళ్లీ వకీల్ సాబ్, రాధే శ్యామ్ టీజర్లతో మరోసారి రికార్డుల హోరు, పోరుతో సోషల్ మీడియా వేడెక్కేలా కనిపిస్తోంది.