Don't Miss!
- News
కొత్త సచివాలయాన్ని 17న ప్రారంభించనున్న కేసీఆర్: ఇద్దరు సీఎంలు, అంబేద్కర్ మనవడు
- Travel
రథసప్తమికి ముస్తాబవుతోన్న అరసవల్లి సూర్యదేవాలయం!
- Sports
INDvsNZ : ఉమ్రాన్ ఇన్.. నెంబర్ వన్ ర్యాంకు గురించి ఆలోచించడం లేదు: రోహిత్ శర్మ
- Automobiles
మూడు ముళ్ళతో ఒక్కటైన కొత్త జంట "కేఎల్ రాహుల్-అతియా శెట్టి" లగ్జరీ కార్లు.. ఇక్కడ చూడండి
- Lifestyle
దీర్ఘకాలిక వ్యాధి థైరాయిడ్ మరియు లక్షణాలను నయం చేయడానికి ఈ ఆహారాలు తీసుకోవడం ఉత్తమం
- Finance
Super Stock: అదరగొడుతున్న స్టాక్.. ఒకేసారి డివిడెండ్, బోనస్, స్టాక్ స్ప్లిట్.. మీ దర్గర ఉందా..?
- Technology
ఫిబ్రవరి లో లాంచ్ కానున్న టాప్ ప్రీమియం ఫోన్లు! టాప్ 10 ఫోన్ల లిస్ట్!
Pawan Kalyan: కొండగట్టులో 'వారాహి'కి ప్రత్యేక పూజలు.. అంజన్న సేవలో అంజనీ పుత్రుడు అంటూ!
పవన్ కల్యాణ్ సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లోనూ సైతం జోరు చూపిస్తున్నారు. ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు పాలిటిక్స్ లో చురుగ్గా పాల్గొంటున్నారు. ప్రజల సమస్యలపై కృషి చేస్తూ నాయకుడు అనిపించుకుంటున్నారు. ఇక ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్నట్లు చెప్పేలా ఎలక్షన్స్ క్యాంపెయిన్ కోసం ఒక ప్రత్యేక వాహనాన్ని సిద్ధం చేసిన విషయం తెలిసిందే. వారాహి పేరుతో ప్రత్యేక వాహనాన్ని సిద్ధం చేసిన పవన్ కల్యాణ్ తన పార్టీ తరఫున ప్రచారం నిర్వహించనున్నారు. ఈ వారాహి వాహనానికి ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ వివరాల్లోకి వెళి

కొండగట్టులో ప్రత్యేక పూజలు..
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికల సమరానికి సిద్ధమయ్యారు. ఏపీ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం కోసం ప్రత్యేకంగా వాహనాన్ని సిద్ధం చేయించిన విషయం తెలిసిందే. వారాహి పేరుతో రెడీ చేసిన ఈ వాహనం ట్రయల్ రన్ ను హైదరాబాద్ లో నిర్వహించారు. వాహనం పక్కనే భద్రతా సిబ్బంది అలా నడచివస్తున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఇక తాజాగా వారాహి వాహనానికి తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన కొండగట్టులో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవన్ కల్యాణ్ హైదరాబాద్ నుంచి సిద్ధిపేట, కరీంనగర్ మీదుగా కొండగట్టుకు చేరుకున్నారు.

స్వామివారి యంత్రం.. సింధూరంతో..
కొండగట్టులో పవన్ కల్యాణ్ కు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. పవన్ కల్యాణ్ పై అభిమానులు పూల వర్షం కురిపించారు. తర్వాత గజమాలతో సత్కరించారు. అనంతరం జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. స్వామి వారి దర్శనం తర్వాత పార్టీ ప్రచార రథం వారాహికి వేద పండితులు మంత్రోచ్ఛారణల మధ్య శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. వాహనానికి వేదపండితులు సంకల్పసిద్ధి చేయించారు. స్వామివారి యంత్రాని వారాహి వాహనానికి కట్టి, సింధూరంతో శ్రీరామదూత్ అని రాశారు. పూజల అనంతరం విఘ్నాలు తొలగిపోయేలా, విజయాలు సిద్ధించేలా గుమ్మడి కాయ కొట్టి వారాహిని ప్రారంభించారు.

ప్రత్యేక ఆకర్షణగా పవన్..
జనసేన ప్రచారం రథం వారాహి ప్రారంభం తర్వాత వేద పండితుల ఆశీర్వాదం అందుకున్నారు పవన్ కల్యాణ్. ప్రారంభ సూచకంగా వారాహి ఎక్కి వాహనాన్ని పరిశీలించారు. ఈ ప్రత్యేక పూజల్లో కాషాయ వస్త్రాలు ధరించి పవన్ కల్యాణ్ కనిపించారు. నుదుట సింధూరంతో ఉన్న పవన్ కల్యాణ్ వారాహి పూజలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అయితే కొండగట్టుకు ఇవాళ ఉదయం 7 గంటలకే హైదరాబాద్ నుంచి బయలుదేరారు పవన్ కల్యాణ్. హకీంపేట వద్ద కొద్దిసేపు ట్రాఫిక్ లో చిక్కుకున్న అనంతరం కొండగట్టుకు చేరుకున్నారు. జనసేన నేతలు భారీ కాన్వాయ్ తో ఆయన వెంట వెళ్లారు.

కొండగట్టులో అంజనీ పుత్రుడు..
పవన్ కల్యాణ్ కోసం కొండగట్టుకు పెద్ద సంఖ్యలో అభిమానులు తరలి వచ్చారు. వారందరికి అభివాదం చేస్తూ అంజన్న ఆలయానికి వెళ్లారు పవన్ కల్యాణ్. ప్రస్తుతం పవన్ కల్యాణ్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొండగట్టు అంజన్న సేవలో అంజనీ పుత్రుడు పవన్ కల్యాణ్ అంటూ వీడియోలు, ఫొటోలు షేర్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే కోడిమ్యాల మండల పరిధిలోని రిసార్ట్ లో తెలంగాణ జనసేన 32 నియోజకవర్గ కార్యనిర్వాహక సభ్యులతో సమావేశానికి హాజరు కానున్నారు పవన్ కల్యాణ్. అనంతరం సాయంత్రం 3.30 నిమిషాలకు ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.

రాత్రికి హైదరాబాద్ కు..
ధర్మపురి నుంచి అనుష్టుస్ నారసింగ యాత్రగా 32 క్షేత్రాల సందర్శన యాత్ర ప్రారంభించనున్నారు పవన్ కల్యాణ్. ఇక, సాయంత్రం 5.30 నిమిషాలకు తిరిగి హైదరాబాద్ కు ప్రయాణమై రాత్రికి చేరుకుంటారని సమాచారం. పవన్ కల్యాణ్ పర్యటన దృష్ట్యా, అభిమానులు పెద్ద ఎత్తున తరలి వస్తున్న నేపథ్యంలో భారీ బందోబస్తును పోలీసులు ఏర్పాటు చేశారు.