»   » నా రాతలని మొదటగా చదివేది పవన్ కళ్యాణ్: రేణూ దేశాయ్ ఇలా చెప్పింది

నా రాతలని మొదటగా చదివేది పవన్ కళ్యాణ్: రేణూ దేశాయ్ ఇలా చెప్పింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

పవన్‌కల్యాణ్‌ మాజీ భార్య రేణు దేశాయ్ మరోసారి తన వ్యక్తిగత వార్తలతో తెరపైకి వచ్చింది . తాను రాసిన కవితలను, షార్ట్ స్టోరీస్ ను పవన్ కల్యాణ్ చదివి, తన అభిప్రాయం వ్యక్తం చేసేవారని, ప్రోత్సహించేవారని ఓ మీడియా ఛానల్ తో చెప్పింది. చిన్నప్పటి నుంచీ తనకు కవితలు రాసే అలవాటు ఉందని, అయితే గత కొంతకాలం నుంచి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నానని... తాజా ఇంటర్వ్యూలో ఆమె పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది.

పవన్ కల్యాణ్ ఫస్ట్ రీడర్

పవన్ కల్యాణ్ ఫస్ట్ రీడర్

తాను రాసిన షార్ట్ స్టోరీస్, కవితలకు మాజీ భర్త పవన్ కల్యాణ్ ఫస్ట్ రీడర్ అని., ప్రతి రైటర్‌కు తొలి పాఠకుడు అంటూ ఎవరూ ఉండరు. అయితే పవన్ మాత్రం నా పనిని ఇష్టపడటంతో పాటు ఎంతగానే ప్రొత్సహించేవాడనీ చెప్పింది. మొదట్లో సోషల్ మీడియాలో తనకు ఖాతాలు లేకపోవడంతో తన కవితలు, షార్ట్ స్టోరీస్ ను పోస్ట్ చేయలేకపోయానని.,

Renu Desai Tweets, I Don't want my Son to be A Jr.Power Star Pawan Kalyan
 తీవ్ర అనారోగ్యానికి గురైనప్పుడు

తీవ్ర అనారోగ్యానికి గురైనప్పుడు

అయితే, మూవీ బిజినెస్ ప్రారంభించాక తన పీఆర్ టీమ్ సోషల్ మీడియాలో అకౌంట్ ప్రారంభించడంతో 2014 నుంచి వాటిని పోస్ట్ చేస్తున్నట్లు., 2015లో తాను తీవ్ర అనారోగ్యానికి గురైనప్పుడు చాలా కవితలు రాశానని, నాలుగైదు డైరీలు వాటితో నిండిపోయాయని చెప్పింది.

కలం పేరు‘Ray Nu

కలం పేరు‘Ray Nu"

కొంత కాలానికి ఆ డైరీల్లో రాసుకున్న కవితలను ట్విట్టర్లో పోస్ట్ చేయడం ప్రారంభించాక. కొన్నింటికి చాలా మంచి కాంప్లిమెంట్స్ రావడం తనలో ఉత్సాహాన్ని రెట్టింపు చేసిందని' రేణు దేశాయ్ వివరించింది. ఆమె తన కలానికి ‘Ray Nu" అనే పేరు పెట్టుకుంది. రేణు దేశాయ్ కలం నుండి మరిన్ని అందమైన కవితలు జాలువారాలని ఆశిద్దాం..

 సినీ రచయిత్రిగా

సినీ రచయిత్రిగా

మోడల్‌గా కెరీర్ ఆరంభించిన రేణు దేశాయ్ తర్వాత టాలీవుడ్‌లో పవన్ సరసన నటించి రంగుల ప్రపంచానికి పరిచయమైన విషయం తెలిసిందే. అయితే తన మూవీలలో కాస్ట్యూమ్ డిజైనర్‌గా ఆమె పని చేశారు. కొన్నేళ్లు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఆమె.. ప్రస్తుతం మరాఠీ మూవీలతో బిజీగా ఉన్నారు. సెకండ్ ఇన్నింగ్స్‌లో రేణుదేశాయ్ దర్శకురాలిగా, నిర్మాతగానూ రాణించేందుకు కృషి చేస్తున్నారు. కవయిత్రిగా కంటే తనను తాను సినీ రచయిత్రిగా పరిచయం చేసుకునేందుకు ఇష్టపడతానని రేణు పేర్కొన్నారు.

రేణూ దేశాయ్ కవిత

రేణూ దేశాయ్ కవిత

రేణూ దేశాయ్ రాసిన కవితల్లో ఒకటి

"She is fire,

burning eternally...

Ashes became those who feigned affection.

She smoulders in wait for her Phoenix

To burn in her pyre

To douse her with his beauty

To rouse in her, his passion... "

English summary
Renu started posting beautiful poems through her Instagram account recently, She revealed that her writings were appreciated by Pawan Kalyan.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu