»   » ‘పులి’తో జోడి కట్టనున్న త్రిష!

‘పులి’తో జోడి కట్టనున్న త్రిష!

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ చిత్రం'కట్టా మీటా" తో బిజీగా ఉన్న త్రిష ఈ మధ్య తెలుగు, తమిళ చిత్రాలకు దూరంగా ఉంటోంది అయితే 'కృష్ణ" చిత్రంలో నటించేటప్పుడు దర్శకుడు వివి వినాయక్ తో ఉన్న పరిచయం రీత్యా ఆయన మాటను కాదనలేకపోయింది. తెలుగు చిత్రంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

వివి వినాయక్ కాంబినేషన్ లో రూపొందనున్న చిత్రంలో త్రిష హీరోయిన్ గా ఎంపికైందట! ఈ ఏడాది ఓ మంచి రొమాంటిక్ లవ్ స్టోరీని తీసిన ఓ భారీ నిర్మాత ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. వినాయక్ 'బద్రీనాథ్", జయంత్ సి పరాంజీ దర్శకత్వంలో 'లవ్ ఆజ్ కల్" రీమేక్ చిత్రంలో పవన్ నటిస్తున్నాడు ఈ చిత్రం పూర్తికాగానే, గీతా ఆర్ట్స్ బ్యానర్ లో డివివి దానయ్య నిర్మాణంలో వివి వినాయక్-పవన్ కాంబినేషన్ తెరపైకి రానుంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu