‘వకీల్ సాబ్’ క్లైమాక్స్ ఫైట్ లీక్: సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రముఖ నటుడు

తెలుగు సినీ ఇండస్ట్రీలోనే అత్యంత ప్రభావవంతుడైన హీరోల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఒకరు. మెగా ఫ్యామిలీ నుంచి సినిమాల్లోకి ప్రవేశించినప్పటికీ.. ఎంతో కష్టంతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారాయన. ఈ క్రమంలోనే తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగారు. సినిమాల్లో సూపర్ సక్సెస్ అయిన ఆయన.. ప్రజాసేవ చేయాలనే లక్ష్యంతో రాజకీయాల్లోకీ ప్రవేశించారు. ఇక, సుదీర్ఘ విరామం తర్వాత పవన్ కల్యాణ్ 'వకీల్ సాబ్' అనే సినిమాతో రీఎంట్రీ ఇస్తున్నారు. తాజాగా ఈ సినిమాలోని ఫైట్ సీన్‌కు సంబంధించిన పిక్స్ బయటకు వచ్చాయి.

చాలా గ్యాప్ తర్వాత పవన్ కల్యాణ్ నటిస్తున్న చిత్రం 'వకీల్ సాబ్'. వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను దిల్ రాజుతో కలిసి బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఎప్పుడో షూటింగ్ మొదలైనప్పటికీ అనివార్య కారణాల వల్ల పలుమార్లు ఆటంకం ఏర్పడింది.

Pawan Kalyans Vakeel Saab Fight Scene Pic Leaked

ఇక, ఇటీవలే చివరి షెడ్యూల్‌తో షూటింగ్ పూర్తయింది. ఈ నేపథ్యంలో సినిమాలోని క్లైమాక్స్ ఫైట్‌కు సంబంధించిన ఫొటోలను ప్రముఖ నటుడు దేవ్ గిల్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశాడు. దీంతో ఇవి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. అసలు ఆయన కావాలనే లీక్ చేశాడా? లేక మరేదైనా కారణముందా? అనేది తెలియలేదు.

Pawan Kalyans Vakeel Saab Fight Scene Pic Leaked

ఇదిలా ఉండగా, ఈ సినిమాలో వ్యభిచార గృహాల్లో చిక్కుకున్న యువతులను రక్షించే లాయర్ పాత్రను పోషిస్తున్నాడు పవర్ స్టార్. ఈ సినిమా కోసం మొత్తం మూడు గెటప్‌లలో అతడు కనిపిస్తాడని అంటున్నారు. అలాగే, ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్‌గా చేస్తుండగా... నివేదా థామస్, అంజలి, అనన్య కీలక పాత్రలను పోషిస్తున్నారు. 'వకీల్ సాబ్'ను ఏప్రిల్ 9న విడుదల చేయబోతున్నారని తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. ఇందుకోసం వీలైనంత త్వరగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభించాలని చిత్ర యూనిట్ భావిస్తోందని తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X