»   » పవన్స్ ‘పులి’ భాగ్యనగర సంచారం!

పవన్స్ ‘పులి’ భాగ్యనగర సంచారం!

Posted By:
Subscribe to Filmibeat Telugu

పవన్‌ కళ్యాణ్‌ హీరోగా ఎస్‌ జె సూర్య దర్శకత్వంలో క్రేజీ ప్రోజెక్ట్‌గా రూపొందుతున్న 'కొమరం పులి" చిత్రం ప్రస్తుతం హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో షూటింగ్‌ జరుపుకుంటోంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన 'ఖుషి" చిత్రం పెద్ద హిట్‌ కావడంతో ఇపుడు ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి. అంతే కాకుండా ఈ చిత్రానికి పనిచేస్తున్న కెమెరామెన్‌ బినోద్‌ ప్రధాన్‌ ఎన్నో విజయవంతమైన బాలీవుడ్‌ చిత్రాలకు పనిచేసిన వ్యక్తి కావడంతో 'కొమరం పులి"ని తెరపై ఆవిష్కరంచడంతో తన విజువల్‌ మాయాజాలంతో తెలుగు ప్రేక్షకులకు కనువిందు చేయబోతున్నారు. ఈ చిత్రానికి సంగీతాన్నందిస్తున్న ఎఆర్‌ రెహమాన్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. కనకరత్న మూవీస్‌ బ్యానర్‌పై శింగనమల రమేష్‌ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రంలో పవన్‌ సరసన నిఖిషాపటేల్‌ హీరోయిన్‌గా ప్రదాన పాత్రలో సూపరింటెండ్ ఆఫ్ పోలీస్ గా నటిస్తోంది.

ఓ సంచలన సోయగం శ్రియ ఈ చిత్రంలో ఓ స్పెషల్‌ సాంగ్‌లో నర్తిస్తుండటం ఈచిత్రానికి మరో ప్రధాన ఆకర్షణగా చెప్పవచ్చు. ఇప్పటికే ఈచ్రితం టాకీ పార్ట్‌ ముంబాయి, చెన్నైయ్, యుఎస్‌ఎ తదితర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకుంది. ఇపుడు ఇండోర్‌కు సంబంధించిన సన్నివేశాలను హైదరాబాద్‌లో జరుపుకుంటోంది. హైదరాబాద్‌లో ఈ షెడ్యూల్‌ పూర్తవ్వగానే పాటల చిత్రీకరణ పూర్తి చేయనున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో మరో హైలైట్ ఫైట్ 41 మంది ఫైటర్స్ తో అల్యూమినియం ఫ్యాక్టరి లో చాలా చక్కగా రోఫ్ షాట్ టెక్నాలజీతో రూపుదిద్దుకొందని సినిమా వర్గాల సమాచారం. ఇతర పాత్రల్లో మనోజో బాజ్ పాయ్, చరణ్ రాజ్, నాజర్, జ్యోతి క్రిష్ణ, శరణ్య, బ్రహ్మా జీ, కోవై సరళ, ఆలీ, విహెచ్ హానీఫా మరియు గిరీష్ ఖర్నాడ్ నటించనున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X