»   » తెలంగాణా స్టూడెంట్ గా పవన్ కళ్యాణ్ ‘తీన్ మార్’

తెలంగాణా స్టూడెంట్ గా పవన్ కళ్యాణ్ ‘తీన్ మార్’

Posted By:
Subscribe to Filmibeat Telugu

పవన్ కల్యాణ్ హీరోగా హాస్యనటుడు గణేష్ బాబు నిర్మిస్తున్న 'తీన్ మార్' సినిమాకు సంబంధించిన క్లైమాక్స్ దృశ్యాలను కర్నాటకలోని మైసూర్ పరిసర ప్రాంతాలలో చిత్రీకరించారు. పవన్ కళ్యాణ్, త్రిష జంటగా జయంత్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'తీన్ మార్". ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ తెలంగాణా విద్యార్థిగా నటిస్తున్నాడట. ప్లాష్ బ్యాక్ లో వచ్చే ఎపిసోడ్ లోనే పవన్ కళ్యాణ్ ఈ పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ పాత్ర పక్కా మాస్ గా ఉంటుందట. ఖచ్చితంగా ఈ పాత్ర ఇటు తెలంగాణా ప్రాంతంలోని వారితో పాటు మిగతా ప్రాంతాల వారికి కూడా నచ్చే విధంగా ఉంటుందని తెలుస్తోంది. మార్చి 5న ఈ సినిమా ఆడియోను విడుదల చేసి ఏప్రిల్ 15న సినిమాని విడుదల చేయానుకుంటున్నారు.

English summary
Pawan Kalyan will be shown as a Telangana student in the film ‘Teen Maar’. This will surely come as a happy news to all 'T' activists. Jayanth C Paranje is the director. The film is fast nearing completion. The audio of the film will be released on March 5 and the film is being planned for release on April 15.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu