»   » పవన్ కళ్యాణ్ పొంగల్ ట్రీట్

పవన్ కళ్యాణ్ పొంగల్ ట్రీట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఎస్ జె సూర్య దర్వకత్వంలో పవన్ కళ్యాణ్, నిఖీషా పటేల్ జంటగా రూపొందుతున్న చిత్రం 'పులి' చాలా లేటవుతోంది అని బాధ పడుతోన్న పవన్ అభిమానులకి శుభవార్త. 'పులి" ఆగమనం ఆలస్యమైనా పవన్ తదుపరి చిత్రం మాత్రం లేట్ కాదని సమాచారం. హిందీలో సైఫ్ ఆలీ ఖాన్, దీపిక పదుకొనే నటించి మంచి విజయాన్ని అందించిన చిత్రం 'లవ్ ఆజ్ కల్" రీమేక్ వచ్చే సంక్రాంతికి ఖచ్చితంగా రెడీ అయిపోతుందని తెలుస్తోంది. సింపుల్ లవ్ స్టోరి కావడంతో ఈ సినిమాలో ఇతరత్రా హంగామా పెద్దగా ఉండదు కనుక షూటింగ్ స్పీడుగా జరిగిపోతుందట. ఒక్కసారి పెట్స్ మీదరకు వెళితే ఏకధాటిగా సినిమాను పూర్తి చేసేస్తారట. మే నెలలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి నవంబర్ కల్లా షూటింగ్ పార్ట్ ముగించి పొంగల్ కి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట. సో వచ్చే ఏడాది పవన్ అభిమానులకి పవన్ సినిమాతో మొదలు కానుందన్నమాట.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu