»   » పవన్ మాత్రమే కాదు త్రివిక్రమ్ కూడా కంప్లైంట్

పవన్ మాత్రమే కాదు త్రివిక్రమ్ కూడా కంప్లైంట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఎవరూ ఊహించని విధంగా నాన్నకు ప్రేమతో నిర్మాతపై పవన్ కళ్యాణ్ కంప్లైంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ తొలిసారిగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా)ను సంప్రదించి ఫిర్యాదు చేసారు. ఇప్పుడు త్రివిక్రమ్ కూడా అదే నిర్మాతపై తన బకాయిల విషయమై కంప్లైంట్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఇదే నిర్మాతతో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ గతంలో ‘అత్తారింటికి దారేది' చిత్రం చేసారు. ఈ సినిమా రెమ్యూనరేషన్ విషయంలో ఏర్పడ్డ వివాదమే ఇందుకు కారణమని తెలుస్తోంది. నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ తనకు ఇవ్వాల్సిన రెండు కోట్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని పవన్ కళ్యాణ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే ఎంత అనేది తెలియదు కానీ త్రివిక్రమ్ కూడా కంప్లైంట్ చేసారని అంటున్నారు.

pawan ’s complaint in MAA

ప్రముఖ నిర్మాత బి.వి.యస్‌.ఎన్‌ ప్రసాద్‌పై నటుడు పవన్‌ కల్యాణ్‌ ‘మా'కు ఫిర్యాదు చేశారు. ‘అత్తారింటికి దారేది' చిత్రం రెమ్యునరేషన్‌కు సంబంధించి తనకు ఇవ్వాల్సిన బకాయి చెల్లించలేదని పవన్‌ కల్యాణ్‌ ఫిర్యాదులో పేర్కొన్నారు.

‘అత్తారింటికి దారేది' చిత్రం రెమ్యునరేషన్‌లో కొంతభాగం మాత్రమే చెల్లించారని, మిగిలినది ‘నాన్నకు ప్రేమతో' చిత్రం విడుదల సమయంలో ఇస్తానని ప్రసాద్‌ తనకు తెలిపారని ఫిర్యాదులో పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నట్లు తెలుస్తోంది. అయితే బి.వి.యస్‌.ఎన్‌ ప్రసాద్‌ ప్రస్తుతం ఆ మిగిలిన బకాయి చెల్లించకపోవడంతో పవన్‌కల్యాణ్‌ ‘మా'ను ఆశ్రయించినట్లు సమాచారం.

English summary
Reports now that Director Trivikram‬ also made a formal complaint regarding his ‎AttarintikiDaaredi‬ Dues Too against the producer BVVSN Prasad of Ntr and Rakul starrer "Nannaku Prematho" movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu