»   »  కోడి పుంజుతో కాటమరాయుడు, పవన్ ఈ పోస్టర్ వదిలి...

కోడి పుంజుతో కాటమరాయుడు, పవన్ ఈ పోస్టర్ వదిలి...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: పవన్‌కల్యాణ్‌, శ్రుతిహాసన్‌ జంటగా నటిస్తున్న చిత్రం కాటమరాయుడు. నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై శరత్‌మరార్‌ నిర్మిస్తున్నారు. కిశోర్‌ పార్థసాని (డాలీ) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి విడుదల చేసిన పవన్‌ పోస్టర్లు ఇప్పటికే సందడి చేస్తున్నాయి. తాజాగా సంక్రాంతిని పురస్కరించుకుని డిజిటల్‌ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్.

సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ విడుదలైన ఈ పోస్టర్‌లో కోడిపుంజు పట్టుకుని, పంచెకట్టుతో దర్శనమిచ్చారు పవన్‌. ఇప్పటికే శరవేగంగా షూటింగ్‌ జరుపుకొంటున్న ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను ఈ నెల 26న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.

Pawan's Katamarayudu - Sankranthi Special teaser

నిర్మాత మాట్లాడుతూ ''సామాజిక మాధ్యమాల్లో వినూత్న రీతిలో చేసిన 'కాటమరాయుడు' ప్రచారం అభిమానుల్లో హుషారు పుట్టించింది. ఈ సందర్భంగా ప్రేక్షకులకి సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతున్నాం. ఈ నెల 16 నుంచి ఏకధాటిగా జరిగే షెడ్యూల్‌తో ఈ సినిమా పూర్తవుతుంది. మా సినిమా తొలి టీజర్‌ని ఈ నెల 26న విడుదల చేస్తున్నాం. . మార్చి 29న 'ఉగాది'కి విడుదల చేస్తున్నాం'' అని చెప్పారు.

చిత్రం లోని ఇతర ప్రధాన పాత్రలలో ఆలీ, నాజర్, రావు రమేష్, అజయ్, నర్రా శ్రీను, పృథ్వి, శివబాలాజీ, కమల్ కామరాజు, చైతన్య కృష్ణ, తరుణ్ అరోరా, ప్రదీప్ రావత్, పవిత్ర లోకేష్, రజిత, యామిని భాస్కర్, అస్మిత, రమాదేవి, భానుశ్రీ నటిస్తున్నారు. నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకం పై నిర్మిత మవుతున్న ఈ కాటమరాయుడు చిత్రానికి సంగీతం అనూప్ రూబెన్స్, ప్రసాద్ మూరెళ్ళ కెమెరా మన్ గా వర్క్ చేస్తున్నారు. నిర్మాత: శరత్ మరార్ దర్శకత్వం: కిషోర్ పార్ధసాని

English summary
Pawan Kalayan’s most anticipated film Katamarayudu will be hitting the screens in March. Now a special Sankranthi poster has been unveiled.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu