»   » ఈ వీడియో చూస్తే పవన్ సినిమాకు పరుగెత్తుకెళతారు

ఈ వీడియో చూస్తే పవన్ సినిమాకు పరుగెత్తుకెళతారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: పవన్ కళ్యాణ్ తాజా చిత్రం 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌'. ఈ చిత్రం ఏప్రియల్ 8న రిలీజ్ కు డేటిచ్చారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతూండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టారు. అందులో భాగంగా మేకింగ్ వీడియోని విడుదల చేసారు.


ఈ వీడియోను చూస్తే తప్పకుండా సినిమా చూడాలనిపిస్తుంది. ఈ చిత్రంలో పవన్‌ కల్యాణ్‌ సరసన కాజల్‌ నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం సమకూరుస్తున్నారు.


పవన్ కళ్యాణ్ కేవలం నటుడుగానే కాకుండా కధ, స్క్రీన్ నుంచీ అన్నీ దగ్గరుండి చూసుకోవడంతో ఈ సినిమా షూటింగ్ కొంచెం ఆలస్యమవుతోంది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశల్లో ఉన్న ఈ సినిమా ఆడియో గురించి గత కొద్ది రోజులుగా రకరకాల వార్తలు షికార్లు చేసాయి. అయితే వాటన్నిటిని ఈ చిత్ర నిర్మాత అయిన శరత్ మరార్ తోసిపుచ్చాడు.


"టీం అందరూ ఈ సినిమాను బ్లాక్ బస్టర్ చేయడానికి కృషి చేస్తున్నారు. వచ్చే వారాంతమే సర్దార్ ఆడియో ఉంటుంది. సరైన డేట్ కోసం చూస్తున్నాము" అని తెలిపారు. దీంతో సర్దార్ కు ఆడియో ఉండదనే వార్తలకు చెక్ చెప్పినట్లు అయ్యింది.


Pawan's Sardaar Gabbar Singh Making Video - 1

పవన్ ప్రతిష్టాత్మకంగా రెడీ చేస్తున్న చిత్రం 'సర్దార్ గబ్బర్ సింగ్'. ఈ చిత్రం ఆడియో ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఒక్క ప్రోమో తోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ చిత్రం ఆడియో ని మార్చి 18 న విడుదల చేయటానికి నిర్ణయించారని సమాచారం.


అలాగే ఆ ఆడియోని హైదరాబాద్ లోని గచ్చి బౌళి స్టేడియం గ్రౌండ్స్ లో గ్రాండ్ చేస్తే బావుంటుందని యోచిస్తున్నారు. అయితే అక్కడ ఫర్మిషన్ విషయమై ఏదన్నా సమస్య వస్తే నిజాం కాలేజి గ్రౌండ్స్ కు మార్చే అవకాసం ఉంది. ఆడియో వెన్యూపై రకరకాల ఆప్షన్స్ తర్జనబర్జనలు జరుగుతున్నాయి. వెన్యూ ఫైనలైజ్ చేసి అఫీషియల్ గా ప్రకటించాల్సి ఉంది.

English summary
Official Making Video -1 for Sardaar Gabbar Singh Movie. Starring Power Star Pawan Kalyan and Kajal Aggarwal. Coming to Cinemas this April.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu