»   » ప్రభాస్ కు వాయిస్ ఇచ్చి, పవన్ కు విలన్ గా తయరైన టీవీ ఆర్టిస్ట్

ప్రభాస్ కు వాయిస్ ఇచ్చి, పవన్ కు విలన్ గా తయరైన టీవీ ఆర్టిస్ట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: శరద్ కేల్కర్ ఈ పేరు ఎక్కడో విన్నట్లు ఉందా..అవును ఖచ్చితంగా వినే ఉంటారు. సర్దార్ గబ్బర్ సింగ్ విలన్ ఇతను. పవన్ కు ఆపోజిట్ గా నిలబడి ఛాలెంజ్ చేసే భైరవ్ సింగ్ పాత్ర అతనిది. అయితే ఓకే..ఇతనికీ ప్రభాస్ కు లింక్ ఏమిటీ అంటారా..ఉంది..అక్కడకే వస్తున్నాం.

ప్రభాస్ చిత్రం బాహుబలికి హిందీలో డబ్బింగ్ చెప్పింది ఈ నటుడే. బాహుబలి హిందీలో అంత పాపులర్ అయ్యిందంటే అందులో శరద్ కేల్కర్ పాత్ర సైతం ఉంది. ఈ విధంగా ఒక్కసారి లైమ్ లైట్ లోకి వచ్చి, పవన్ దృష్టిలో పడ్డాడు ఈ ఆర్టిస్టు. అంతకు ముందు వరకూ కేవలం హిందీ సీరియల్స్ లో ఓ సాధారణ నటుడు.ఇప్పుడు సర్దార్ గబ్బర్ సింగ్ రిలీజ్ కాక ముందే అతనికి ఆఫర్స్ వచ్చిపడుతున్నట్లు సమాచారం. ఎందుకంటే సర్దార్ రిలీజ్ అయ్యాక అతను పూర్తి స్ధాయి విలన్ పాత్రలకు తెలుగులో బిజీ అవుతాడని అంతా భావిస్తున్నారు. అయితే శరద్ కేల్కర్ మాత్రం ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ఒక్క సినిమా కూడా కమిట్ కాలేదని సమాచారం.


స్లైడ్ షోలో మిగతా విశేషాలు...


కలిసొచ్చింది

కలిసొచ్చింది

తెలుగు హీరోకు వాయిస్ ఇచ్చి మన్ననలు పొందిన శరద్.. తెలుగు సినిమా ద్వారానే వెండితెరకు పరిచయం అవుతుండటం విశేషమే మరి.శరద్ కేల్కర్ ఏమన్నాడంటే..'

శరద్ కేల్కర్ ఏమన్నాడంటే..'

ఎంతో అదృష్టం, పెట్టిపుట్టుంటే తప్ప బాహుబలి లాంటి సినిమాలకు పనిచేసే అదృష్టం దొరకదు.అలా ఎంపిక

అలా ఎంపిక

చాలా హిందీ సీరియల్స్ లో నా వాయిస్ విన్న కరణ్ జోహార్, బాహుబలి హిందీ వెర్షన్ కు హీరోకు డబ్బింగ్ నువ్వేచెప్పాలన్నప్పుడు సంతోషంగా ఒప్పుకున్నా.వెయిట్ చేస్తున్నా

వెయిట్ చేస్తున్నా

సినిమా రిలీజయ్యాక ఎన్ని సంచలనాలు నమోదయ్యాయో తెలిసిందే. ఇక బాహుబలి 2 హిందీ డబ్బింగ్ ఎప్పుడెప్పుడా అని ఆలోచిస్తున్నా.అదొక్కటేనా

అదొక్కటేనా

దాంతోపాటు నేను తొలిసారిగా వెండితెరపై నటించిన 'సర్దార్ గబ్బర్ సింగ్' విడుదల కోసం ఎప్పుడెప్పుడా అన్నట్లు ఎదురుచూస్తున్నా.అదే ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది

అదే ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది

స్క్రీన్ టెస్ట్ కాకముందే పవన్ సార్ నన్ను విలన్ గా ఓకే చేయడం ఆత్మవిశ్వాసాన్ని కలిగించింది' అంటూ భావోద్వేగంగా స్పందించాడు శరద్ కేల్కర్.దుర్మార్గుడైన

దుర్మార్గుడైన

సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలో దుర్మార్గుడైన భూస్వామిపాత్రలో నటిస్తున్న శరద్, తనకు ఆడిషన్ జరగకముందే, పవన్ తనను ఆ పాత్రకు ఎంపిక చేశారని చెప్పాడు.నో స్క్రీన్ టెస్ట్

నో స్క్రీన్ టెస్ట్

స్క్రీన్ టెస్ట్ కూడా కాకముందే తనను ఎంపిక చేయటం తనకు ఎంతో ఆత్మవిశ్వాసాన్ని కలిగించిందని చెప్పారు.ఆనందం రెట్టింపు

ఆనందం రెట్టింపు

పవన్ తో కలిసి నటించడం మొదలుపెట్టాక ఆ రెట్టింపయ్యిందని, తన ఆనందాన్ని మీడియాతో పంచుకున్నాడు.


కీలక పాత్రలు

కీలక పాత్రలు

ఉత్తరాదిన టీవీ సీరియల్స్ తో పాటు రామ్ లీలా, రాఖీ హ్యాండ్సమ్ లాంటి చిత్రాల్లో కీలక పాత్రల్లో కనిపించారు శరద్ కేల్కతొలిసారిగా...

తొలిసారిగా...

తాను మహరాష్ట్రలో షూటింగ్ జరుగుతుండగా సర్దార్ టీంతో జాయిన్ అయ్యానని, దాదాపు 1000 మందితో ఆ షూటింగ్ జరగడం ఆశ్చర్యంగా అనిపించిందన్నాడు.గొప్ప వ్యక్తి

గొప్ప వ్యక్తి

ఇప్పటివరకు తను కలిసి నటించినవారిలో పవన్ అందరికన్నా గొప్ప వ్యక్తి అంటూ పొగిడాడు.హిందీకు ప్లస్ అవుతాడనే

హిందీకు ప్లస్ అవుతాడనే

సర్దార్ గబ్బర్ సింగ్... ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 8న తెలుగు వెర్షన్ తో పాటు చాలా హిందీలోనూ విడుదల చేయాలని నిర్మాతలు నిర్ణయించారు కాబట్టి హిందీకు ప్లస్ అవుతుందనే శరద్ ని తీసుకున్నట్లు సమాచారం.


కాకూడదు..

కాకూడదు..

చిత్ర నిర్మాణం కొన్ని ఏరియాలకు, కొంతమందికి మాత్రమే పరిమితం కాకూడదని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో తమ చిత్రం ఒక దేశంలోని వివిధ భాషలను ప్రత్యేకించి హిందీ భాషతో మమేకం కావడానికి తోడ్పడుతుందని ఆయన ప్రకటనలో తెలిపారు.


పోలీస్ అధికారి

పోలీస్ అధికారి

తెలంగాణ, చత్తీస్ ఘఢ్, మధ్యప్రదేశ్ సరిహద్దులో పనిచేసే చురుకైన పోలీసు అధికారి గబ్బర్ సింగ్ పాత్రలో కనిపించనున్నాడని ఎరోస్ ఇంటర్నేషనల్ మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ లుల్లా వెల్లడించారు.


మంచి రెస్పాన్స్

మంచి రెస్పాన్స్

హిందీలోనూ ఈ సినిమా టీజర్ ప్రోమోలకు అమోఘమైన రెస్పాన్స్ వచ్చిందన్నారు.ఫెరఫెక్ట్ ఛాయిస్

ఫెరఫెక్ట్ ఛాయిస్

పవన్‌ను డీ కొట్టే రోల్‌లో శరద్ సరిగ్గా సరిపోతారని అభిమానులు తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో తెలుపుతున్నారు.ఎంతో ఫ్రీడమ్..

ఎంతో ఫ్రీడమ్..

పవన్ సర్దార్ సినిమాకు క్రియేటివ్ హెడ్ అయినా, తనకు యాక్టింగ్ పరంగా ఎంతో ఫ్రీడమ్ ఇచ్చాడని, అలాంటి క్రియేటివ్ జీనియస్ ను తానింత వరకూ చూడలేదని శరద్ అంటున్నాడు.విద్యార్ది

విద్యార్ది

పవన్ ఒక మూవీ ఇన్ స్టిట్యూషన్ అని, ఆయన స్కూల్లో తానొక విద్యార్ధి లాంటి వాడినంటున్నాడు.అప్పటినుంచీ..

అప్పటినుంచీ..

2004లో హల్ చల్ సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. 1920 ఈవిల్ రిటర్న్స్, జాన్ అబ్రహాం రాకీ హ్యాండ్సమ్ సినిమాలతో పేరు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం శరద్ నటించిన రుస్తుం, సర్దార్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇవే కాక సిఐడీ లాంటి అనేక టీవీ సీరియల్స్ లో నటించడం విశేషం.English summary
Sharad, who is eagerly awaiting the release of Sardaar Gabbar Singh, excitedly claims that he has fans in Hyderabad and Visakhapatnam as most of his Hindi serials are dubbed into Telugu.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu